MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Feature
  • జీవిత సత్యాలు : మీరు సుఖంగా ఉండాలంటే.. అస్సలు చేయకూడని పనులివే..

జీవిత సత్యాలు : మీరు సుఖంగా ఉండాలంటే.. అస్సలు చేయకూడని పనులివే..

మీ జీవితం హాయిగా సాగాలంటే కొన్ని పనులు అస్సలు చేయకూడదు… చేశారో బాధలు తప్పవు. బ్రతికుండగా అస్సలు చేయకూడని పనులేవి… చేస్తే ఏం జరుగుతుంది? అనేది తెలుసుకుందాం. 

2 Min read
Author : Amarnath Vasireddy
Published : Feb 12 2026, 06:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
1 . అప్పివ్వొద్దు గురూ..!
Image Credit : Getty

1 . అప్పివ్వొద్దు గురూ..!

 మీ దగ్గర డబ్బుంటే .. అవతలి వ్యక్తి పై జాలి ఉంటే.. ఉచితంగా డబ్బు ఇవ్వండి. అపాత్ర దానం చెయ్యొద్దు. కానీ తిరిగీ రాబట్టు కోవాలనే ఉద్దేశంతో అప్పు ఇవ్వొద్దు . బెట్టింగ్ ఆడే వారు, దుబారా ఖర్చులు చేసేవారు , గుడ్డిగా ఏదో ఒక వ్యాపారం మొదలెట్టి నష్టపోయే వారు.. ఇలాంటి వారితో లోకం నిండి ఉంది. మీరు అప్పిస్తే దాన్ని తిరిగి రాబట్టుకోలేరు. అంత్య నిష్టూరం కన్నా అది నిష్టూరం మిన్న. మొగమాటానికి పోకుండా.."అప్పు ఇవ్వడానికి నేను బ్యాంకు కాదు. అప్పు ఇవ్వను" అని చెప్పేయండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అప్పు మహా ముప్పు...
Image Credit : Getty

అప్పు మహా ముప్పు...

2 . రెండు రూపాయిల కన్నా ఎక్కువ వడ్డీకి అప్పుతీసుకోవద్దు. అదీ అవసరం అయితేనే. బ్యాంకు రుణాలు బెస్ట్. నాలుగు, ఆరు , పది రూపాయిల వడ్డీకి అప్పుతీసుకొంటే మునగడం ఖాయం. ప్రపంచంలో ఏ బిజినెస్ అయినా 25-30 శాతానికి మించి లాభాలు రావు. నాలుగు రూపాయిలు అంటే 48 %, ఆరు అంటే 72% . దొంగ నోట్లు ముద్రించే వ్యాపారం చేస్తారా? అంత లాభాలు ఎలా వస్తాయి ? కాలం గడిచే కొద్దీ తిరిగి చెలించాల్సిన మొత్తం పెరిగి పోతుంటుంది. అది కట్ట లేరు. అలాంటి వడ్డీ వ్యాపారం చేసేవారు క్రిమినల్ పనులు చేస్తారు. ఇంటి సభ్యుల మానాలు, ప్రాణాలు అపాయంలో పడుతాయి.

35
అప్పులకు హామీ వద్దు... పొదుపు ముద్దు
Image Credit : freepik

అప్పులకు హామీ వద్దు... పొదుపు ముద్దు

3. ఎవడి అప్పుకూ హామీ ఇవ్వొద్దు... వాడితో బాటూ మీరూ మునిగే ప్రమాదం.

4. సంపాదనలో అది ఎంత తక్కువగా ఉన్నా సరే , పది శాతం పొదుపు చెయ్యండి. అధిక వడ్డీ పథకాలు తక్కువ కాలంలో రెట్టింపు అయ్యే స్కీంలు నమ్మకండి. బ్యాంకులు , పోస్ట్ ఆఫీస్ లలో డిపాజిట్ చెయ్యండి. లేదా బంగారం కొనండి. వడ్డీ ద్వారా సంపద పెంచుకోవాలి అనే ఆలోచన వద్దు. చెబితే సెంటిమెంటల్ గా అశాస్త్రీయంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారం చేసిన వారి జీవితాలు కొంత కాలం వెలుగుతాయి. అటు పైన ఆరిపోతాయి. వారి వారసులకు కూడా ఆ పాపం తగులుతుంద. తండ్రి తప్పు చేస్తే బిడ్డలకు ఎందుకు శాపం? అని అడగకండి. అంత లాజిక్ లు నాకు తెలియదు. దేవుడు కన్పిస్తే అడుగుతా . ఆయనేమో కనిపించడాయే . చెడ్డ మార్గంలో వెళ్లి నాశనం అయ్యినవారిని వందల్లో చూసా. ఇక్కడో అక్కడో మీకు ఒకరు కన్పించవచ్చు. ఇప్పుడు వారి జీవితాల్లో వెలుగు ఉండవచ్చు. చిత్రం సశేషం అని గ్రహించండి.

45
రాచమార్గంలో సంపాదించండి...
Image Credit : Gemini AI

రాచమార్గంలో సంపాదించండి...

5. సన్నాసిలా బతకమని చెప్పడం లేదు. ఎక్కువ సంపాదించాలి. స్టాండర్డ్ అఫ్ లివింగ్ పెంచుకోవాలి. దానికి ఒకటే మార్గం.. రాచ మార్గం. అడ్డదారులు... దొంగదారులు వెతకకండి. ఈ రోజు ఎంజాయ్ చేస్తే సరిపోదు. రేపు అనేది ఒకటి ఉంది అని గుర్తు చేసుకోండి. ఒకనాటి నా మిత్రులు కొంతమంది. చాలా ఫేమస్ అయ్యారు. వీవీఐపీలు అయ్యారు. కోట్లకు పడగలెత్తారు. ఈ రోజు వారి జీవితం చూస్తే దారుణాతి దారుణం. పగవాడికి కూడా ఇంత కష్టం వద్దు అన్నట్టు ఉంది. జీవితంలో ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. లెక్కలన్నీ ఇక్కడే తేలిపోతాయి. దేవుడు దాక అక్కరలేదు. దీనికి సైంటిఫిక్ వివరణ ఉంది.

55
రాసి మార్గమా... వాసి మార్గమా..?
Image Credit : Getty

రాసి మార్గమా... వాసి మార్గమా..?

6. రాసి మార్గం - ఎంత డబ్బు ?ఎన్ని బెడ్ రూమ్ ల ఇల్లు ? ఎన్ని నగలు ? ఎన్ని కారులు .. ఇలా?

డబ్బు కావాలి. కానీ కేవలం డబ్బే సుఖం ఇవ్వదు .

వాసి మార్గం - క్వాలిటీ అఫ్ లైఫ్ మేటర్స్.

ఇల్లు .. పిల్లలు .. బందువులు, స్నేహితులు, పోషకాహారం, పని, వ్యాయామం, నిద్ర, విశ్రాంతి , ఆరోగ్య కరమయిన వినోదం.

ప్రకృతి అనేది ఒకటుంది. దానికి వ్యతిరేకంగా నడిస్తే బతుకు దబిడి దిబిడే.

మీ జీవితం వాసి రెడీ మార్గంలో సాగాలి అని కోరుకొంటూ.

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
జీవనశైలి
నీతి కథలు
ఫీల్ గుడ్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Andhra Ooty: ఆంధ్ర ఊటీ.. అరకులో తప్పకుండా చూడాల్సిన టాప్ 10 ప్రదేశాలు ఇవే
Recommended image2
ఎంత బ‌ల‌వంతుడివైనా స‌రే కోపం జీవితాన్ని నాశ‌నం చేయ‌డం ఖాయం.. క‌నువిప్పు క‌లిగించే క‌థ
Recommended image3
DMart Offers : MRP తో పనేలేదు.. డీమార్ట్‌లో అతితక్కువ ధరకు దొరికే 10 వస్తువులు ఇవే
Related Stories
Recommended image1
Debt: త్వరగా అప్పు తీరే మార్గం ఏంటి.? ఛాట్ జీపీటీ చెప్పిన సమాధనం ఏంటంటే
Recommended image2
Credit Card Bill: క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతున్నారా? ఇలా అయితే అప్పు తీర్చేయచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved