MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Cheap Fuel Countries: లీటర్ పెట్రోల్ రూ. 3 మాత్రమే! ఈ దేశాల్లో నీళ్ల కంటే చౌకగా ఇంధనం.. పూర్తి లిస్ట్ ఇదే

Cheap Fuel Countries: లీటర్ పెట్రోల్ రూ. 3 మాత్రమే! ఈ దేశాల్లో నీళ్ల కంటే చౌకగా ఇంధనం.. పూర్తి లిస్ట్ ఇదే

Cheap Fuel Countries: భారత్ సహా చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి పెరిగిపోయాయి. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రపంచంలో అత్యంత చౌకగా పెట్రోల్ అమ్మే దేశాలు కూడా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ ధర రూ.3 నుంచే మొదలవుతోంది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 22 2026, 01:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ప్రపంచంలోనే చౌకైన పెట్రోల్ లభించే టాప్ 10 దేశాలు
Image Credit : Getty

ప్రపంచంలోనే చౌకైన పెట్రోల్ లభించే టాప్ 10 దేశాలు

ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. మన దేశంలో లీటర్ పెట్రోల్ వంద రూపాయల మార్కు దాటేసింది. బయటకు వెళ్లాలంటేనే సామాన్యులు జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ, ప్రపంచంలో కొన్ని దేశాల్లో మాత్రం పెట్రోల్ నీళ్ల కంటే చాలా చౌకగా దొరుకుతోంది. రూపాయిల్లో చెబితే కేవలం రెండు మూడు రూపాయలకే లీటర్ ఇంధనం లభిస్తుంది.

ముడి చమురు నిల్వలు పుష్కలంగా ఉన్న దేశాల్లో ప్రభుత్వం ఇచ్చే భారీ రాయితీలే ఇందుకు ముఖ్య కారణం. అక్కడ ఉండే ప్రజలు తక్కువ ధరకే ఇంధనం పొందడం తమ జన్మహక్కుగా భావిస్తారు. ప్రపంచంలోనే అత్యంత చౌకగా పెట్రోల్ విక్రయిస్తున్న టాప్ 10 దేశాల జాబితాను, వాటి వెనుక ఉన్న ఆర్థిక కారణాలను ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మొదటి స్థానంలో ఇరాన్.. రూపాయిల్లో చెప్పాలంటే చిల్లర పైసలే
Image Credit : Gemini

మొదటి స్థానంలో ఇరాన్.. రూపాయిల్లో చెప్పాలంటే చిల్లర పైసలే

ప్రపంచంలోనే అత్యంత చౌకగా పెట్రోల్ లభించే దేశాల్లో ఇరాన్ అగ్రస్థానంలో నిలిచింది. ఇరాన్‌లో ఒక లీటర్ పెట్రోల్ ధర కేవలం 0.03 యూరోలు (సుమారు $0.03 డాలర్లు) మాత్రమే. మన భారతీయ కరెన్సీలో లెక్కలేస్తే ఇది కేవలం రెండు నుంచి మూడు రూపాయల మధ్యలోనే ఉంటుంది. ఇరాన్ లో భారీగా ముడి చమురు నిల్వలు ఉండటం, అక్కడ ప్రభుత్వం ప్రజలకు ఇంధనంపై భారీగా సబ్సిడీ ఇవ్వడమే దీనికి ప్రధాన కారణం. దాంతో అక్కడ నీళ్ల బాటిల్ కంటే పెట్రోల్ రేటే చాలా తక్కువగా ఉంటుంది.

36
వెనెజులా, కువైట్ లలో కూడా నమ్మలేని ధరలు
Image Credit : Getty

వెనెజులా, కువైట్ లలో కూడా నమ్మలేని ధరలు

దక్షిణ అమెరికా ఖండానికి చెందిన వెనెజులా ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. వెనెజులాలో లీటర్ పెట్రోల్ ధర 0.03 యూరోలు ($0.04 డాలర్లు). అంటే భారత కరెన్సీలో లీటరు రూ. 3.00 నుండి రూ. 3.50. ఇక మూడో స్థానంలో మిడిల్ ఈస్ట్ దేశమైన కువైట్ నిలిచింది. కువైట్‌లో లీటర్ పెట్రోల్ ధర 0.29 యూరోలు (లీటరు రూ. 28 నుండి రూ. 32) గా ఉంది. ఈ దేశాల్లో చమురు ఉత్పత్తి ఎక్కువగా ఉండటం వల్ల స్థానిక ప్రజలకు తక్కువ ధరలకే ఇంధనాన్ని విక్రయిస్తుంటారు.

46
ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో చౌకగా దొరికే దేశాలు ఇవే
Image Credit : Getty

ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో చౌకగా దొరికే దేశాలు ఇవే

ఆఫ్రికా ఖండానికి చెందిన అల్జీరియా నాలుగో స్థానంలో ఉంటే, ఆసియాలోని తుర్క్మెనిస్తాన్ ఐదో స్థానంలో ఉంది. అల్జీరియాలో లీటర్ పెట్రోల్ 0.30 యూరోలు (లీటరు రూ. 28 నుండి రూ. 30) కాగా, తుర్క్మెనిస్తాన్‌లో 0.37 యూరోలు (రూ. 40.00 - రూ. 42.00) గా ఉనికిలో ఉంది. ఆ తర్వాత ఆరో స్థానంలో ఉన్న ఈజిప్ట్‌లో లీటర్ ఇంధన ధర 0.41 యూరోలు (రూ. 46.00 - రూ. 48.00). ఈ దేశాలు తమ సొంత అవసరాలకు సరిపడా చమురును తవ్వితీస్తూ స్థానిక మార్కెట్ లో తక్కువ ధరలకు లభించేలా చూస్తున్నాయి.

56
గల్ఫ్ దేశాల హవా.. ఖతార్, ఒమాన్, సౌదీ అరేబియా ట్రెండ్
Image Credit : Getty

గల్ఫ్ దేశాల హవా.. ఖతార్, ఒమాన్, సౌదీ అరేబియా ట్రెండ్

మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో మిగిలిన చమురు సంపన్న దేశాలు కూడా ఇంధనాన్ని చాలా తక్కువ ధరలకే అందిస్తున్నాయి. ఖతార్ ఏడో స్థానంలో ఉండగా, అక్కడ లీటర్ పెట్రోల్ ధర 0.50 యూరోలు (రూ. 54.00 - రూ. 56.00). ఎనిమిదో స్థానంలో ఆఫ్రికా దేశం అంగోలా 0.51 యూరోలతో (రూ. 31.00 - రూ. 33.00) ఉంది. ఇక తొమ్మిదో స్థానంలో ఒమాన్, పదో స్థానంలో సౌదీ అరేబియా నిలిచాయి. ఈ రెండు దేశాల్లో లీటర్ పెట్రోల్ ధర సమానంగా 0.54 యూరోలు (రూ. 59.00 - రూ. 61.00) గా నమోదు అయింది.

66
ఈ దేశాల్లో పెట్రోల్ ఇంత చౌకగా ఎందుకు దొరుకుతోంది?
Image Credit : Freepik

ఈ దేశాల్లో పెట్రోల్ ఇంత చౌకగా ఎందుకు దొరుకుతోంది?

గ్లోబల్ మార్కెట్‌లో ఈ దేశాలు ఇంత తక్కువ ధరలకు పెట్రోల్ విక్రయించడం వెనుక ఒకే ఒక సీక్రెట్ ఉంది. అవే 'చమురు నిల్వలు, ప్రభుత్వ సబ్సిడీలు'. ఈ టాప్ 10 దేశాల్లో మెజారిటీ దేశాలు ఆయిల్ రిచ్ కంట్రీస్. సొంతంగా ముడి చమురును సమృద్ధిగా ఉత్పత్తి చేస్తాయి. ప్రాసెసింగ్ కాస్ట్ మాత్రమే పడుతుంది కాబట్టి, ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై వేయదు.

ఉచితంగా లేదా నామమాత్రపు ధరకే తమ పౌరులకు ఇంధనాన్ని అందించడం తమ బాధ్యతగా అక్కడ ప్రభుత్వాలు భావిస్తాయి. అందుకే ఈ గ్లోబల్ కాంపిటీషన్‌లో ఇవి ప్రపంచంలోనే అత్యంత చౌకైన పెట్రోల్ అందించే దేశాలుగా నిలిచాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
భారత దేశం
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
329 & 387
AUSAUS
429
Day 4
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ఎండలో పెట్టగానే కదిలే విత్తనాలు.. చల్లని ప్రదేశంలోకి తీసుకురాగానే ఆగిపోతాయి? ఎందుకంటే.
Recommended image2
Human Hair: మ‌నిషి వెంట్రుక‌ల‌తో పెట్రోల్ త‌యారీ.. స్టార్ట‌ప్ సంచ‌ల‌న ప్ర‌యోగం
Recommended image3
Phone Addiction : రాత్రుళ్లు ఫోన్ చూస్తుంటే నిద్రపట్టదు కానీ ఆకలేస్తుంది.. రీజన్ ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Global Air Power Ranking: చైనాకి మైండ్ బ్లాక్.. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఎయిర్ ఫోర్స్‌గా భారత్ రికార్డ్
Recommended image2
Housing Scheme: రూ.6 లక్షలకే హైదరాబాద్‌లో సొంత ఇల్లు.. దరఖాస్తు విధానం, అర్హతలు సహా పూర్తి వివరాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved