- Home
- Feature
- Ramayana Collections Day 1: ప్రభాస్ ఆదిపురుష్ ను కూడా దాటలేకపోయిన రామాయణ కాలెక్షన్స్, ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే?
Ramayana Collections Day 1: ప్రభాస్ ఆదిపురుష్ ను కూడా దాటలేకపోయిన రామాయణ కాలెక్షన్స్, ఫస్ట్ డే ఎంత వసూలు చేసిందంటే?
Ramayana Collections Day 1: భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన రామాయణ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు ఎంత వసూలు చేసిందంటే?

రామాయణ పార్ట్ 1 కలెక్షన్స్..
రణ్బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం 'రామాయణం' బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ ను సాధించింది. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. భారీ అడ్వాన్స్ బుకింగ్లు, సానుకూల రివ్యూలతో ఈ మైథలాజికల్ ఎపిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ట్రేడ్ ట్రాకింగ్ పోర్టల్ సక్నిల్క్ (Sacnilk) అందించిన ప్రారంభ నివేదికల ప్రకారం, 'రామాయణం' చిత్రం విడుదల మొదటి రోజు భారతదేశంలో రూ. 64.85 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. దేశవ్యాప్తంగా పలు భాషల్లో మొత్తం 25,200 షోలలో ఈ సినిమా ప్రదర్శించబడగా, అత్యధికంగా హిందీ వెర్షన్ గణనీయమైన వసూళ్లను రాబట్టింది.
వివిధ భాషల్లో తొలి రోజు వసూళ్ల వివరాలు :
హిందీ: 20,678 షోల ద్వారా రూ. 47.50 కోట్లు
కన్నడ: 1,197 షోల ద్వారా రూ. 7.25 కోట్లు
తెలుగు: 1,776 షోల ద్వారా రూ. 6 కోట్లు
తమిళం: రూ. 2.60 కోట్లు
మలయాళం: 557 షోల ద్వారా రూ. 1.50 కోట్లు
ఈ చిత్రపు మొత్తం ఇండియా గ్రాస్ కలెక్షన్ రూ. 77.50 కోట్లుగా నమోదైంది. అయితే, విదేశీ మార్కెట్లకు సంబంధించిన తొలి రోజు వసూళ్ల వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. ఓవర్సీస్ కలెక్షన్లు కలిపితే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 100 కోట్ల మైలురాయిని దాటే అవకాశం ఉంది.
ఆదిపురుష్ ను దాటలేకపోయిన రామాయణ..
2026లో విడుదలైన చిత్రాల పరంగా చూస్తే, 'దురంధర్: ది రివెంజ్' తర్వాత అత్యధిక మొదటి రోజు వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా 'రామాయణం' నిలిచింది. షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్', రణ్బీర్ కపూర్ 'యానిమల్' చిత్రాల కంటే ముందు వరుసలో నిలిచింది. అయితే, ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' మొదటి రోజు సాధించిన వసూళ్ల రికార్డును మాత్రం ఈ సినిమా దాటలేకపోయింది.
అప్పట్లో 'ఆదిపురుష్' అన్ని భాషల్లో కలిపి తొలి రోజు రూ. 86.75 కోట్లు రాబట్టింది. అలాగే 2026లో 'దురంధర్: ది రివెంజ్' రూ. 102.55 కోట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. షారుఖ్ ఖాన్ 'జవాన్' తొలి రోజు రూ. 75 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఈ ఓపెనింగ్స్ తో అనుకన్న టార్గెట్ ను మూవీ టీమ్ సాధించగలదా అనేది చూడాలి. భారీ ఓపెనింగ్ సాధించిన ఆదిపురుష్ పరిస్థితి ఆతర్వాత ఏమయ్యిందో తెలిసిందే. మరి రామాయరణ అందరిని ఆకట్టుకుంటుందా?
దీపావళి దెబ్బ తప్పదా?
మొదటి రోజు సానుకూల స్పందన రావడంతో, లాంగ్ వీకెండ్ ,దీపావళి సెలవు దినాలు ఈ సినిమా కలెక్షన్లకు మరింత ఊతమిస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే, ఆదివారం దీపావళి కావడంతో సాయంత్రం వేళల్లో కలెక్షన్లపై కొంత ప్రభావం పడే అవకాశం ఉంది. సోమవారం నుంచి కొన్ని సెలవులు ఉండటం.. మంచి మౌత్ టాక్ కారణంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా చరిత్ర సృష్టించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా, రెండవ భాగం 2028 దీపావళికి విడుదల కానుంది. రెండు భాగాల కలిపి ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ సుమారు రూ. 4,000 కోట్లుగా ఉంది. నితేష్ తివారీ దర్శకత్వంలో, నమిత్ మల్హోత్రా , యశ్ మన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రంలో రాముడిగా రణ్బీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్ నటించారు. అలాగే సన్నీ డియోల్, రవి దూబే, అరుణ్ గోవిల్, లారా దత్తా, శోభన, వివేక్ ఒబెరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ - హాన్స్ జిమ్మర్ సంగీతం అందించారు.





