MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • Airline Rules : విమానంలో స్మోకింగ్ నిషేధం, మరి బాత్రూంలో యాష్ ట్రే ఎందుకుంటుంది?

Airline Rules : విమానంలో స్మోకింగ్ నిషేధం, మరి బాత్రూంలో యాష్ ట్రే ఎందుకుంటుంది?

ఫ్లైట్ ఎక్కాలంటే టికెట్, పాస్ పోర్ట్ ఉంటే సరిపోదు… కొన్ని రూల్స్ కచ్చితంగా తెలిసి ఉండాలి. అయితే ఆశ్చర్యకరమైన విమానయాన నిబంధనల గురించి ఈ ఫొటో గ్యాలరీలో చూద్దాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 20 2026, 08:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
విమానంలో విచిత్రమైన రూల్స్
Image Credit : Getty

విమానంలో విచిత్రమైన రూల్స్

విమానంలో ప్రయాణించేటప్పుడు ఎయిర్‌హోస్టెస్ లేదా సిబ్బంది అనేక నియమాలను పాటించమని చెబుతుంటారు. "ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో పెట్టండి", "కిటికీ షేడ్స్ తెరవండి", "సీట్ బెల్ట్ పెట్టుకోండి" అని తరచూ సూచనలు ఇస్తుంటారు. బయటకు ఇవి సాధారణంగా లేదా కొన్నిసార్లు విసుగు తెప్పించేలా అనిపించినా... వీటి వెనుక అత్యంత శాస్త్రీయమైన, ప్రాణరక్షణ కారణాలు ఉన్నాయి. విమానయాన రంగంలో ప్రతి నియమం ప్రయాణికుల భద్రత కోసమే రూపొందించబడింది. అలాంటి కొన్ని విచిత్రమైన, ఆసక్తికరమైన ఎయిర్‌లైన్స్ రూల్స్, వాటి వెనుక ఉన్న అసలు కారణాల గురించి తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. సెల్‌ఫోన్ 'ఫ్లైట్ మోడ్' లో ఎందుకు పెట్టాలి?
Image Credit : AI Generated photo

1. సెల్‌ఫోన్ 'ఫ్లైట్ మోడ్' లో ఎందుకు పెట్టాలి?

విమానం టేకాఫ్, ల్యాండింగ్ అయ్యేటప్పుడు సెల్‌ఫోన్‌ను 'ఫ్లైట్ మోడ్'లో పెట్టాలి... ఇలా చెప్పడానికి కారణం ఉంది. విమానం కమ్యూనికేషన్ సిస్టమ్స్‌లో (రేడియో సిగ్నల్స్) ఎలాంటి అంతరాయం కలగకుండా ఇది నిరోధిస్తుంది. సెల్‌ఫోన్ సిగ్నల్స్ పైలట్ల హెడ్‌సెట్‌లో అనవసరమైన శబ్దాన్ని (Static noise) సృష్టించగలవు… అందుకే అందరి మొబైల్స్ ప్లైట్ మోడ్ పెట్టమంటారు. ఇది కచ్చితంగా పాటించాల్సిన రూల్.

36
2. ల్యాండింగ్ సమయంలో లైట్లు ఎందుకు ఆర్పుతారు?
Image Credit : ANI

2. ల్యాండింగ్ సమయంలో లైట్లు ఎందుకు ఆర్పుతారు?

రాత్రిపూట విమానం ల్యాండ్ అయ్యేటప్పుడు లేదా టేకాఫ్ అయ్యేటప్పుడు విమానం లోపలి ప్రధాన లైట్లను మసకబారుస్తారు (Dim lights). ఇలా ఎందుకు చేస్తారో తెలుసా? ఏదైనా అత్యవసర పరిస్థితి (Emergency) ఏర్పడి వెంటనే బయటకు రావాల్సి వస్తే, ప్రయాణికుల కళ్లు బయటి చీకటికి త్వరగా అలవాటు పడాలి. వెలుతురు నుంచి ఒక్కసారిగా చీకట్లోకి వెళ్తే కళ్లు వెంటనే కనపడవు, అందుకే ముందే ఈ ఏర్పాటు చేస్తారు.

46
3. కిటికీ షేడ్స్ ఎందుకు తెరిచి ఉంచాలి?
Image Credit : Getty

3. కిటికీ షేడ్స్ ఎందుకు తెరిచి ఉంచాలి?

ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో కిటికీ షేడ్స్‌ను ఎల్లప్పుడూ తెరిచి ఉంచాలి. ఎందుకంటే బయట ఏదైనా ప్రమాదం (ఫైర్ లేదా ఇంజన్ సమస్య) జరిగితే, దాన్ని కేబిన్ సిబ్బంది లేదా ప్రయాణికులు వెంటనే గమనించి పైలట్‌ను అప్రమత్తం చేయడానికి ఇది సహాయపడుతుంది. అంతేకాకుండా అత్యవసర సమయంలో బయట వాతావరణం ఎలా ఉందో స్పష్టంగా కనిపిస్తుంది.

56
4. సీటును స్ట్రెయిట్‌గా ఉంచాలి
Image Credit : TM

4. సీటును స్ట్రెయిట్‌గా ఉంచాలి

విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో సీటును వెనక్కి వాల్చకూడదు, ముందుండే ట్రే టేబుల్‌ను మడతపెట్టాలి. ఎందుకంటే అత్యవసర సమయంలో ప్రయాణికులు వేగంగా సీటు నుంచి బయటకు రావడానికి ఇవి అడ్డంకిగా మారకూడదనే ఉద్దేశంతోనే ఈ రూల్ పెట్టారు. సీటు వెనక్కి వాలి ఉంటే వెనుక ఉన్నవారికి బయటకు రావడానికి దారి ఇరుకుగా మారుతుంది.

66
5. విమానం బాత్రూమ్‌లలో 'యాష్ ట్రే' ఎందుకుంటుంది?
Image Credit : gemini

5. విమానం బాత్రూమ్‌లలో 'యాష్ ట్రే' ఎందుకుంటుంది?

విమానంలో ధూమపానం అంటే స్మోకింగ్ చేయడం సంపూర్ణంగా నిషేధం. అయినప్పటికీ విమానం బాత్రూమ్ తలుపుల వద్ద 'యాష్ ట్రే' (Ashtray) తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకంటే నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా దొంగతనంగా సిగరెట్ వెలిగిస్తే, దాన్ని చెత్తబుట్టలో వేస్తే నిప్పు అంటుకునే ప్రమాదం ఉంది. అందుకే సురక్షితంగా ఆర్పివేయడానికి అంతర్జాతీయ విమానయాన సంస్థలు (FAA) బాత్రూమ్‌లలో యాష్ ట్రే ఉండటాన్ని చట్టబద్ధం చేశాయి.

చూశారుగా..! విమానంలో చెప్పే ప్రతి నియమం వెనుక ప్రాణాలను కాపాడే ఒక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. కాబట్టి ఇకపై విమానంలో ప్రయాణించేటప్పుడు సిబ్బంది చెప్పే సూచనలను తప్పకుండా పాటించండి… ఎమర్జెన్సీ సమయంలో సురక్షితంగా ఉండండి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Food: 1960లలో మన తాతలు ఎలాంటి ఆహారం కొనుక్కుని తినేవారో తెలుసా?
Recommended image2
ఈ గ్రామంలో ఎవరూ మరణించకూడదు, జన్మించకూడదు... దేనికైనా ముందుగా పక్కఊరు వెళ్లాల్సిందే
Recommended image3
Hamsa: హంస పాలు - నీళ్లను ఎలా వేరు చేస్తుంది? పాలను మాత్రమే తాగి నీళ్లు ఎలా వదిలేస్తుంది?
Related Stories
Recommended image1
Flight Rules: మీరు ఎన్నిసార్లు విమానం ఎక్కినా..ఈ రూల్స్ మాత్రం తెలిసి ఉండవు..!
Recommended image2
Airline Rules: విమానం గాల్లో ఉండగా ప్యాసింజర్ చనిపోతే వెంటనే ల్యాండింగ్ చేస్తారా? చేయరా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved