MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Hyderabad Real Estate : 100 ఎకరాల్లో కొత్త బస్ టెర్మినల్, ఇక్కడ రియల్ బూమ్ ఖాయం.. ఇప్పుడే స్థలమో, ఇల్లో కొనిపెట్టుకొండి

Hyderabad Real Estate : 100 ఎకరాల్లో కొత్త బస్ టెర్మినల్, ఇక్కడ రియల్ బూమ్ ఖాయం.. ఇప్పుడే స్థలమో, ఇల్లో కొనిపెట్టుకొండి

చిన్న విద్యాసంస్థ లేదంటే ఓ ప్రభుత్వ కార్యాలయమో వస్తేనే ఆ ప్రాంతం ఊహించని విధంగా డెవలప్ అవుతుంది. అలాంటిది 100 ఎకరాల్లో అత్యాధునిక బస్ టెర్మినల్ వస్తే ఆ డెవలప్మెంట్ ఊహించగలమా..! ఇదే రాబోయేరోజుల్లో హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో జరగనుంది.

3 Min read
Author : Arun Kumar P
Published : Aug 07 2026, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గాజులరామారంలో కొత్త బస్ టెర్మినల్
Image Credit : Gemini AI

గాజులరామారంలో కొత్త బస్ టెర్మినల్

Hyderabad Real Estate : హైదరాబాద్ లో సొంతిల్లు లేదా ఇంటిస్థలం చాలామంది కల. రూపాయి రూపాయి కూడబెట్టి ఇందుకోసం డబ్బులు జమ చేస్తుంటారు... ఇలా చెమటోడ్చి సంపాదించిన డబ్బులతో భవిష్యత్ లో బాగా డెవలప్ అయ్యే అవకాశాలున్న ప్రాంతంలో స్థలమో లేదా ఇళ్లో కొనాలనుకుంటారు. ఇలా ప్రస్తుతం ధరలు తక్కువగా ఉండి భవిష్యత్ లో డెవలప్ అయ్యే ప్రాంతాలు హైదరాబాద్ లో అనేకం ఉన్నాయి... అలాంటి ప్రాంతాలే జగద్గిరిగుట్ట, గాజులరామారం. ఇక్కడ డెవలప్మెంట్ అవకాశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
100 ఎకరాల్లో బస్ టెర్మినల్... లోక్ సభలో కేంద్రం మంత్రి ప్రకటన
Image Credit : Gemini AI

100 ఎకరాల్లో బస్ టెర్మినల్... లోక్ సభలో కేంద్రం మంత్రి ప్రకటన

హైదరాబాద్ లో ప్రధానంగా రెండు బస్ టెర్మినల్ ఉన్నాయి... ఒకటి అప్జల్ గంజ్ ప్రాంతంలో మహాత్మా గాంధీ బస్టాండ్ (MGBS), రెండోది సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్టాండ్ (JBS). ఈ రెండు బస్ టెర్మినల్స్ నుండి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు బస్సులు నడుస్తుంటాయి... అలాగే సిటీ బస్సులు కూడా నడుస్తాయి. 

సిటీ నడిబొడ్డున ఉండటం, అన్ని బస్సులు ఇక్కడినుండే నడవడంతో ఈ రెండు బస్టాండ్స్ పై ఒత్తిడి ఎక్కువగా ఉంది... నగరంలో ట్రాఫిక్ సమస్యలు ఇది కూడా ఓ కారణమే. అందుకే నగరంలో ఓ చివరన మరో భారీ బస్ టెర్మినల్ నిర్మించేందుకు తెలంగాణ ఆర్టిసి, రాష్ట్ర ప్రభుత్వం సిద్దమయ్యాయి ఇందుకోసం కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజులరామారంను ఎంచుకున్నారు.

కేంద్ర రోడ్డురవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా లోక్ సభలో ఈ బస్ టెర్మినల్ గురించి ప్రస్తావించారు. ఎంపీలు ఈటల రాజేందర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నలకు మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.... టిజిఎస్ ఆర్టిసి గాజులరామారంలో బస్ టెర్మినల్ నిర్మాణానికి సిద్దం అవుతోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ బస్ టెర్మినల్ నిర్మాణానికి 100 ఎకరాల స్థలాన్ని కూడా కేటాయించినట్లు స్పష్టం చేశారు. దీని నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తగ్గే అవకాశాలున్నాయి.

Related Articles

Related image1
Real Estate : హైదరాబాద్‌లో మరో హైటెక్ సిటీ.. లక్షల్లో పెట్టుబడి, కోట్లలో లాభం !
Related image2
Hyderabad Real Estate : మరో కూకట్ పల్లి, నిజాంపేట్ లోడింగ్... ఈ శివారు ప్రాంతాల్లో పెట్టుబడి మీ జీవితాన్నే మార్చేస్తుంది
34
అత్యాధునిక సదుపాయాలతో బస్ టెర్మినల్
Image Credit : Gemini AI

అత్యాధునిక సదుపాయాలతో బస్ టెర్మినల్

గాజులరామారంలో టిజిఎస్ ఆర్టిసి నిర్మించే బస్ టెర్మినల్ లో అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దనున్నారు. తెలంగాణ జిల్లాల నుండే కాదు ఇతర రాష్ట్రాల నుండి వచ్చే బస్సుల కోసం ప్రత్యేక టెర్మినల్స్... సిటీ బస్సుల కోసమే మరో టెర్మినల్ ఏర్పాటుచేయనున్నారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి వచ్చే బస్సులు నగర నడిబొడ్డున గల ఎంజిబిఎస్. జెబిఎస్ బస్టాండ్స్ కు రాకుండా గాజులరామారం బస్టాండ్ కు మళ్లించనున్నారు.. తద్వారా నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టాలని భావిస్తోంది ప్రభుత్వం.

భవిష్యత్ లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం కూడా ఆర్టిసిలో ఎక్కువగా ఉండనుంది... కాబట్టి ఇందుకు తగినట్లుగా గాజులరామారం బస్ టెర్మినల్ లో ప్రత్యేక ఛార్జింగ్ స్టేషన్లకు ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రయాణికుల సౌకర్యం కోసం రెస్టారెంట్స్, ఇతర షాపులు, విశ్రాంతి స్థలాలు ఏర్పాటుచేయనున్నారు. ఇలా ట్రాఫిక్ సమస్యలను చెక్ పెడుతూనే కమర్షియల్ గా కూడా ఆర్టిసికి వర్కౌట్ అయ్యేలా, మంచి ఆదాయం సమకూరేలా గాజులరామారంలో కొత్త బస్ టెర్మినల్ ను తీర్చిదిద్దనున్నారు.

44
హైదరాబాద్ లోని ప్రాంతాల రూపురేఖలే మారిపోనున్నాయా?
Image Credit : Gemini AI

హైదరాబాద్ లోని ప్రాంతాల రూపురేఖలే మారిపోనున్నాయా?

గాజులరామారం బస్ టెర్మినల్ తో నగరంలోని కొన్నిప్రాంతాల రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. ముఖ్యంగా గాజులరామారం, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో ప్రస్తుతం ఇంటి స్థలాలు, ఇళ్ల ధరలు నగరంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. కానీ ఒక్కసారి బస్ టెర్మినల్ నిర్మాణం మొదలయితే అమాంతం ఇక్కడ ధరలు పెరగనున్నాయి... ఇక టెర్మినల్ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే ధరలు ఆకాశాన్ని అంటే అవకాశాలున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాబట్టి భవిష్యత్ లో మంచి లాభాలు కావాలంటే గాజులరామారం, జగద్గిరిగుట్టలో ఇన్వెస్ట్ చేయడం మంచిదని చెబుతున్నారు.

ఇక మేడ్చల్, బాచుపల్లి, నిజాంపేట, ప్రగతినగర్ వంటి ప్రాంతాలు ఇప్పటికే బాగా డెవలప్ అయ్యాయి. గాజులరామారంకు దగ్గర్లో ఉండటంతో బస్ టెర్మినల్ నిర్మాణం తర్వాత ఈ ప్రాంతాల్లో స్థలాలకు కూడా మరింత డిమాండ్ పెరుగుతుందని చెబుతున్నారు. జీడిమెట్ల, మల్లంపేట ప్రాంతాల రూపురేఖలు కూడా గాజులరామారం బస్ టెర్మినల్ తో మారిపోనున్నాయని రియల్ ఎస్టేట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
హైదరాబాద్
తెలంగాణ
స్థిరాస్తి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ యువతికి జర్మనీలో భారీ ఉద్యోగం.. నెలకు రూ.3.5 లక్షల జీతం
Recommended image2
హైద‌రాబాద్‌లో కొత్త బ‌స్ ట‌ర్మిన‌ల్‌.. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స‌మ‌స్య‌కు చెక్
Recommended image3
Success Story: 5 రూపాయల కూలీ నుంచి రూ. 1500 కోట్ల కంపెనీకి యజమాని.. సంచలన సక్సెస్ స్టోరీ
Related Stories
Recommended image1
Real Estate : హైదరాబాద్‌లో మరో హైటెక్ సిటీ.. లక్షల్లో పెట్టుబడి, కోట్లలో లాభం !
Recommended image2
Hyderabad Real Estate : మరో కూకట్ పల్లి, నిజాంపేట్ లోడింగ్... ఈ శివారు ప్రాంతాల్లో పెట్టుబడి మీ జీవితాన్నే మార్చేస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved