MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Motivational story: ఆ నలుగురు ఏమన్న అనుకోని.. జీవితాన్ని చూసే విధానాన్ని మార్చే కథ.

Motivational story: ఆ నలుగురు ఏమన్న అనుకోని.. జీవితాన్ని చూసే విధానాన్ని మార్చే కథ.

Motivational story: మన జీవితంలో ఏ పని చేసినా విమర్శించే వాళ్లు ఉంటారు. మనం ఏ దారి ఎంచుకున్నా తప్పు పట్టే వారు సమాజంలో కొరత ఉండదు. వారి మాటలను పట్టించుకుంటూ పోతే మన జీవితం మన చేతుల్లో ఉండదు. ఈ విషయాన్ని గుర్తు చేసే ఒక చిన్న కథ మీకోసం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Apr 10 2026, 12:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నించే విద్యార్థి
Image Credit : Gemini AI

ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నించే విద్యార్థి

ఒక చిన్న గ్రామంలో రాహుల్ అనే యువకుడు ఉండేవాడు. మంచి చదువుతో బీటెక్ పూర్తి చేశాడు. కుటుంబం కూడా అతనిపై చాలా ఆశలు పెట్టుకుంది. చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగం సంపాదించి కుటుంబాన్ని నిలబెట్టాలని అతను కష్టపడుతున్నాడు. రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుండేవాడు. ఇంటర్వ్యూలకు వెళ్లేవాడు, ఆన్‌లైన్‌లో అప్లై చేసేవాడు. కానీ అదృష్టం కలిసిరాక ఉద్యోగం మాత్రం దొరకలేదు. అయితే అతని ఇంటి దగ్గర ఉండే కొందరు పెద్దలు మాత్రం అతన్ని చూసి ఇలా మాట్లాడేవారు. “బీటెక్ చదివి కూడా ఏ పని చేయకుండా ఇంట్లోనే తిరుగుతున్నాడు. ఇలా ఉంటే ఎలా? ప్రభుత్వ ఉద్యోగాలకు చదివితే మంచిది కదా!” అని విమర్శించేవారు.

24
ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం
Image Credit : Gemini AI

ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం

ఆ మాటలు రాహుల్ మనసుకు తాకాయి. “వాళ్లు చెప్పింది నిజమే కావచ్చు” అనుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధం కావడం ప్రారంభించాడు. రోజూ గంటల కొద్దీ చదవడం మొదలుపెట్టాడు. పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నాడు. జీవితాన్ని మార్చుకోవాలనే పట్టుదలతో చదువుతున్నాడు. కానీ కొద్ది రోజుల తర్వాత అదే నలుగురు మళ్లీ వచ్చి మాట్లాడారు. “ఇంత కాంపిటేషన్ ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగం సాధ్యమా? లక్షల మంది పోటీ పడుతున్నారు. ఏదైనా చిన్న వ్యాపారం మొదలుపెడితే బాగుండేది!” అని మళ్లీ సూచనలు ఇచ్చారు.

Related Articles

Related image1
Bajaj Pulsar 180: మళ్లీ మార్కెట్లోకి పల్సర్ 180.. ఈసారి మరింత స్టైలీష్‌గా, మ‌రింత స్మార్ట్‌గా
Related image2
Tata: ఒక్క ఏడాదిలో 2.16 ల‌క్ష‌ల కార్ల అమ్మ‌కాలు.. ఇంత‌కీ కారులో అంతలా ఏముంద‌బ్బా.?
34
వ్యాపారం ప్రారంభించిన యువకుడు
Image Credit : Gemini AI

వ్యాపారం ప్రారంభించిన యువకుడు

ఈసారి కూడా రాహుల్ వాళ్ల మాటలను నమ్మాడు. “బిజినెస్ చేస్తే త్వరగా ఎదగొచ్చు” అనుకుని ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాడు. కొంత అప్పు తీసుకుని వ్యాపారం మొదలుపెట్టాడు. అయితే కొద్దిరోజులకే మళ్లీ అదే నలుగురు వచ్చి ఇలా అన్నారు. “ఇప్పటికే అప్పులు ఉన్నాయి. ఇంకా బిజినెస్ పెట్టాడు. లాభం వస్తుందా? ఇంట్లో ఉన్న పొలం చూసుకుంటే సరిపోదా?” అని మాట్లాడుకున్నారు. అది విన్న రాహుల్ మళ్లీ ఆలోచనలో పడ్డాడు. “వాళ్లు చెప్పింది నిజమే కావచ్చు” అనుకుని మరుసటి రోజు నుంచే పొలంలో పని చేయడం ప్రారంభించాడు.

44
విమర్శలతో విరిగిపోయిన మనసు
Image Credit : Gemini AI

విమర్శలతో విరిగిపోయిన మనసు

కొన్ని రోజులు పొలంలో పని చేసిన తర్వాత కూడా ఆ నలుగురు ఆగలేదు. “బీటెక్ చదివి చివరికి పొలం పని చేస్తున్నాడు. ఇంత చదువు ఎందుకు? దీనికంటే చదవకపోతే బాగుండేది!” అని విమర్శించారు. ఈ మాటలు రాహుల్ హృదయాన్ని బాగా గాయపరిచాయి. తాను ఏ పని చేసినా తప్పే అని అనిపించింది. చివరికి తీవ్ర నిరాశతో ఆత్మహత్య చేసుకున్నాడు.

చివరికి తెలిసిన నిజం

రాహుల్ మరణించిన తర్వాత కూడా అదే నలుగురు అక్కడికి వచ్చి ఇలా మాట్లాడుకున్నారు. “పిచ్చోడు! ఏ పని అయినా చేసుకుని బతకాలే గానీ ఇలా చనిపోతారా? మనిషికి ధైర్యం ఉండాలి!” అని అన్నారు.

కథలోని సందేశం

ఈ కథలో ఒక ముఖ్యమైన సందేశం ఉంది. మన చుట్టూ మనలను తగ్గించి మాట్లాడే వాళ్లు, నిరుత్సాహపరచే వాళ్లు ఎప్పుడూ ఉంటారు. వారి మాటలను పట్టించుకుంటే మన జీవితం మన చేతుల్లో ఉండదు. అందుకే జీవితంలో ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇతరులు ఏమంటారనే భయం కాకుండా, మనం నమ్మిన దారిలో ధైర్యంగా ముందుకు సాగడమే నిజమైన విజయం.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఫీల్ గుడ్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Anesthesia: నొప్పి లేని ఆపరేషన్.. మత్తునిచ్చే అనస్థీషియా పుట్టుక వెనుక ఉన్న అసలు కథ
Recommended image2
GPS Tracker: భార్య చెప్పుల్లోనే జిపిఎస్ ట్రాకర్ పెట్టాడు, అసలు నిజం కనిపెట్టేసాడు
Recommended image3
Unhappiest Countries: ఈ దేశాల్లోని ప్రజలకు సంతోషమంటేనే తెలియదు, ఇక్కడ పుట్టడమే శాపం
Related Stories
Recommended image1
Bajaj Pulsar 180: మళ్లీ మార్కెట్లోకి పల్సర్ 180.. ఈసారి మరింత స్టైలీష్‌గా, మ‌రింత స్మార్ట్‌గా
Recommended image2
Tata: ఒక్క ఏడాదిలో 2.16 ల‌క్ష‌ల కార్ల అమ్మ‌కాలు.. ఇంత‌కీ కారులో అంతలా ఏముంద‌బ్బా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved