MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Onion Capital: మన దేశపు ఉల్లిపాయల రాజధాని ఏదో తెలుసా? ప్రపంచంలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్ ఇక్కడే ఉంది?

Onion Capital: మన దేశపు ఉల్లిపాయల రాజధాని ఏదో తెలుసా? ప్రపంచంలోనే అతి పెద్ద ఉల్లి మార్కెట్ ఇక్కడే ఉంది?

Onion Capital: ప్రపంచంలోనే అతి పెద్ద ఉల్లిపాయల మార్కెట్ మన దేశంలోనే ఉందని మీకు తెలుసా? ఇండియాలో ఉల్లిపాయల రాజధానిగా పేరు తెచ్చుకున్న ప్రాంతం ఏది? దానికి ఆ పేరు ఎలా వచ్చింది. దేశ విదేశాలకు ఉల్లిపాయలను ఎగుమతి చేసే నగరం ఎక్కడ ఉంది?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 02 2026, 07:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ప్రతీకూరలో ఉల్లిపాయ ఉండాల్సిందే?
Image Credit : Asianet News

ప్రతీకూరలో ఉల్లిపాయ ఉండాల్సిందే?

భారతీయ వంటకాల్లో ఉల్లిపాయకు ఉండే ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వంటింట్లో ప్రతికూరలోనూ భాగమయ్యే ఉల్లిపాయ, దేశీయ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలోనూ అత్యంత కీలకమైన పంటగా నిలుస్తోంది. అయితే భారతదేశంలో అత్యధికంగా ఉల్లిపాయలను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది? ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఉల్లిపాయల హోల్‌సేల్ మార్కెట్ ఎక్కడ ఉందో మీకు తెలుసా?

ఉల్లి ఉత్పత్తిలో రికార్డు

భారతదేశంలో ఉల్లి ఉత్పత్తిలో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. దేశంలో మొత్తం ఉత్పత్తి అయ్యే ఉల్లిపాయల్లో దాదాపు 40 శాతానికి పైగా వాటా ఒక్క మహారాష్ట్ర నుంచే వస్తుంది. ఇక్కడి అనుకూలమైన వాతావరణం, సారవంతమైన నేలలు, రైతుల నైపుణ్యం,ఆధునిక సాగు పద్ధతులు అధిక దిగుబడికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. మహారాష్ట్ర తర్వాత మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్..
Image Credit : Asianet News

ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి మార్కెట్..

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఉల్లిపాయల హోల్‌సేల్ మార్కెట్ మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా, నిఫాడ్ తాలూకాలో ఉన్న లాసల్‌గావ్ (Lasalgaon) వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ కమిటీ (APMC). ఈ మార్కెట్‌కు ఒక ప్రాముఖ్యత ఉంది.యభారతదేశమంతటా ఉల్లిపాయల ధరలు ఎలా ఉండబోతున్నాయో నిర్ధారించడంలో లాసల్‌గావ్ మార్కెట్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇక్కడ నిర్ణయించబడే వేలం ధరలే దేశవ్యాప్తంగా ఉన్న ఇతర మార్కెట్లలో ఉల్లి ధరలను ప్రభావితం చేస్తాయి.

ప్రతిరోజూ వేలాది టన్నుల ఉల్లిపాయలు చుట్టుపక్కల గ్రామాలు,జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా లాసల్‌గావ్ మార్కెట్‌కు చేరుకుంటాయి. ఇక్కడ వేలం పాటల ద్వారా పారదర్శకంగా వ్యాపారం జరుగుతుంది. నాసిక్ రీజియన్‌లోని ఉల్లిపాయలు తమ నాణ్యతకు, ప్రత్యేకమైన రుచికి ప్రసిద్ధి చెందాయి. 'లాసల్‌గావ్ ఉల్లిపాయ'కు భౌగోళిక గుర్తింపు (GI Tag) కూడా లభించింది.

33
ఉల్లిపాయల రాజధాని నగరం..
Image Credit : Getty

ఉల్లిపాయల రాజధాని నగరం..

నాసిక్ జిల్లాను భారతదేశపు "ఉల్లి రాజధాని" (Onion Capital of India) అని పిలుస్తారు. ఇక్కడి నుండి దేశంలోని వివిధ రాష్ట్రాలకే కాకుండా మలేషియా, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE), బంగ్లాదేశ్ వంటి అనేక వదేశాలకు ఉల్లిపాయలు ఎగుమతి అవుతాయి. మొత్తానికి, మహారాష్ట్ర ఉత్పాదకత, లాసల్‌గావ్ మార్కెట్ వ్యాపార పరిమాణం భారతీయ వ్యవసాయ రంగానికి వెన్నుముకగా నిలుస్తున్నాయి. కోట్లాది మంది వినియోగదారుల రోజువారీ అవసరాలను తీర్చడమే కాకుండా, విదేశీ మార్కెట్లలోనూ భారతీయ ఉల్లికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెడుతున్నాయి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వైరల్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
ప్రపంచంలో విమానాశ్రయాలు లేని దేశాలివే.. మరి ఆ దేశాలకు ఎలా వెళ్తారు.?
Recommended image2
అమెరికాలో క‌రెంట్ ఎందుకు పోదు.? ఇంత‌కీ అక్క‌డ విద్యుత్ వ్యవస్థ ఎలా ప‌నిచేస్తుంది?
Recommended image3
Jalebi/Tang Huan: మన జిలేబీకి చైనా వెర్షన్ ఇది.. దీని పేరేంటో తెలుసా?
Related Stories
Recommended image1
Bobbili Brahmanna Review: బాలకృష్ణకు చుక్కలు చూపించిన కృష్ణంరాజు సినిమా.. బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ
Recommended image2
Sridevi: పెళ్లయిన వ్యక్తిని చేసుకోను అన్న శ్రీదేవి.. ఇద్దరు పిల్లల తండ్రికి భార్య ఎలా అయిందంటే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved