MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Gold Sweet: మనదేశంలోనే ఖరీదైన స్వీట్ ఇది.. దీని ధరతో ఒక బైక్ కొనేయచ్చు, ఈ స్వీట్ ఎక్కడ దొరుకుతుందంటే

Gold Sweet: మనదేశంలోనే ఖరీదైన స్వీట్ ఇది.. దీని ధరతో ఒక బైక్ కొనేయచ్చు, ఈ స్వీట్ ఎక్కడ దొరుకుతుందంటే

Gold Sweet: మనదేశంలో ఎన్నో రకాల స్వీట్లు ఉన్నాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్వీట్ ప్రసిద్ధి. అయితే మనదేశంలో అతి ఖరీదైన స్వీట్ ఒకటుంది. దీన్ని కేజీ ధరతో ఏకంగా ఒక బైక్ కొనేసుకోవచ్చు. ఆ స్వీట్ పేరేంటో.. ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Nov 03 2026, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
అతి ఖరీదైన స్వీట్ ఇదే
Image Credit : Gemini AI

అతి ఖరీదైన స్వీట్ ఇదే

సాధారణంగా పండుగల సమయాల్లో మిఠాయిలు కొనేటప్పుడు కేజీ ధర నాలుగైదు వందల నుంచి మహా అయితే రెండు వేల రూపాయల వరకు చూస్తుంటాం. కానీ ఒకే ఒక్క కేజీ స్వీట్ ఖరీదు ఏకంగా లక్ష రూపాయలకు పైగా ఉందంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని ‘త్యోహార్ స్వీట్స్’ వారు తయారు చేసే ‘స్వర్ణ ప్రసాదం’ స్వీట్ ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత ఖరీదైన మిఠాయిగా నిలిచింది. ఈ స్వీట్ కేజీ ధర అక్షరాలా లక్షా పదకొండు వేల రూపాయలు. కేవలం ఒకే ఒక్క ముక్క రుచి చూడాలన్నా దాదాపు మూడు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక కేజీ స్వీట్ కొనడానికి పెట్టే డబ్బులతో షోరూమ్‌కి వెళ్లి కొత్త బైక్‌ను సులభంగా కొనుగోలు చేయవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఎందుకంత ఖరీదు?
Image Credit : Thyohaar

ఎందుకంత ఖరీదు?

ఇంత భారీ ధరకు కారణం ఇందులో వాడే అద్భుతమైన దినుసులే. ఈ స్వీట్‌ను తినదగిన స్వచ్ఛమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు పొడితో తయారు చేస్తారు. పైభాగంలో బంగారు పూతతో మెరిసిపోతూ ఇది అచ్చం ఆభరణంలా కనిపిస్తుంది. అంతేకాకుండా కాశ్మీరీ కుంకుమపువ్వు, ఖరీదైన చిల్‌గోజా (పైన్ నట్స్), బాదం, జీడిపప్పు, పిస్తా, ప్రత్యేకమైన బ్లూబెర్రీలను మేళవించి దీన్ని రూపొందిస్తారు. ఆయుర్వేద పద్ధతుల ప్రకారం బంగారు పొడి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. ఇలా పోషకాలు, రాజసం కలగలిసిన అరుదైన మిశ్రమమే ఈ మిఠాయిని అంత ప్రత్యేకంగా మార్చింది.

33
ప్రెజెంటేషన్ కూడా అదిరిపోతుంది
Image Credit : Thyohaar

ప్రెజెంటేషన్ కూడా అదిరిపోతుంది

కేవలం రుచిలోనే కాకుండా ఈ మిఠాయి ప్రెజెంటేషన్ కూడా ఎంతో విలాసవంతంగా ఉంటుంది. దీని రాజసాన్ని ప్రతిబింబించేలా ఖరీదైన నగల పెట్టెలను పోలిన ప్రత్యేకమైన బాక్సులలో ప్యాక్ చేసి అందిస్తారు. రాయల్ గిఫ్టింగ్ కోసం, సంపన్న వర్గాల వేడుకల కోసం ఈ స్వీట్‌ను ప్రత్యేకంగా ఆర్డర్ చేస్తుంటారు. ఇదే షాపులో కేజీ ఎనభై ఐదు వేల రూపాయల విలువ చేసే స్వర్ణ భస్మ భారత్, కేజీ యాభై ఎనిమిది వేల రూపాయల వెండి భస్మం స్వీట్లను కూడా తయారు చేస్తున్నారు. ఏది ఏమైనా సంపద, సాంప్రదాయం మేళవించిన ఈ గోల్డెన్ స్వీట్ మిఠాయి ప్రియులను అమితంగా ఆకట్టుకుంటోంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
మనిషి చనిపోయాక జుట్టు, గోళ్లు పెరుగుతాయన్నది నిజమేనా? సైన్సు చెప్పింది వింటే షాకవుతారు
Recommended image2
Study Abroad : తక్కువ ఖర్చుతో విదేశీ విద్య.. ఈ దేశాలపై ఓ లుక్కేయండి
Recommended image3
Flight Baggage rules : విమానం మ్యాగ్జిమమ్ టేకాఫ్ వెయిట్ అంటే ఏమిటి? లగేజీ రూల్స్ వెనక ఇంత సైన్స్ దాగుందా!
Related Stories
Recommended image1
మనిషి చనిపోయాక జుట్టు, గోళ్లు పెరుగుతాయన్నది నిజమేనా? సైన్సు చెప్పింది వింటే షాకవుతారు
Recommended image2
Fridge Cleaning: ఈ పదార్థంతో తుడిచారంటే పాత ఫ్రిజ్ కూడా కొత్తదానిలా మెరిసిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved