MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Feature
  • Military vs Army : మిలిటరీ, ఆర్మీ ఒకటికాదా? రెండింటి మధ్య ఇంత తేడా ఉందా?

Military vs Army : మిలిటరీ, ఆర్మీ ఒకటికాదా? రెండింటి మధ్య ఇంత తేడా ఉందా?

ఇండియన్ మిలిటరీ అన్నా, ఆర్మీ అన్నా ఒక్కటే అని భావిస్తున్నారా? అయితే మీరు పొరపడినట్లే. మిలిటరీకి, ఆర్మీకి చాలా తేడాలున్నాయి.. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 18 2026, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మిలిటరీ vs ఆర్మీ
Image Credit : ChatGPT

మిలిటరీ vs ఆర్మీ

సాధారణంగా ఏ దేశమైనా భద్రత కోసం మిలిటరీ వ్యవస్థను కలిగి ఉంటుంది. అలాగే దేశ సంరక్షణలో ఆర్మీది కీలక పాత్ర. అయితే చాలామంది ఈ మిలిటరీ, ఆర్మీ అనేవి రెండూ పర్యాయ పదాలేనని... వీటి అర్థం ఒక్కటేనని భావిస్తారు.. కానీ ఇది నిజం కాదు. మిలిటరీ వేరు, ఆర్మీ వేరు.  

 మిలిటరీ అనేది దేశ సార్వభౌమత్వాన్ని కాపాడటానికి ఆ దేశం ఏర్పాటుచేసుకునే వ్యవస్థ. అంతర్గత, బాహ్య ముప్పుల నుండి దేశ భూభాగాన్ని, ప్రజలను రక్షించే సాయుధ దళాల సముదాయమిది. ఇందులో భూసేన (ఆర్మీ), వాయుసేన (ఎయిర్ ఫోర్స్), నావికాదళం (నేవీ) వంటి ప్రధాన విభాగాలుంటాయి. ఈ దళాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తాయి. ఇలా భారతదేశం కూడా బలమైన మిలిటరీ వ్యవస్థను కలిగివుంది... రక్షణ మంత్రిత్వ శాఖ వీటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి మిలిటరీ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఇది ఒక పెద్ద రక్షణ గొడుగు వంటిది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆర్మీ అంటే ఏమిటి?
Image Credit : Getty

ఆర్మీ అంటే ఏమిటి?

సైన్యం లేదా ఆర్మీ అనేది మిలిటరీలో భాగంగా ఉండే భూసేనను సూచిస్తుంది. ఇది ప్రధానంగా భూమిపై జరిగే యుద్ధ కార్యకలాపాలు, సరిహద్దుల రక్షణ, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లకు బాధ్యత వహిస్తుంది. అంటే ఆర్మీ అనేది మిలిటరీలో ఓ భాగం మాత్రమే… మిలిటరీ, ఆర్మీ ఒకటి కాదు.

భారత సైన్యం (Indian Army) ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాలలో ఒకటి... 14 లక్షల మందికి పైగా సైనికులు దేశానికి సేవ చేస్తున్నారు. మరో 9 లక్షలకు పైగా రిజర్వ్ సిబ్బంది ఉన్నారు. ఇండియన్ ఆర్మీ ఆర్మీ ముఖ్య విధి దేశ సరిహద్దులను శత్రు దాడుల నుండి కాపాడటం, శాంతిని నెలకొల్పడం.

Related Articles

Related image1
Women Army : ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సైన్యం ఏ దేశంలో ఉందో తెలుసా?
Related image2
Indian Army : సైన్యం కోసం ఇండియా ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా?
35
ఇండియన్ మిలిటరీ అంటే..?
Image Credit : Getty

ఇండియన్ మిలిటరీ అంటే..?

భారత మిలిటరీ వ్యవస్థ మూడు ప్రధాన విభాగాలుగా విభజించబడింది. భారత సైన్యం (ఆర్మీ), భారత వాయుసేన (ఎయిర్ ఫోర్స్), భారత నావికాదళం (నేవీ). ప్రతి విభాగం ప్రత్యేకమైన విధులు, బాధ్యతలతో దేశ రక్షణలో తమ పాత్రను పోషిస్తుంది. 1947లో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఈ మూడు దళాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.  

భారత ఆర్మీ  భూ సరిహద్దుల వద్ద రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఇక భారత వాయుసేన గగనతల రక్షణకు, నావికాదళం సముద్ర సరిహద్దుల రక్షణకు అత్యంత కీలకం. ఇది సమగ్ర రక్షణ విధానాన్ని బలపరుస్తుంది. మొత్తం ఆర్మీ అనేది ఇండియన్ మిలిటరీలో ఓ భాగం మాత్రమే… మిలిటరీ, ఆర్మీ ఒకటి కాదు.

45
భారత మిలిటరీ విధులివే..
Image Credit : Asianet News

భారత మిలిటరీ విధులివే..

మిలిటరీలోని ప్రతి విభాగానికి స్పష్టమైన పాత్రలు, బాధ్యతలు ఉన్నాయి. భారత సైన్యం భూ సరిహద్దుల రక్షణ, భూమిపై శత్రువులను ఎదుర్కోవడం, కౌంటర్-ఇన్సర్జెన్సీ ఆపరేషన్లలో పాల్గొంటుంది. భారత వాయుసేన వైమానిక దాడుల నుండి దేశాన్ని కాపాడుతుంది, శత్రు స్థావరాలపై దాడులు చేస్తుంది. భారత నావికాదళం సముద్ర మార్గాలను రక్షిస్తుంది, నౌకదళ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ మూడు దళాలు ఒకదానికొకటి సహకరిస్తూ, దేశ భద్రతకు కట్టుబడి ఉన్నాయి. కార్గిల్ యుద్ధంలో ఈ దళాల సమన్వయం స్పష్టంగా కనిపించింది. ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఇండియన్ ఆర్మీ అద్భుతంగా పనిచేసింది.

55
మిలిటరీ, ఆర్మీ ఒక్కటికాదు...
Image Credit : ANI

మిలిటరీ, ఆర్మీ ఒక్కటికాదు...

సాధారణంగా ప్రజలు మిలిటరీ, ఆర్మీ అనే పదాలను ఒకేలా వాడుతుంటారు... ఇది ఒక పెద్ద పొరపాటు. మిలిటరీ అనేది ఒక విస్తృతమైన భావన కాగా, సైన్యం (ఆర్మీ) దానిలోని ఒక విభాగం మాత్రమే. ఈ రెండు పదాల మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడం భారత రక్షణ దళాల నిర్మాణంపై స్పష్టమైన అవగాహనను ఇస్తుంది. సరైన పదజాలాన్ని ఉపయోగించడం ద్వారా మనం మన రక్షణ దళాలకు సరైన గౌరవాన్ని ఇవ్వగలం. భారత రక్షణ వ్యవస్థ గురించి ప్రతి ఒక్కరు సరైన అవగాహన కలిగివుండటం చాలా ముఖ్యం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాయుధ దళాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Car Buying: భార్య పేరు మీద కారు కొంటే ఎంత లాభమో తెలుసా? సెలెబ్రిటీలు ఇలాగే కొంటారు
Recommended image2
Science Facts: 12 ఏళ్ల వయసులో అబ్బాయిలుగా మారే అమ్మాయిలు.. విచిత్ర గ్రామం ఇది !
Recommended image3
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ లీక్ కాకుండా ఉండాలంటే.. ఈ 3 సెట్టింగ్స్ ఆన్ చేయండి
Related Stories
Recommended image1
Women Army : ప్రపంచంలోనే అతిపెద్ద మహిళా సైన్యం ఏ దేశంలో ఉందో తెలుసా?
Recommended image2
Indian Army : సైన్యం కోసం ఇండియా ఎంత ఖర్చు చేస్తుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved