Telugu

తక్కువ ఖర్చుతో విదేశీ విద్య.. ఈ దేశాలపై ఓ లుక్కేయండి

Telugu

జర్మనీ

జర్మనీ యూనివర్సిటీలు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ట్యూషన్ ఫీజు వసూలు చేయవు. కేవలం 150 నుంచి 250 యూరోలు (రూ. 16,200 నుంచి రూ. 27,000) అడ్మినిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.

Image credits: Getty
Telugu

ఫ్రాన్స్

ఫ్రాన్స్‌లో ఉన్నత విద్యకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఇక్కడి పబ్లిక్ యూనివర్సిటీలు విద్యార్థుల నుంచి ఏడాదికి కేవలం 170 యూరోలు (రూ. 18,365) మాత్రమే ఫీజుగా తీసుకుంటాయి.

Image credits: Getty
Telugu

నార్వే

నార్వేలో యూరోపియన్ విద్యార్థులకు చదువు పూర్తిగా ఉచితం. ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను స్థానిక భాషలో బోధిస్తారు. మాస్టర్స్, పీహెచ్‌డీ కోర్సులను మాత్రం ఇంగ్లీష్‌లోనే చెబుతారు.

Image credits: Getty
Telugu

ఆస్ట్రియా

ఆస్ట్రియాలో యూరోపియన్ విద్యార్థులకు ఉన్నత విద్య పూర్తిగా ఉచితం. అయితే అంతర్జాతీయ విద్యార్థులు మాత్రం ప్రతి సెమిస్టర్‌కు 726 యూరోలు (రూ. 78,430) ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.

Image credits: Freepik
Telugu

గ్రీస్

గ్రీస్‌లోని ప్రభుత్వ యూనివర్సిటీలు, కాలేజీల్లో యూరోపియన్ విద్యార్థులకు ట్యూషన్ ఫీజు ఉండదు. కానీ యూరప్ బయటి నుంచి వచ్చే విద్యార్థులు మాత్రం 1,500 యూరోలు (రూ. 1,62,000) చెల్లించాలి.

Image credits: Getty
Telugu

స్పెయిన్

స్పెయిన్‌లో యూరోపియన్ విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు తక్కువగా ఉంటాయి. కానీ అంతర్జాతీయ విద్యార్థులకు మాత్రం ఈ ఫీజులు రూ. 81,000 నుంచి రూ. 2,70,000 వరకు ఉంటాయి.

Image credits: Getty

Richest Caste In Telangana : తెలంగాణలో అత్యంత ధనిక కులం ఏదో తెలుసా?

Beautiful Villages In India : దేశంలోనే అత్యంత అందమైన 5 గ్రామాలు ఇవే

పెంగ్విన్స్, ఎలుకలు కూడా లవ్ చేసుకుంటాయా? ఎలా ప్రపోజ్ చేసుకుంటాయి?

సముద్రాల్లోని నీరు వేడెక్కితే చేపలు ఏమవుతాయి?