MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Feature
  • Ganja : గంజాయిని లీగల్ గా సాగు చేయవచ్చు, ఉపయోగించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Ganja : గంజాయిని లీగల్ గా సాగు చేయవచ్చు, ఉపయోగించుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

గంజాయి కలిగివుండటం ఇల్లీగల్… దీన్ని సాగుచేసినా, సరఫరా చేసినా, వాడినా శిక్షార్హులే. కానీ కొన్నిచోట్ల ప్రభుత్వాలే ప్రత్యేక అనుమతులిచ్చి గంజాయిని పండించమని చెబుతుంటాయి. ఎందుకో తెలుసా? 

3 Min read
Author : Arun Kumar P
Published : Jul 09 2026, 03:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గంజాయి సాగు చేయవచ్చా?
Image Credit : Gemini AI

గంజాయి సాగు చేయవచ్చా?

Cannabis : గంజాయి అనగానే మనకు సాధారణంగా గుర్తొచ్చేవి మత్తు, వ్యసనం. ప్రకృతి సిద్దంగానే లభించే గంజాయి మొక్క మత్తుపదార్థంగా ఉపయోగించబడుతోంది... దీని బారినపడి అనేకమంది యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అందుకే గంజాయిని వాడటమే కాదు సాగుచేయడంపైనా ఇండియాలో నిషేదం ఉంది. గంజాయిని కలిగివుంటే ఎంతటివారిపై అయినా చట్టపరమైన చర్యలు తప్పవు... పోలీసులు కటకటాల వెనక్కినెట్టడం ఖాయం.

ఇది గంజాయిలోని ఓ కోణం మాత్రమే.. దీనికి మరో కోణం కూడా ఉంది... అది పూర్తిగా లీగల్. అంటే గంజాయిని కొందరు లీగల్ గా సాగుచేయవచ్చు... ఇంకొందరు లీగల్ వాడవచ్చు. పోలీసులు గానీ, మన చట్టాలు గానీ ఇందుకు అడ్డుచెప్పవు. ఇలా గంజాయిని ఎవరు సాగు చేయవచ్చు? ఎవరు లీగల్ గా వాడుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ రాష్ట్రాల్లో గంజాయి సాగు లీగల్
Image Credit : Getty

ఈ రాష్ట్రాల్లో గంజాయి సాగు లీగల్

ఇండియాలో గంజాయి సాగుపై నిషేధం ఉంది... అక్రమంగా ఒక్క మొక్కను పెంచినా శిక్షార్హులే. కానీ కొన్ని రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా గంజాయి తోటనే పెంచుకునేందుకు అనుమతి ఉంటుంది... అయితే ఇందుకోసం కఠిన నిబంధనలున్నాయి. తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతితోనే గంజాయిని సాగు చేయాలి... దీన్ని వైద్యంలో ఉపయోగించేందుకో, పరిశోధనల కోసమే లేదంటే పారిశ్రామిక అవసరాల కోసమో వాడాలి.

ఉత్తరాఖండ్ లో గంజాయిని లీగల్ గా సాగు చేయవచ్చు. అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక అనుమతితో గంజాయిని సాగు చేసేందుకు అనుమతిస్తాయి. ప్రత్యేక అనుమతితో, ప్రభుత్వ పర్యవేక్షణలోనే దీన్ని సాగు చేయాల్సి ఉంటుంది... పొరపాటున నిబంధనలు అతిక్రమిస్తే జైలుశిక్ష తప్పదు.

ప్రభుత్వ లైసెన్స్ లేకుండా మత్తు కోసం రహస్య ప్రదేశాల్లో లేదా ఇంట్లో కుండీల్లో గంజాయి మొక్కలను పెంచడం తీవ్రమైన నేరం. NDPS చట్టం ప్రకారం దీనికి 10 నుండి 20 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష, లక్షల రూపాయల జరిమానా విధిస్తారు.

Related Articles

Related image1
Hyderabad : వీడెవడండీ బాబు..! హైదరాబాద్ నడిబొడ్డున గంజాయి సాగు చేస్తున్నాడు
Related image2
హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్లు.. కిరాణ దుకాణంలో యథేచ్ఛగా విక్రయాలు
35
గంజాయి ప్రాణాలు కాపాడుతుందా..?
Image Credit : Getty

గంజాయి ప్రాణాలు కాపాడుతుందా..?

కొన్ని రకాల మొండి వ్యాధులకు గంజాయి ఒక అద్భుతమైన మందుగా పనిచేస్తుందని ఆధునిక వైద్య శాస్త్రం నిరూపించింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దీనిని చట్టబద్ధం చేసి, రోగుల చికిత్సలో వాడుతున్నాయి. ఇలా వైద్య అవసరాల కోసం వాడే గంజాయిని "మెడికల్ కానబిస్" (Medical Cannabis) అంటారు.

గంజాయి మొక్కలో వందలాది రసాయనాలు ఉంటాయి. వీటిని 'కానబినాయిడ్స్' అంటారు. అయితే వైద్యంలో ముఖ్యంగా రెండు పదార్థాలను వేరు చేసి వాడుతుంటారు.

CBD (కన్నాబిడియోల్) : దీని వల్ల ఎలాంటి మత్తు రాదు. నొప్పిని తగ్గించడానికి, గుండెల్లో ఆందోళనను దూరం చేయడానికి, ఫిట్స్ లాంటి సమస్యలను అదుపు చేయడానికి ఇది బాగా పనిచేస్తుంది.

THC (టెట్రాహైడ్రోకానాబినాల్) : గంజాయి తాగినప్పుడు మత్తు కలిగించే పదార్థం ఇదే. అయితే వైద్యంలో దీనిని చాలా తక్కువ మోతాదులో, కేవలం తీవ్రమైన నొప్పిని తగ్గించడానికి, ఆకలిని పెంచడానికి మాత్రమే వాడుతుంటారు.

45
ఏయే వ్యాధుల చికిత్సలో గంజాయిని వాడుతున్నారు?
Image Credit : Getty

ఏయే వ్యాధుల చికిత్సలో గంజాయిని వాడుతున్నారు?

వైద్యులు గంజాయిని నేరుగా కాకుండా నిర్దిష్ట మోతాదుల్లో కింది సమస్యల నివారణకు సిఫార్సు చేస్తారు.

క్యాన్సర్ : క్యాన్సర్ ఆఖరి దశలో ఉన్న రోగులకు లేదా ఆర్థరైటిస్, నరాల బలహీనత వల్ల వచ్చే విపరీతమైన నొప్పిని తగ్గించడానికి సాధారణ పెయిన్ కిల్లర్స్ పనిచేయవు. ఇలాంటివారికి మెడికల్ గంజాయిని డాక్టర్లు సిపార్స్ చేస్తుంటారు.

ఫిట్స్ : ముఖ్యంగా పిల్లల్లో వచ్చే కొన్ని రకాల తీవ్రమైన ఫిట్స్ (ఉదాహరణకు: డ్రావెట్ సిండ్రోమ్) తగ్గించడానికి CBD ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుందని అంతర్జాతీయ వైద్య సంస్థలు (FDA) గుర్తించాయి.

క్యాన్సర్ కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ : క్యాన్సర్ రోగులకు కీమోథెరపీ చేసినప్పుడు విపరీతమైన వాంతులు, వికారం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు వస్తాయి. వాటిని తగ్గించి, రోగి కోలుకునేలా చేయడానికి ఇది సహాయపడుతుంది.

మల్టిపుల్ స్క్లెరోసిస్ : ఈ వ్యాధి వల్ల కండరాలు తీవ్రంగా బిగుసుకుపోతాయి. గంజాయిలోని రసాయనాలు కండరాలకు ఉపశమనాన్ని ఇస్తాయి.

మానసిక సమస్యలు : తీవ్రమైన డిప్రెషన్, అల్జీమర్స్, PTSD (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్) వంటి సమస్యలతో బాధపడేవారిలో మెదడును ప్రశాంత పరచడానికి గంజాయిని వాడుతుంటారు.

55
రోగులకు గంజాయిని ఎలా అందిస్తారు?
Image Credit : stockPhoto

రోగులకు గంజాయిని ఎలా అందిస్తారు?

చాలామంది అనుకున్నట్టు గంజాయిని సిగరెట్ లా కాల్చడం వైద్యంలో ఉండదు. ఎందుకంటే పొగ వల్ల ఊపిరితిత్తులు పాడవుతాయి. అందుకే వైద్యులు అవసరమైన వారికి సురక్షితమైన పద్ధతుల్లో ఇస్తారు.

క్యాప్సూల్స్ లేదా మాత్రలు (Pills) : నోటి ద్వారా మింగే మందులు.

ఆయిల్స్, లిక్విడ్స్ (Oils & Tinctures) : నాలుక కింద కొన్ని చుక్కలు వేసుకునే నూనె రూపంలో.

స్ప్రేలు లేదా క్రీములు (Topicals) : నొప్పులు ఉన్న చోట చర్మంపై రాసుకోవడానికి.

వేపరైజర్స్ (Vaporizers) : మందును ఆవిరి రూపంలో పీల్చుకోవడం.

మెడికల్ గంజాయి అనేది ఒక ప్రిస్క్రిప్షన్ మందు మాత్రమే. లైసెన్స్ ఉన్న డాక్టర్ పర్యవేక్షణ లేకుండా, సొంతంగా గంజాయిని వాడటం చట్టరీత్యా నేరం, ప్రాణాలకే ప్రమాదం. మోతాదు మించితే మైకం, అలసట, జ్ఞాపకశక్తి తగ్గడం లేదా గుండె వేగం పెరగడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakhi Special Songs: అన్నాచెల్లెలి ప్రేమానుబంధానికి కేరాఫ్ అడ్రస్.. రాఖీ పండుగ స్పెషల్ టాప్ 5 హిట్ సాంగ్స్ !
Recommended image2
USA Jobs: అమెరికాలో భారతీయులు ఎక్కువగా చేసే ఉద్యోగాలు ఏంటో తెలుసా?
Recommended image3
Rakhi: 90s లో పెద్ద పెద్ద మెరుపుల రాఖీలు గుర్తున్నాయా? తక్కువ కాస్ట్ తో.. చేతినిండా కనిపించే రాఖీల తీపిజ్ఞాపకాలు..
Related Stories
Recommended image1
Hyderabad : వీడెవడండీ బాబు..! హైదరాబాద్ నడిబొడ్డున గంజాయి సాగు చేస్తున్నాడు
Recommended image2
హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్లు.. కిరాణ దుకాణంలో యథేచ్ఛగా విక్రయాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved