MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Feature
  • Temple Bells: ఈ ప్రముఖ దేవాలయాల్లో గంటలు ఎవరూ కొట్టకుండానే మోగుతాయి.. ఇదొక మిస్టరీ

Temple Bells: ఈ ప్రముఖ దేవాలయాల్లో గంటలు ఎవరూ కొట్టకుండానే మోగుతాయి.. ఇదొక మిస్టరీ

Temple Bells: మనదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలలో గంటలు భక్తులు కొట్టకుండా గణగణమంటూ మోగుతున్నాయి. ఇలా ఎందుకు మోగుతున్నాయో ఎవరికీ తెలియదు. ఇదొక మిస్టరీ అని చెప్పుకుంటారు స్థానికులు. ఆ దేవాలయాలు ఎక్కడున్నాయో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 04 2026, 10:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కొట్టకుండా మోగే గుడి గంటలు
Image Credit : Gemini

కొట్టకుండా మోగే గుడి గంటలు

భారతదేశంలో ఆధ్యాత్మికతకు నిలయం. అలాగే ఎన్నో వింత సంఘటనలు జరిగే ప్రదేశాలు కూడా ఉన్నాయి. మన దేశంలోని కొన్ని పురాతన దేవాలయాలు కేవలం నిర్మాణ శైలిలోనే కాకుండా, అనేక రహస్యాలను కూడా దాచుకున్నాయి. మరదేశంలోని ఆరు ప్రసిద్ధ దేవాలయాలలో గంటలు ఎవరూ కొట్టకుండానే తమంతట తాముగా మ్రోగుతున్నాయని చెప్పుకుంటారు. సైన్స్ ప్రకారం ఇవి గాలి వల్ల లేదా ప్రకంపనల వల్ల జరుగుతాయని భావించినప్పటికీ, భక్తులు మాత్రం దీనిని దైవలీలగా చెప్పుకుంటారు. నాగేశ్వర జ్యోతిర్లింగం, శ్రీ మహాలక్ష్మి దేవాలయం, కామాఖ్యా దేవి ఆలయం, జగన్నాథ పురి, కేదారనాథ్, చింతపూర్ణి ఆలయాలలో ఇలా జరుగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నాగేశ్వర జ్యోతిర్లింగం
Image Credit : Tripadvisor

నాగేశ్వర జ్యోతిర్లింగం

గుజరాత్‌లోని ద్వారకలో ఉన్న నాగేశ్వర జ్యోతిర్లింగం ఎంతో మహిమగల దేవాలయం. ఇక్కడ కొన్ని ప్రత్యేక సమయాల్లో, మనుషులెవరూ తాకకుండానే గంటలు మ్రోగడం స్థానికులు గమనించారు. శాస్త్రవేత్తలు గాలి ప్రవాహం వల్ల ఇలా జరగవచ్చని చెబుతుంటే, భక్తులు మాత్రం ఇది పరమశివుని లీలగా చెప్పుకుంటారు. అలాగే, మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో గల మహాలక్ష్మి ఆలయంలో పండుగ సమయాల్లో గంటలు వాటంతట అవే మ్రోగుతాయని అంటారు. అమ్మవారు తమ భక్తుల ప్రార్థనలను ఆలకిస్తున్నారనడానికి ఇదొక నిదర్శనమని భక్తులు భావిస్తారు.

Related Articles

Related image1
Last Indian Railway Station: మనదేశ చిట్టచివరి రైల్వే స్టేషన్ ఇదే.. ఇక్కడ నుంచి వేరే దేశం మొదలవుతుంది
Related image2
Leftover Dal Recipe: పప్పు మిగిలిపోయిందా? ఇలా మసాలా పూరీ చేస్తే చాలా టేస్టీ ఉంటుంది
34
కామాఖ్య దేవి టెంపుల్
Image Credit : Wikipedia

కామాఖ్య దేవి టెంపుల్

అస్సాంలోని కామాఖ్యా దేవి ఆలయం శక్తి పీఠాలలో అత్యంత ప్రధానమైనది. ఇక్కడ అంబుబాచి మేళా సమయంలో గంటలు వింతగా మోగుతుంటాయి. ఇక ఒడిశాలోని జగన్నాథ పురి ఆలయంలో కూడా గంటలు మోగడం ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయింది. ముఖ్యంగా ప్రధాన పూజా కార్యక్రమాల సమయంలో, గంటలు ఒక క్రమపద్ధతిలో మ్రోగడం భక్తులకు వింతైన అనుభూతిని ఇస్తుంది.

44
కేదార్ నాథ్ ఆలయం
Image Credit : Wikipedia

కేదార్ నాథ్ ఆలయం

హిమాలయాల్లోని కేదారనాథ్ ఆలయం, హిమాచల్ ప్రదేశ్‌లోని చింతపూర్ణి ఆలయాలలో కూడా ఇలాగే జరుగుతుంది. కేదారనాథ్‌లో తుఫాను సమయాల్లో, అర్ధరాత్రి వేళల్లో ఎవరూ లేనప్పుడు గంటలు మ్రోగడం అక్కడి పూజారులకు కొత్తేమీ కాదు. గాలి వేగం వల్లనే కావచ్చు అని కొందరు చెబుతున్నా, ఆ ధ్వనిలో ఒక లయబద్ధత ఉండటం విశేషం. అదేవిధంగా చింతపూర్ణి ఆలయంలో ప్రార్థనల సమయంలో మ్రోగే గంటలు భక్తులకు చాలా వింతగా అనిపిస్తాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Jail Food : జైలులోని ఖైదీలకు ఏమేం ఫుడ్ ఐటమ్స్ పెడతారో తెలుసా?
Recommended image2
Interesting Facts : జైళ్లను అద్దెకిచ్చే దేశమేదో తెలుసా?
Recommended image3
Snakes : మనుషుల్లాగే పాములు కూడా స్నానం చేస్తాయా? నీటిలో ఎక్కువగా ఎందుకుంటాయి?
Related Stories
Recommended image1
Last Indian Railway Station: మనదేశ చిట్టచివరి రైల్వే స్టేషన్ ఇదే.. ఇక్కడ నుంచి వేరే దేశం మొదలవుతుంది
Recommended image2
Leftover Dal Recipe: పప్పు మిగిలిపోయిందా? ఇలా మసాలా పూరీ చేస్తే చాలా టేస్టీ ఉంటుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved