MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Maredumilli: లోయలు, జలపాతాలతో నిండిన మారేడుమిల్లి.. ఆ హిల్ స్టేషన్‌కు ఎలా వెళ్లాలో తెలుసుకోండి

Maredumilli: లోయలు, జలపాతాలతో నిండిన మారేడుమిల్లి.. ఆ హిల్ స్టేషన్‌కు ఎలా వెళ్లాలో తెలుసుకోండి

Maredumilli: మారేడుమిల్లి పచ్చని అడవులు, జలపాతాల మధ్య ఉండే అందమైన గ్రామం. ఇక్కడికి వెళ్లారంటే తిరిగి రావాలనిపించదు.. అంత ఆహ్లాదంగా ఉంటుంది. ఈ ప్రాంతానికి ఎలా వెళ్లాలో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 19 2026, 11:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మారేడుమిల్లి ఎక్కడుంది?
Image Credit : Gemini

మారేడుమిల్లి ఎక్కడుంది?

మారేడుమిల్లి పేరు చెబితే పచ్చని ప్రకృతే గుర్తుకువస్తుంది. గజిబిజి నగర జీవితాల మధ్య ఒక్కరోజైనా ఈ గ్రామంలో గడిపిచూడండి.. తిరిగి రావాలనిపించదు. దట్టమైన అడవులు, కొండల మధ్య నుండి జాలువారే జలపాతాలు.. పచ్చని ప్రకృతి.. వీటన్నింటి కలయికే మారేడుమిల్లి. తూరుగోదావరి జిల్లాలో ఉన్న ఈ హిల్ స్టేషన్ ఒక స్వర్గంలా కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో ఇక్కడి రోడ్లపై ప్రయాణిస్తుంటే, దట్టమైన పొగమంచు మనల్ని తాకుతూ వెళుతుంది. కేరళకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇక్కడ కేరళ వాతావరణాన్ని చూసేయచ్చు. తూర్పు కనుమల మధ్య ఉండే మారేడుమిల్లికి ఎలా వెళ్లాలో... అక్కడ చూడాల్సిన ప్రాంతాలేంటో తెలుసుకోండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
మారేడుమిల్లి ఎలా వెళ్లాలి?
Image Credit : Gemini

మారేడుమిల్లి ఎలా వెళ్లాలి?

మారేడుమిల్లి చేరుకోవడం చాలా సులభం. వైజాగ్ నుండి మారేడుమిల్లి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వైజాగ్ నుండి రాజమండ్రి మీదుగా కారులో గానీ లేదా బస్సులో గానీ 5 నుండి 6 గంటల్లో చేరుకోవచ్చు. ఇక హైదరాబాద్ నుండి మారేడుమిల్లి సుమారు 430 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైదరాబాద్ నుండి వచ్చే వారు ఖమ్మం, భద్రాచలం మీదుగా ఘాట్ రోడ్డు ప్రయాణం చేస్తూ 8 నుండి 9 గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. లేదా హైదరాబాద్, వైజాగ్ ల నుండి రాజమండ్రి వరకు రైలు లేదా విమానంలో వచ్చి, అక్కడి నుండి కేవలం 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారేడుమిల్లికి లోకల్ బస్సులు లేదా ట్యాక్సీల ద్వారా సులభంగా చేరుకోవచ్చు.

34
మారేడుమిల్లిలో చూడాల్సిన ప్రాంతాలు
Image Credit : Gemini

మారేడుమిల్లిలో చూడాల్సిన ప్రాంతాలు

మారేడుమిల్లికి అడుగుపెట్టగానే మొదట చూడాల్సి జలతరంగిణి, ‘అమృతధార’ అనే జలపాతాలను. కొండ రాళ్ల మధ్య నుంచి దూకే ఆ తెల్లటి నీటి ధారల కింద స్నానం చేస్తుంటే ఎంత హాయిగా ఉంటుందో. ఆ తర్వాత మన్యం వ్యూ పాయింట్, సోకులేరు వ్యూ పాయింట్ల నుండి పచ్చటి లోయలను చూస్తూ ఫోటోలు దిగాలి. వీటితో పాటు భూపతిపాలెం రిజర్వాయర్‌లో బోటింగ్, రాత్రి వేళ అడవి మధ్యలో ఉండే ‘జంగిల్ స్టార్’ క్యాంపింగ్ సైట్‌లో టెంట్లు వేసుకుని నక్షత్రాల కింద నిద్రపోతే ఆ కిక్కేవేరు. అక్కడ ఉంటే గుడిస హిల్స్ కూడా అందంగా ఉంటాయి.

44
తినాల్సిన స్థానిక ఆహారాలు
Image Credit : Gemini

తినాల్సిన స్థానిక ఆహారాలు

మారేడు మిల్లికి వెళ్లాక అక్కడ దొరికే స్థానిక ఆహారాలు తినకుండా వెనక్కి రాకూడదు. అక్కడ దొరికే బాంబూ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. నూనె వాడకుండా, చికెన్ ముక్కలకు స్థానిక గిరిజన మసాలాలు పట్టించి, వెదురు బొంగులలో పెట్టి, నిప్పులపై కాల్చే వంటకం ఇది. చికెనే కాకుండా బాంబూ బిర్యానీ, అడవి చేపల కూర, గిరిజన పద్ధతిలో వండే నాటుకోడి పులుసు కూడా చాలా రుచిగా ఉంటాయి. రోడ్డు పక్కన వేడివేడిగా దొరికే ఈ సాంప్రదాయ గిరిజన వంటకాలు ధరలు కూడా తక్కువగానే ఉంటాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆంధ్ర ప్రదేశ్
ప్రయాణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
IRCTC: పద్మనాభస్వామి నుంచి రామేశ్వరం వరకు.. ఐఆర్‌సీటీసీ నుంచి అదిరిపోయే సౌత్ టెంపుల్ టూర్
Recommended image2
ఉద్యోగం వదిలేసి పీతల వ్యాపారంతో రోజుకు రూ.14 లక్షలు సంపాదిస్తున్న యువతి
Recommended image3
Mushrooms : ఏంటీ..కిలో మష్రూమ్స్ రూ.60 లక్షలా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుట్టగొడుగులు
Related Stories
Recommended image1
Chia Seeds: ప్రతిరోజూ చియా సీడ్స్ నీళ్లు తాగితే ఏం జరుగుతుంది? షాకింగ్ రిజల్ట్స్
Recommended image2
Palmistry: మీ చేతిలో ఈ 5 రేఖలు ఉంటే చాలు ఎప్పటికైనా కోటీశ్వరులవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved