MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Flight Rules: మీరు ఎన్నిసార్లు విమానం ఎక్కినా..ఈ రూల్స్ మాత్రం తెలిసి ఉండవు..!

Flight Rules: మీరు ఎన్నిసార్లు విమానం ఎక్కినా..ఈ రూల్స్ మాత్రం తెలిసి ఉండవు..!

Flight Rules: విమానంలో ప్రయాణించాలంటే టికెట్ కొంటే సరిపోదు... కొన్ని రూల్స్ కూడా తెలిసి ఉండాలి. మీ శరీరం నుంచి చెమట వాసన వచ్చినా కూడా మిమ్మల్ని విమానం నుంచి కిందకు దింపేస్తారని మీకు తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 20 2026, 03:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
విమానంలో ఈ రూల్స్ ఉన్నాయని మీకు తెలుసా?
Image Credit : Getty

విమానంలో ఈ రూల్స్ ఉన్నాయని మీకు తెలుసా?

Flight Rules: విమానం ఎక్కాలంటే చాలా మందికి ఓ భయం ఉంటుంది. ఎయిర్ పోర్టులో చాలా రూల్స్ ఉంటాయి, చెక్ ఇన్ అవ్వడం, సెక్యూరిటీ ఇదంతా పెద్ద ప్రాసెస్ అని అనుకుంటూ ఉంటారు. కానీ, మరి కొందరు.. నేను చాలా సార్లు విమానం ఎక్కాను.. నాకు అన్నీ తెలుసు అని అనుకుంటారు. కానీ, మీరు ఎన్నిసార్లు విమానం ఎక్కినా కూడా కొన్ని రూల్స్ మాత్రం మీకు కచ్చితంగా తెలిసి ఉండవు. విమానాల్లో కొన్ని వింత రూల్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ప్రయాణికులు తెలుసుకోవాల్సిన వింత రూల్స్..
Image Credit : Chatgpt AI

ప్రయాణికులు తెలుసుకోవాల్సిన వింత రూల్స్..

1. శరీరం నుంచి దుర్వాసన వస్తే...

మీ శరీరం నుంచి ఏదైనా దుర్వాసన వస్తున్నట్లయితే.. విమానం నుంచి మిమ్మల్ని దింపేసే అవకాశాలు ఉన్నాయి. చాలా కామెడీగా అనిపించొచ్చు. కానీ, ఇది నిజం. చాలా విమానయాన సంస్థలు ఈ రూల్స్ పాటిస్తున్నాయి. మీ శరీరం నుంచి వచ్చే దుర్వాసన ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగితే మిమ్మల్ని వెంటనే విమానం నుంచి దింపేస్తారు.

2.కరెంట్ షాక్ కూడా ఇస్తారు..

విమానంలో ఎవరైనా ప్రయాణికుడు హింసాత్మకంగా ప్రవర్తిస్తే.. టేజర్ ( ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చే సాధనం) కూడా ఇస్తారు. కొరియన్ ఎయిర్ లైన్స్ లో ఈ రూల్స్ ఉంటాయి. ఎయిర్ హోస్టెస్ కి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారు. ఎవరైనా విమానంలో తాగి గొడవ చేసినా వెంటనే టేజర్ తో షాక్ ఇచ్చి కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తారు.

3.లిక్విడ్స్ తీసుకువెళ్లే టెక్నిక్..

చాలా విమానాల్లో.. లిక్విడ్ ఫుడ్స్ ని అనుమతించరు. అయితే.. మీరు సింపుల్ టెక్నిక్ ని వాడి వాటిని తీసుకువెళ్లొచ్చు. ఉదాహరణకు నెయ్యి అనుమతి లేదు అనుకోండి.. మీరు దానిని ఫ్రీజ్ చేసి.. గడ్డ కట్టేలా చేసి.. అప్పుడు తీసుకువెళ్లొచ్చు. ఈ విషయం చాలా మందికి తెలీదు. జ్యూస్, సూప్ లాంటి వాటిని కూడా మీరు ఫ్రీజ్ చేసి తీసుకువెళ్లొచ్చు.

33
4.పైలెట్స్ ఇద్దరూ ఒకే రకమైన భోజనం ఇవ్వరు...
Image Credit : ANI

4.పైలెట్స్ ఇద్దరూ ఒకే రకమైన భోజనం ఇవ్వరు...

చాలా విమానయాన సంస్థల్లో పైలెట్స్ ఇద్దరికీ ఒకేలాంటి భోజనం అందించరు. ఎందుకంటే.. ఫుడ్ పాయిజన్ కారణంగా ఒకరికి ఇబ్బంది ఏర్పడినా.. మరో పైలెట్ ఆరోగ్యంగా ఉండి విమానాన్ని సురక్షితంగా నడపాలి. అందుకే ఇద్దరికీ డిఫరెంట్ ఫుడ్స్ ఇస్తారు.

5.పైలెట్స్ తమ పర్సనల్ విషయాలు మాట్లాడకూడదా?

విమానంలో పైలెట్స్ తమ పర్సనల్ విషయాలను విమానంలో మాట్లాడకూడదని మీకు తెలుసా? అయితే.. 10వేల అడుగుల కంటే తక్కువ ఎత్తులో ఉన్నప్పుడు పైలెట్లు విమానాల గురించి మాట్లాడాలి. కుటుంబ విషయాలు, వ్యక్తిగత సంబంధిత విషయాలు లాంటివి మాత్రం మాట్లాడకూడదు.

6.విమానంలో మీ సీటు ఎప్పుడైనా మారొచ్చు..

విమానంలో మీరు టికెట్ బుక్ చేసుకున్న తర్వాత.. అదే సీటు శాశ్వతం అని చాలా మంది అనుకుంటారు. కానీ, విమాన సిబ్బంది మీ సీటును ఎప్పుడైనా మార్చే అధికారం వారికి ఉంటుంది. మీ సీటు మార్చడానికి వారి దగ్గర చాలా కారణాలు ఉంటాయి.

7. కొన్ని రకాల దుస్తులు ధరిస్తే విమానం ఎక్కడానికి కూడా ఒప్పుకోరు...

కొన్ని విమానయాన సంస్థలు అభ్యంతరకరమైన సందేశాలు ఉన్న దుస్తులు, అసభ్యంగా భావించే దుస్తులు లేదా భద్రతకు ఆటంకం కలిగించే దుస్తులు ధరిస్తే.. విమానం ఎక్కనివ్వరు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
PopCorn: మొక్కజొన్న గింజ వేడి చేయగానే.. పాప్ కార్న్ గా ఎలా మారుతుంది..?
Recommended image2
Gold Earrings: డైలీవేర్‌కి ఈ కమ్మలు సూపర్‌గా ఉంటాయి.. ట్రై చేయండి!
Recommended image3
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Related Stories
Recommended image1
Premium Rice: ఈ బియ్యం కేజీ రూ.15వేలు, ఈ కేజీ బియ్యంతో ఇంట్లోకి 3 నెలల సరుకులు కొనచ్చు..!
Recommended image2
Clothing Sizes: రోజూ చూస్తాం కానీ అర్థం తెలియదు.. బట్టల సైజుల్లో ఉండే ఈ 'X' మీనింగ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved