MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Bharat Ratna vs Padma Vibhushan : ఇండియాలో అత్యున్నత పురస్కారం ఏది? ఏ అవార్డుకు ఎంత డబ్బు ఇస్తారో తెలుసా?

Bharat Ratna vs Padma Vibhushan : ఇండియాలో అత్యున్నత పురస్కారం ఏది? ఏ అవార్డుకు ఎంత డబ్బు ఇస్తారో తెలుసా?

భారత ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి భారత రత్న, పద్మ, దాదాసాహెబ్ ఫాల్కే లాంటి అవార్డులు ఇస్తుంది. అయితే ఈ అవార్డుల్లో అత్యున్నతమైనది ఏది? గెలుచుకున్న వారికి ఎంత డబ్బు ఇస్తారు? అనేది ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 24 2026, 02:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారత రత్న vs పద్మ విభూషణ్
Image Credit : Gemini AI

భారత రత్న vs పద్మ విభూషణ్

దేశంలో ప్రతిష్ఠాత్మకమైన అవార్డు అందుకోవడం అంటే ప్రతి ఒక్కరికీ గర్వకారణమే. ముఖ్యంగా భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ వంటి పురస్కారాలు అందుకున్న వ్యక్తులకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అయితే ఇలాంటి అత్యున్నత అవార్డులు అందుకున్న వారికి భారీ మొత్తంలో నగదు బహుమతి కూడా ఇస్తారనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అసలు దేశంలో అత్యున్నత పురస్కారం ఏది? నిజంగానే అవార్డు గ్రహీతలు భారీ నగదు అందుకుంటారా? తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారత రత్నకు ఎంత నగదు ఇస్తారు?
Image Credit : Gemini AI

భారత రత్నకు ఎంత నగదు ఇస్తారు?

భారతదేశంలో వివిధ రంగాల్లో సేవలు అందించినవారికి అనేక అవార్డులు ఇస్తారు... కానీ అన్నింటికన్నా ఉన్నత పౌర పురస్కారం భారత రత్న. కళలు, సాహిత్యం, విజ్ఞానం, క్రీడలు, ప్రజా సేవ వంటి విభిన్న రంగాల్లో అసాధారణ సేవలు అందించిన ప్రముఖులకు ఈ గౌరవాన్ని అందిస్తారు.

భారత రత్న దేశంలోనే ప్రతిష్ఠాత్మక పురస్కారం.. దీనికోసం చాలామంది కలలుకంటారు. అయితే ఇదికే కేవలం అవార్డు మాత్రమే... అవార్డు గ్రహీతకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నగదు బహుమతి ఇవ్వదు. భారత రత్నబిరుదుతో పాటు ఒక పతకం, సర్టిఫికెట్ మాత్రమే అందజేస్తారు. భారత రాష్ట్రపతి చేతులమీదుగా ఈ పురస్కారం అందిస్తారు.

భారత రత్న అవార్డు గ్రహీతలకు నగదు దక్కకున్నా అంతకుమించిన గౌరవం, గుర్తింపు లభిస్తుంది. వీరికి విదేశాల్లో పర్యటించేందుకు ప్రత్యేకంగా డిప్లోమాటిక్ పాస్ పోర్ట్ ఉంటుంది... అలాగే ఎక్కడికి వెళ్లినా విఐపి ప్రోటో కాల్ ఉంటుంది. విమాన, రైలు, బస్సు టికెట్స్ లో కూడా రాయితీ ఉంటుంది.

35
పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీకి డబ్బులు వస్తాయా?
Image Credit : Gemini AI

పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీకి డబ్బులు వస్తాయా?

భారతదేశంలోని ప్రముఖ పౌర పురస్కారాల్లో పద్మ అవార్డులు కూడా కీలకమైనవి. వీటిని మూడు విభాగాలుగా అందిస్తారు. అవి పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ. భారత రత్న మాదిరిగానే కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వైద్యం, సాహిత్యం, క్రీడలు, పరిశ్రమ వంటి అనేక రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి ఈ గౌరవాలు అందుతాయి.

అయితే ఈ మూడు పురస్కారాలకు కూడా నగదు బహుమతి ఉండదు. అవార్డు గ్రహీతలకు పతకం, సర్టిఫికెట్ అందిస్తారు. ప్రత్యేకంగా ప్రైజ్ మనీ లేదా నెలవారీ నగదు భత్యం ఇవ్వడం ఈ పురస్కారాల నిబంధనల్లో లేదు. అంటే పద్మ విభూషణ్ వచ్చినా, పద్మ భూషణ్ వచ్చినా, పద్మశ్రీ వచ్చినా ప్రత్యేక గుర్తింపు, గౌరవమే తప్ప డబ్బులు రావన్నమాట.

45
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు రూ.10 లక్షల ప్రైజ్ మనీ
Image Credit : ANI

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు రూ.10 లక్షల ప్రైజ్ మనీ

సినిమా రంగానికి సంబంధించిన అత్యున్నత జాతీయ గౌరవాల్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఒకటి. భారతీయ చలనచిత్ర రంగం అభివృద్ధికి జీవితకాలం విశేష కృషి చేసిన ప్రముఖులను గుర్తించి ఈ పురస్కారాన్ని అందిస్తారు. భారత ప్రభుత్వ అధికారిక సమాచార ప్రకారం... 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు రూ.10 లక్షల నగదు బహుమతి ఉంది. దీనితో పాటు స్వర్ణ కమలం, శాలువా అందజేస్తారు. 2026 సెప్టెంబర్ 22న జరిగిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో సీనియర్ నటుడు అనంత్ నాగ్‌ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేశారు.

55
ఈ అవార్డులు డబ్బుకు మించిన గౌరవం తెచ్చిపెడతాయి..
Image Credit : Gemini

ఈ అవార్డులు డబ్బుకు మించిన గౌరవం తెచ్చిపెడతాయి..

భారతదేశంలోని అత్యున్నత పురస్కారాలను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. ప్రతిష్ఠాత్మకమైన అవార్డు అందుకున్నంత మాత్రాన భారీ మొత్తంలో నగదు చేతికి వస్తుందని అనుకోవడం సరైంది కాదు.

భారత రత్న, పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ వంటి పురస్కారాల ప్రధాన ఉద్దేశం దేశానికి, సమాజానికి, తమ తమ రంగాలకు విశేష సేవలు అందించిన వ్యక్తులను గౌరవించడం. అందుకే వీటి విలువను నగదు మొత్తంతో కొలవలేం. మరోవైపు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మాత్రం గౌరవంతో పాటు నగదు బహుమతిని కూడా అందించే పురస్కారంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ అవార్డుకు రూ.10 లక్షల ప్రైజ్ మనీ ఉంది.

కాబట్టి ‘దేశంలోనే పెద్ద అవార్డు అంటే భారీ నగదు బహుమతి కూడా వస్తుంది’ అనే భావన పూర్తిగా నిజం కాదు. కొన్ని పురస్కారాలు ఆర్థిక ప్రయోజనం కంటే దేశవ్యాప్తంగా లభించే గౌరవం, గుర్తింపు, జీవితకాల సేవలకు ఇచ్చే ప్రశంసకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాయి. అదే ఈ జాతీయ పురస్కారాల అసలు ప్రత్యేకత.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
YouTube Income : 500M సబ్‌స్క్రైబర్స్, ఏటా రూ.800 కోట్ల ఇన్కమ్.. ఈ టాప్ యూట్యూబర్ ఎవరో తెలుసా?
Recommended image2
Hyderabad : హైదరాబాద్ ను పట్నం, సికింద్రాబాద్ ను లష్కర్ అని ఎందుకంటారు? ఈ పేర్ల వెనక ఇంత హిస్టరీ ఉందా..!
Recommended image3
IRCTC PUNYA KSHETRA YATRA: తెలుగు భక్తులకు అదిరిపోయే టూర్ ప్యాకేజీ.. రూ.17,000లతోనే కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్ దర్శనం
Related Stories
Recommended image1
భారత రత్న కోసం అన్నాచెల్లెలి పోటీ
Recommended image2
Bharat Ratna Award Winners: ఇప్పటివరకు ఎంతమందికి 'భారతరత్న' ఇచ్చారంటే..? పూర్తి జాబితా ఇదిగో.. 
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved