MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Real Estate on The Moon : చంద్రుడిపై జోరుగా రియల్ ఎస్టేట్.. ఎకరం భూమి ధర ఎంతో తెలుసా?

Real Estate on The Moon : చంద్రుడిపై జోరుగా రియల్ ఎస్టేట్.. ఎకరం భూమి ధర ఎంతో తెలుసా?

భూమి మీద ఓ చిన్న స్థలం కొనడమే గొప్ప అనుకుంటున్న ఈ రోజుల్లో, కొందరు ఏకంగా చందమామపైనే ప్లాట్లు కొనేశారు. హాలీవుడ్, బాలీవుడ్ స్టార్లతో పాటు సామాన్య మధ్యతరగతి ప్రజలు కూడా ఈ లిస్టులో ఉన్నారు. ఇంతకీ చంద్రుడిపై ఎకరం భూమి ధర ఎంతో తెలుసా?

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 13 2026, 04:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
చంద్రుడిపై రియల్ ఎస్టేట్ దందా
Image Credit : Gemini AI

చంద్రుడిపై రియల్ ఎస్టేట్ దందా

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) తో పాటు ఇండియా స్పేస్ ఏజెన్సీ ఇస్రో (ISRO) చంద్రుడిపై మానవ నివాసం సాధ్యమో, కాదో తెలుసుకునేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇస్రో చంద్రయాన్ ప్రయోగాలు చేపట్టింది... చంద్రయాన్ 1,2,3 పూర్తవగా చంద్రయాన్ 4 కు సిద్దమయ్యింది. అమెరికా అయితే 50 ఏళ్ల కిందటే ఏకంగా మనుషులనే (వ్యోమగాములను) చంద్రుడిపైకి పంపింది. ఇతర దేశాల స్పేస్ ఏజెన్సీలు కూడా చంద్రుడిపై ప్రయోగాలు చేస్తున్నాయి.

అయితే చంద్రుడిపై మనిషి శాశ్వత నివాసం సాధ్యమో, కాదో ఇంకా తేలనేలేదు... అప్పుడే అక్కడ భూముల విక్రయాలు ప్రారంభించి రియల్ ఎస్టేట్ దందా ప్రారంభించాయి కొన్ని సంస్థలు. ఇలా లూనార్ ఎంబసీ, లూనా సొసైటీ ఇంటర్నేషనల్, ఇంటర్నేషనల్ లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ వంటి సంస్థలు చంద్రుడిపై భూములను విక్రయిస్తున్నాయి. చాలామంది సెలబ్రిటీలే కాదు సామాన్యులు సైతం చంద్రుడిపై భూములు కొంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
చంద్రుడిపై భూమి కొనడం లీగలేనా?
Image Credit : Gemini

చంద్రుడిపై భూమి కొనడం లీగలేనా?

1980లలో డెన్నిస్ హోప్ అనే వ్యక్తి అంతర్జాతీయ అంతరిక్ష చట్టంలోని ఓ లొసుగును వాడుకుని చంద్రుడిపై భూముల అమ్మకాన్ని ప్రారంభించాడు. దేశాలు చంద్రుడిని సొంతం చేసుకోలేవు కానీ, వ్యక్తులు కొనడాన్ని ఏ చట్టం ఆపలేదని అతను వాదిస్తున్నాడు. ఇలా చంద్రుడిపై భూములను అమ్మడానికే 'లూనార్ ఎంబసీ' అనే సంస్థను స్థాపించాడు… ఇప్పటివరకు చాలామందికే అమ్మాడు. ఇలా చంద్రుడిపై స్థలం కొన్నవారిలో సెలబ్రిటీలు కూడా ఉన్నారు.

అయితే చంద్రుడిపై భూమిని కొనుగోలుకు చట్టబద్దత లేదని తెలిసినా చాలామంది సరదాగా కొంటున్నారు. స్నేహితులు, కుటుంబసభ్యులకు గిప్టుగా ఇవ్వడానికి లేదంటే అంతరిక్ష అంశాలపై ఆసక్తితో చంద్రుడిపై భూమిని కొంటున్నారు. అందుకే నాామమాత్రపు ధరలకే చంద్రుడిపై భూమి లభిస్తోంది… ల్యాండ్ డీడ్, మ్యాప్, ఇతర పత్రాలు ఉన్నప్పటికీ చంద్రుడిపై ఎవరికీ, ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండవు.

Related Articles

Related image1
Hyderabad Real Estate : 100 ఎకరాల్లో కొత్త బస్ టెర్మినల్, ఇక్కడ రియల్ బూమ్ ఖాయం.. ఇప్పుడే స్థలమో, ఇల్లో కొనిపెట్టుకొండి
Related image2
ISRO: Chandrayan-3: చంద్రయాన్-3కి వరల్డ్ స్పేస్ అవార్డు
35
చంద్రుడిపై స్థలం ఖరీదెంత?
Image Credit : Chatgpt

చంద్రుడిపై స్థలం ఖరీదెంత?

స్థలం ధర : చంద్రుడిపై ఎకరం భూమి కొనడానికి సగటున 20 నుంచి 40 డాలర్లు ఖర్చు అవుతుంది. మన కరెన్సీలో సుమారు రూ.1,700 నుంచి రూ.3,400 రూపాయలు మాత్రమే.

మారే ధరలు : స్టాక్ మార్కెట్ లాగే, ఇక్కడ కూడా డిమాండ్‌ను బట్టి ధరలు మారుతుంటాయి. ఉదాహరణకు 'సీ ఆఫ్ ట్రాంక్విలిటీ' లాంటి చారిత్రక ప్రదేశాల్లో రేటు ఎక్కువ.

డిస్కౌంట్లు : ఎక్కువ భూమి కొంటే డిస్కౌంట్ కూడా లభిస్తుంది. కొన్ని వెబ్‌సైట్లలో చంద్రుడిపై ఎంత ఎక్కువ భూమి కొనుగోలు చేస్తే అంత డిస్కౌంట్ లభిస్తుంది.

45
చంద్రుడిపై భూమి కలిగిన మన సెలబ్రిటీలు వీళ్లే..
Image Credit : Facebook

చంద్రుడిపై భూమి కలిగిన మన సెలబ్రిటీలు వీళ్లే..

షారుఖ్ ఖాన్ : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు చంద్రుడిపై స్థలం ఉంది. ఆస్ట్రేలియాకు చెందిన ఓ అభిమాని ప్రతి ఏటా ఆయన పుట్టినరోజుకు 'సీ ఆఫ్ ట్రాంక్విలిటీ' ప్రాంతంలో కొంత భూమిని కొని బహుమతిగా ఇస్తుంటారు. ఆయన పేరు మీద అక్కడ ఓ క్రేటర్ (గుంత) కూడా ఉంది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ : దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఖగోళ శాస్త్రంపై చాలా ఆసక్తి ఉండేది. అందుకే ఆయన చంద్రుడిపై 'మేర్ మస్కోవియన్స్' లేదా 'సీ ఆఫ్ మస్కోవి' అని పిలిచే ప్రాంతంలో స్థలం కొనుగోలు చేశారు.

55
వీళ్లకు కూడా చంద్రుడిపై భూమి ఉంది..

వీళ్లకు కూడా చంద్రుడిపై భూమి ఉంది..

టామ్ క్రూజ్ : సాహస చిత్రాలకు పెట్టింది పేరైన హాలీవుడ్ నటుడు టామ్ క్రూజ్ ఈ జాబితాలో ముందున్నారు.

నికోల్ కిడ్మన్ : ఆస్కార్ అవార్డు గ్రహీత, నటి నికోల్ కిడ్మన్ కూడా చంద్రుడిపై స్థలం కొన్నారు.

 జాన్ ట్రవోల్టా : విమానాలు నడపడంలో ఆసక్తి ఉన్న జాన్ ట్రవోల్టా, ఆకాశంపై తనకున్న ప్రేమతో చంద్రుడిపై స్థలం కొన్నారు.

ఇతర ప్రముఖులు: ఈ స్టార్లే కాకుండా అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్, ప్రముఖ జర్నలిస్ట్ బార్బరా వాల్టర్స్ వంటి వారు కూడా చంద్రుడిపై భూమిని కలిగి ఉన్నారని రిపోర్టులు చెబుతున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఫీల్ గుడ్ న్యూస్
ఏషియానెట్ న్యూస్
ప్రపంచం
Latest Videos
Recommended Stories
Recommended image1
Interesting Facts: మనకు గూస్‌బంప్స్ ఎందుకు వస్తాయి? ఆ టైంలో శరీరంలో ఏం జరుగుతుంది?
Recommended image2
School: స్కూల్ అనే పదానికి అర్ధం ఏంటి? ఏ భాష నుంచి పుట్టిందో తెలుసా?
Recommended image3
Seven Sisters of India : ఈశాన్య రాష్ట్రాలను సెవెన్ సిస్టర్స్ అని ఎందుకంటారు? వీటికి ఓ బిగ్ బ్రదర్ కూడా ఉన్నాడు, ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
Hyderabad Real Estate : 100 ఎకరాల్లో కొత్త బస్ టెర్మినల్, ఇక్కడ రియల్ బూమ్ ఖాయం.. ఇప్పుడే స్థలమో, ఇల్లో కొనిపెట్టుకొండి
Recommended image2
ISRO: Chandrayan-3: చంద్రయాన్-3కి వరల్డ్ స్పేస్ అవార్డు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved