MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Bobbili Brahmanna Review: బాలకృష్ణకు చుక్కలు చూపించిన కృష్ణంరాజు సినిమా.. బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ

Bobbili Brahmanna Review: బాలకృష్ణకు చుక్కలు చూపించిన కృష్ణంరాజు సినిమా.. బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ

Bobbili Brahmanna Review: ఒకప్పుడు రెబల్ స్టార్ గా కృష్ణంరాజు ఇమేజ్ ఓ రేంజ్ లో ఉండేది. ఆయన సినిమాలకు డిమాండ్ బాగా ఉండేది. అటువంటి సినిమాల్లో బొబ్బిలి బ్రహ్మన్న కూడా ఒకటి. బాలయ్య లాంటి యంగ్ స్టార్ కే ఈ సినిమాతో చుక్కలు చూపించాడు రెబల్ స్టార్.

4 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 01 2026, 08:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ
Image Credit : Asianet News

బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్ యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్, న్యాయాన్యాయాల పోరాటాన్ని మేళవించి వచ్చిన సినిమాల్లో 'బొబ్బిలి బ్రహ్మన్న' ఒకటి. 1984లో రిలీజ్ అయిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించడమే కాకుండా, కృష్ణంరాజు సినీ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది. దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వ ప్రతిభకు, రెబల్ స్టార్ కృష్ణంరాజు నటనకు అద్దం పట్టిన ఈ క్లాసిక్ మాస్ ఎంటర్‌టైనర్ గురించి మరిన్ని వివరాలు రివ్యూ రూపంలో చూద్దాం.

బొబ్బిలి బ్రహ్మన్న కథ విషయానికి వస్తే..

'బొబ్బిలి బ్రహ్మన్న' కథ ఊరి పెద్ద, న్యాయ నిర్ణేత అయిన బొబ్బిలి బ్రహ్మన్న (కృష్ణంరాజు) చుట్టూ తిరుగుతుంది. బ్రహ్మన్న గ్రామ సర్పంచ్‌గా, న్యాయస్థానంతో పనిలేకుండా గ్రామంలో ఎలాంటి వివాదాలైనా ధర్మబద్ధంగా తీర్పు చెప్పే ధర్మపీఠం. ఆయన చెప్పిన తీర్పును గ్రామస్థులందరూ దైవశాసనంగా భావిస్తారు. ఊరిలో దుర్మార్గుడైన రాయుడు (రావు గోపాలరావు) తన స్వార్థం కోసం, అక్రమాల కోసం బ్రహ్మన్నను, ఆయన తీర్పులను అస్థిరపరచాలని కుట్రలు పన్నుతుంటాడు.

బ్రహ్మన్నకు రవి అనే తమ్ముడు ఉంటాడు. రవి పాత్రలోనూ కృష్ణంరాజే నటించడం ఈ చిత్రంలోని ప్రత్యేకత. రవి కస్తూరి (జయసుధ)ను ప్రేమిస్తాడు. మరోవైపు రాయుడు కుమారుడు బుల్లెబ్బాయి (కైకాల సత్యనారాయణ) దుర్మార్గపు పనులకు పాల్పడుతుంటాడు. అతడి ప్రవర్తన వల్ల గ్రామంలో సమస్యలు తలెత్తుతాయి.

ఒక సందర్భంలో బుల్లెబ్బాయి స్వరాజ్యం అనే యువతిపై అత్యాచారానికి పాల్పడతాడు. రవి ఆమెకు అండగా నిలబడి బ్రహ్మన్న ముందు న్యాయం కోసం తీసుకొస్తాడు. ఈ ఘటనతో కథ మరింత కీలక మలుపు తిరుగుతుంది. బాధితురాలికి న్యాయం జరగాలని బ్రహ్మన్న తీసుకునే నిర్ణయం, రాయుడు కుటుంబానికి నచ్చదు. ఇక్కడి నుంచే రెండు వర్గాల మధ్య పోరాటం ఎక్కువ అవుతుంది. మరోవైపు బ్రహ్మన్న భార్య సావిత్రి (శారద) కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ కథలో కీలక పాత్ర పోషిస్తుంది.

బ్రహ్మన్నను నేరుగా ఎదుర్కొని ఓడించలేనని భావించిన రాయుడు, అతడి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో సుశీల అనే మహిళతో బ్రహ్మన్నకు అక్రమ సంబంధం ఉందంటూ గ్రామంలో ప్రచారం చేస్తాడు. ఆమె ఇంటికి బ్రహ్మన్న తరచూ వెళ్తున్నాడనే విషయాన్ని వక్రీకరించి ప్రజల్లో అనుమానాలు కలిగిస్తాడు.

అయితే బ్రహ్మన్న వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఆతర్వాత జరిగిన పరిణామాలేంటి? బ్రహ్మన్నపై రాయుడు ఇంకా ఎన్ని కుట్రలు పన్నుతాడు. ఊరికి రాయుడి పీడా వదిలించడానికి బ్రహ్మన్న తీసుకునే నిర్ణయం ఏంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నటీనటుల ప్రదర్శన.. కృష్ణంరాజు వన్‌మ్యాన్ షో
Image Credit : Asianet News

నటీనటుల ప్రదర్శన.. కృష్ణంరాజు వన్‌మ్యాన్ షో

ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కృష్ణంరాజు నటన. బ్రహ్మన్నగా గంభీరమైన వ్యక్తిత్వాన్ని, గ్రామ పెద్దగా అధికారాన్ని, కుటుంబ పెద్దగా బాధ్యతను ఆయన చక్కగా పలికించారు. అదే సమయంలో రవిగా మరో భిన్నమైన స్వభావాన్ని చూపించారు. రెండు పాత్రల్లోనూ ఆయన చూపించిన తేడా ప్రేక్షకులకు స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా న్యాయస్థానం ముందు తీర్పు చెప్పే సన్నివేశాల్లో ఆయన డైలాగ్ డెలివరీ, హావభావాలు పాత్రకు ప్రత్యేకమైన బలాన్ని అందిస్తాయి.

సావిత్రిగా శారద తన అనుభవంతో కూడిన నటనను ప్రదర్శించారు. కుటుంబం, భర్త నిర్ణయాలు, పిల్లల భవిష్యత్తు మధ్య సతమతమయ్యే మహిళగా ఆమె పాత్ర సహజంగా ఉంటుంది. కస్తూరిగా జయసుధ తన పాత్రకు తగిన అందం, ఎమోషన్ జోడించారు. రావు గోపాలరావు రాయుడు పాత్రలో మరోసారి తనదైన విలనిజంతో ఆకట్టుకుంటారు. కైకాల సత్యనారాయణ బుల్లెబ్బాయిగా విలన్ పాత్రకు సరైన తీవ్రతను తీసుకొచ్చారు. అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్, అన్నపూర్ణ, ముచ్చెర్ల అరుణ తదితరులు తమ పాత్రల పరిధిలో మెప్పించారు.

డైరెక్షన్.. స్క్రీన్ ప్లే.. సంగీతం

కె. రాఘవేంద్రరావు ఈ చిత్రాన్ని కేవలం ప్రతీకార కథగా కాకుండా, న్యాయం, అధికారం, కుటుంబ బంధాల మధ్య జరిగే సంఘర్షణగా తెరకెక్కించారు. గ్రామీణ వాతావరణం, గ్రామ పెద్ద ఆధిపత్యం, ప్రజల సమస్యలు వంటి అంశాలను కథలో భాగం చేశారు. పరుచూరి బ్రదర్స్ అందించిన డైలాగ్స్ బ్రహ్మన్న పాత్రకు గంభీరతను తీసుకొచ్చాయి. ముఖ్యంగా న్యాయం గురించి అతడు చెప్పే మాటలు, తప్పు చేసినవారిని ప్రశ్నించే సన్నివేశాలు సినిమాకు గుర్తుండిపోయే అంశాలు. ఈ సినిమాకు మరో బలం కె. చక్రవర్తి సంగీతం. పాటలు, బ్యాక్ గ్రౌండ్ బ్యూజిక్ సినిమాకు మరో ఆకర్షణ. వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం అందించగా, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల వంటి గాయకులు పాటలకు ప్రాణం పోశారు.

34
బాలయ్యకు చుక్కలు చూపించిన రెబల్ స్టార్..
Image Credit : Asianet News

బాలయ్యకు చుక్కలు చూపించిన రెబల్ స్టార్..

ఇక అప్పుడప్పుడే హీరోగా ఎంట్రీ ఇచ్చి.. సోలో హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు నందమూరి నట సింహం బాలయ్య బాబు. బొబ్బిలి బ్రహ్మన్న` విడుదలైన వారం గ్యాప్‌తో బాలకృష్ణ నటించిన `జననీ జన్మభూమి` విడుదలైంది. ఈ చిత్రానికి కె విశ్వనాథ్‌ దర్శకుడు కావడం విశేషం. ఇందులో సుమలత హీరోయిన్‌గా నటించింది. కైకాల సత్యనారాయణ, శుభలేఖ సుధాకర్‌ కీలక పాత్రలు పోషించారు.

ఈ మూవీ 1984 జులై 27న విడుదలైంది. కానీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం చెందింది. అసలే మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. అప్పటికే థియేటర్లలో కృష్ణంరాజు `బొబ్బిలి బ్రహ్మన్న` మూవీ రచ్చ చేస్తోంది. దీంతో ఆ ప్రభావం బాలయ్య మూవీపై గట్టిగా పడిందని చెప్పొచ్చు. `బొబ్బిలి బ్రహ్మన్న` సునామీ ముందు బాలయ్య `జననీ జన్మభూమి` అడ్రస్‌ లేకుండా పోయింది. ఈ సినిమా తర్వాత బాలయ్య చేసిన మంగమ్మగారి మనవడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.. బాలకృష్ణ కెరీర్ ఫామ్ లోకి వచ్చింది.

44
సినిమాలో ఆకట్టుకునే అంశాలు.. లోపాలు
Image Credit : Asianet News

సినిమాలో ఆకట్టుకునే అంశాలు.. లోపాలు

బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో ప్రధానంగా ఆకట్టుకునేది హీరో పాత్ర. న్యాయం విషయంలో రాజీపడని వ్యక్తి తన కుటుంబ సభ్యుల విషయంలోనూ అదే సూత్రాన్ని పాటించడం కథకు బలాన్ని, ఎమోషన్ ను ఇస్తుంది. కృష్ణంరాజు ద్విపాత్రాభినయం, రావు గోపాలరావు ప్రతినాయకత్వం, కీలక సన్నివేశాల్లోని డైలాగ్స్ సినిమాకు ప్రధాన బలాలు.

అయితే నేటి ప్రేక్షకుల దృష్టితో చూస్తే కొన్ని సన్నివేశాలు నాటకీయంగా అనిపించవచ్చు. గ్రామ పెద్దకు ఇచ్చిన అధికారం, వ్యక్తిగతంగా శిక్షలు విధించే విధానం వంటి అంశాలు ప్రస్తుతం విచిత్రంగా అనిపించే అవకాశం ఉంది. కొన్ని చోట్ల స్క్రీన్ స్లే స్లోగా అనిపిస్తుంది. అయినప్పటికీ 1980ల నాటి తెలుగు కమర్షియల్ సినిమా శైలిని ఇష్టపడేవారికి ఈ అంశాలు పెద్దగా అడ్డంకి కావు.

అవార్డులు.. ఇతర విశేషాలు

‘బొబ్బిలి బ్రహ్మన్న’లో బ్రహ్మన్న పాత్రలో నటనకు కృష్ణంరాజుకు 1985 సంవత్సరానికి నంది ఉత్తమ నటుడు అవార్డు లభించింది. ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమా ఆతర్వాత కాలంలో హిందీలో ‘ధర్మ్ అధికారి’, కన్నడలో ‘ధర్మపీఠ’ పేర్లతో రీమేక్ అయింది.

ఫైనల్‌గా.. చెప్పాలంటే

మొత్తంగా ‘బొబ్బిలి బ్రహ్మన్న’ కృష్ణంరాజు నటన, కె. రాఘవేంద్రరావు దర్శకత్వం, పరుచూరి బ్రదర్స్ సంభాషణలు, చక్రవర్తి సంగీతంతో గుర్తుండిపోయే చిత్రం. పాత తెలుగు సినిమాలు, కృష్ణంరాజు నటన, గ్రామీణ నేపథ్యంతో సాగే యాక్షన్ డ్రామాలు ఇష్టపడేవారు తప్పక చూడదగిన చిత్రం ‘బొబ్బిలి బ్రహ్మన్న’. చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
సినిమా సమీక్షలు
వినోదం
కృష్ణంరాజు
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
#Cult Movie Review: కల్ట్ మూవీ రివ్యూ.. విశ్వక్‌ సేన్‌ ఇండియా తొలి స్లాషర్‌ సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Aadarsha Kutumbam Movie Review: ఆదర్శ కుటుంబం మూవీ రివ్యూ, వెంకటేష్‌, త్రివిక్రమ్‌ సినిమా హిట్టా ? ఫట్టా?
Recommended image3
Killer Movie Review: కిల్లర్‌ మూవీ రివ్యూ.. సైఫై థ్రిల్లర్‌ మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Tailor Bird: సూది దారం లేకుండా.. ఆకులను అద్భుతంగా కుట్టే పిట్ట.. చిన్న పక్షికి ఇంత తెలివి ఎలా?
Recommended image2
DMart: డీమార్ట్ కు ఎప్పుడు వెళ్తే టైమ్ సేవ్ అవుతుంది? ఏ రోజు వెళ్తే డబ్బులు ఆదా చేసుకోవచ్చో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved