MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Feature
  • భార్య వివాహేతర సంబంధం... ఏకంగా పుస్తకమే రాసిన భర్త..!

భార్య వివాహేతర సంబంధం... ఏకంగా పుస్తకమే రాసిన భర్త..!

అసలు ఈ సమాజం ఎటుపోతోంది..? కుటుంబ విలువలు ఏమైపోతున్నాయి..?  భార్యా భర్తల మధ్య ఎందుకింత దూరం పెరుగుతోంది..? అయినా భార్య వివాహేతర సంబంధం గురించి బుక్ రాయడమేంటి..? 

4 Min read
Author : Amarnath Vasireddy
Published : Feb 02 2026, 09:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కుటుంబ వ్యవస్థకు ఏమయ్యింది..?
Image Credit : Getty

కుటుంబ వ్యవస్థకు ఏమయ్యింది..?

ఆమె సాఫ్ట్ వేర్ ఇంజనీర్ .

భర్త .. దుబాయ్ లో ఉద్యోగం .

అమ్మాయి. ఇంటర్ సెకండ్ ఇయర్.

అబ్బాయి.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ .

పిల్లలిద్దరినీ హాస్టల్ నుంచి తీసుకొని .. కారులో చర్లపల్లి రైల్వే స్టేషన్ కు వెళ్ళింది .

అప్పుడు సమయం రాత్రి 11.30 .

చర్లపల్లి రైల్వే స్టేషన్ లో కారు పార్క్ చేసి ట్రాక్ పక్కనే నడుచుకొంటూ ఘట్కేసర్ వైపు.

తల్లీ .. పిల్లలిద్దరూ... గంటన్నర పాటు నడిచారు .

పిల్లలిద్దర్నీ ఒడిసి పట్టుకొని రాత్రి ఒంటి గంటకు ... ఎదురుగా వస్తున్న గూడ్స్ రైలు కింద పడింది .

ముగ్గురూ మరణించారు .

ఇదీ ... పోలీస్ లు ఇచ్చిన సమాచారం ప్రకారం మీడియా లో వచ్చిన కథనం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హైదరాాబాద్ లో తల్లీబిడ్డల సూసైడ్
Image Credit : X/barkhatrehan16

హైదరాాబాద్ లో తల్లీబిడ్డల సూసైడ్

పిల్లలు ఇంటర్ చదువుతున్నారు .

"మమ్మీ. ఇదేంటి ఇంత రాత్రి పూట రైల్వే ట్రాక్ పక్కన నడవడమేంటి?" అని అడిగివుంటారు.

ఆమె బలవంతంగా ఇద్దరు పిల్లల్ని పట్టుకొని గూడ్స్ రైలు కింద పడే అవకాశం లేదు.

ఎందుకంటే ఇంటర్ చదివే అబ్బాయి.. అలాగే అమ్మాయి .. ఇద్దరి శారీరిక దారుఢ్యం ముందు తల్లి బలం నిలవదు.

పైగా గంటన్నర ట్రాక్ వెంబటే నడిచారు.

అంటే ఆ గంటన్నర ఆమె వారితో మాట్లాడింది .

మూకుమ్మడి ఆత్మ హత్యకు వారిని ఒప్పించింది.

ఏమి కారణం అయ్యివుంటుంది ?

ఆర్థిక కష్టాలు ?

అవకాశం లేదు .

భార్య భర్తల మధ్య వివాదం ?

అయితే .. పిలల్లు తాము కూడా చనిపోవాలని ఎందుకు అనుకొంటారు?

మమ్మీకి డాడీకి సయోధ్య కుదర్చాలి అని కదా అనుకొంటారు ?

Related Articles

Related image1
Teen Suicide అయ్యో.. ఎంత ఘోరం? సెల్ ఫోన్ ప్రాణం తీసిందిగా!
Related image2
Suicide prevention day: నింద‌, ఒత్తిడి, మౌనం.. పెరుగుతున్న ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణాలివే అంటున్న 1 లైఫ్
35
చర్లపల్లిలో తల్లీబిడ్డల ఆత్మహత్యకు కారణమేంటి..?
Image Credit : Getty

చర్లపల్లిలో తల్లీబిడ్డల ఆత్మహత్యకు కారణమేంటి..?

ఆమె ఫోన్ లో ఒక మెసేజ్ ఉందట . ఎవరో వ్యక్తి .. "సారీ మేడం ఇంకో సారి తప్పు చేయను" అని మెసేజ్ పెట్టారట.

అంటే ఏంటి ?

ఎలా అర్థం చేసుకోవాలి?

ఎవడో చేసిన తప్పుకు తాను ఆత్మహత్య చేసుకోవాలా ?

అందునా తనతోపాటు ఇద్దరు ఎదిగిన పిల్లలు కూడా ?

ఇంటర్ వయసు పిలల్లు లైఫ్ గురించి ఎన్నో కలలు కంటుంటారు .

వారిని గంటన్నరలో ఎలా ఒప్పించగలిగింది .

"దుబాయ్ లో ఉన్న డాడీ కి ఫోన్ చేద్దాము" అని వారు అడిగి ఉండరా ?

అంతలా ఎలా ఒప్పించగలిగింది ?

ఆమెకు వచ్చిన కష్టం ఏంటి ?

కారణం ఏమై ఉంటుంది ?

అది ఎంత బలంగా ఉంటుంది ?

చావాలి అనుకొంటే కారణాలు లక్ష .

బతకడానికి కారణం ఒక్కటే .. మనం మనుషులు కనుక .

జంతువులు ఆత్మ హత్య చేసుకోవు.

మనిషికి ఒకే జీవితం - సైన్స్ .

ఆత్మ హత్య చేసుకొంటే దెయ్యాలుగా మారి కష్టాలు తప్పవు - మతం .

ఈ కోణం నుంచి చూసినా ఆత్మ హత్య మహా పాపం .. మహా నేరం .

తన కడుపున పుట్టిన పాపానికి ఎదిగిన పిల్లల జీవితం కూడా నలిపేసింది తల్లి .

లోకం లో ఇంత నిరాశ నిస్పృహలు ఎందుకు ప్రబలుతున్నాయి ?

బతుకంటే పోరాటం ..

కష్టం తరువాత సుఖం .. చీకటి తరువాత వెలుగు .

ఈ జీవన సూత్రాన్ని ఎందుకు మరచి పోతున్నారు ?

45
భార్య వివాహేతర సంబంధంపై పుస్తకం రాశాడా..!
Image Credit : Getty

భార్య వివాహేతర సంబంధంపై పుస్తకం రాశాడా..!

ఇంకో ఘటన .

వారిద్దరిదీ ప్రేమ వివాహం .

తమ వృత్తుల్లో పేరుగాంచారు .

కొన్నేళ్ల క్రితం విడాకులు తీసుకొన్నారు .

అక్కడి దాక అది వారి పర్సనల్ లైఫ్ .

తన భార్య వివాహేతర సంభంధం కలిగి ఉండేదని భర్త ఏకంగా ఒక పుస్తకం రాశారు. అందులో తాను కూడా మరో స్త్రీ పట్ల ఎలా ఆకర్షితుడు అయ్యిందీ రాశారు.

వారికి ఇద్దరు అబ్బాయిలు .

ఇద్దరూ అమెరికా లో .. ముప్పై కి కాస్త అటుఇటు వయస్సు .

మన మమ్మీ గురించి డాడీ ఇలా బుక్ రాశారు అని తెలుకొన్నాక వారి ఫీలింగ్ ఎలా ఉంటుంది ?

వివాహం కుటుంబం .. ఈ వ్యవస్థలు తగలబడి పోనీ .

కనీసం మనిషి పై మనిషికి నమ్మకం కుదురుతుందా ?

వారు ప్రొఫెషనల్ లైఫ్ లో నలుగురితో కలిసి పని చేయగలరా ?

అమెరికా సమాజం వేరు .. అక్కడి సామాజిక ప్రమాణాలు వేరు .. నిజమే .. కానీ అమ్మ నాన్న కదా? . వారు పుట్టి పెరిగింది ఇక్కడే కదా ?

55
ఒంటరితనమే చంపేస్తోందా..?
Image Credit : Getty

ఒంటరితనమే చంపేస్తోందా..?

ఇంకో ప్రశ్న .

అమెరికా లో ఇన్నాళ్ళు ప్రొఫషనల్ లైఫ్ కు అత్యధిక ప్రాధాన్యం .

ఒక విధంగా చెప్పాలి అంటే .. బతకడం కోసం ఉద్యోగం కాదు .. ఉద్యోగం కోసం బతకడం .

ఇండియా లో కూడా ఆ సంస్కృతి వచ్చేసింది అనుకోండి . కాదనను .

ప్రాణం కంటే ఎక్కువగా బావించిన ఉద్యోగాలు ఇప్పుడు పోతున్నాయి .

2030 సంవత్సరానికి నిరుద్యోగం తారా స్థాయిలో ఉంటుందని అంచనా .

ప్రధానంగా ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు .

ఎక్కువగా ప్రబావితమయ్యేది యువతీ యువకులు

బాధల్లో ఉన్న వ్యక్తికి కుటుంబమే అండ .. మానసిక ఊరట .

కుటుంబాలే లేని వ్యక్తులకు ?

ఉద్యోగం పోయాక ఇంటి కొచ్చి ఎవరి ఒడిలో తల పెట్టి ఏడవాలి ?

ఎవరి ద్వారా సాంత్వన పొందాలి ?

ఎందుకు బతకాలి ? ఎవరి కోసం బతకాలి అని వారికి అనిపించిందా ?

ఈ పోస్ట్ లో చివరి అంశం .

1450 నుంచి 1530 వరకు పోర్చుగీసు రియల్ .

1530 నుంచి 1640 వరకు స్పానిష్ డాలర్ .

1`640 నుంచి 1720 వరకు డచ్ గిల్డర్ .

1720 నుంచి 1815 వరకు ఫ్రెంచ్ ఫ్రాంక్ .

1815 నుంచి 1920 వరకు బ్రిటిష్ పౌండ్ .

1920 నుంచి నేటి దాక అమెరికన్ డాలర్ .

ఒక దేశ కరెన్సీ అంతర్జాతీయ ఆధిపత్యం మహా అంటే 110 సంవత్సరాలే . డాలర్ ఆధిపత్యం ఇప్పటికే 105 సంవత్సరాలు . అంటే ఇక మిగిలింది అయిదేళ్ళేనా ??

ఇప్పుడు అమెరికా అప్పులు 38.5 ట్రిలియన్ డాలర్స్ .

డాలర్ అంతర్జాతీయ నమ్మకాన్ని కోల్పోతోంది .

అందుకే 2000 లో 73 % గ్లోబల్ రిజర్వు ... డాలర్స్ రూపం లో ఉంటే అది ఇప్పుడు 58 శాతానికి పడిపోయింది .

చైనా వాడు తెలివయినోడు .

అంతకు మించి స్విట్జర్లాండ్ వాళ్ళు . డబ్బు తో వారు వ్యాపారం చేసినట్టు ఎవరూ చేయలేరు .

డాలర్ ని నమ్ముకొంటే లాభం లేదని వాళ్ళు టన్నుల కొద్దీ బంగారం కొంటున్నారు . అందుకే గోల్డ్ రేట్స్ ఆలా పెరుగుతున్నాయి .

పిలల్లు , వారి పిలల్లు అమెరికా లో సెటిల్ అయితే జీవితం హ్యాపీ అని లక్షల మంది భారతీయుల నమ్మకం .

డాలర్ దెబ్బతింటే ..ఉద్యోగాలు పోయి, ఆర్థిక కష్టాలు అలుముకొంటే ... కుటుంబ వ్యవస్థ పై నమ్మకం తగ్గుతున్న భావితరాలకు మానసిక అండ ఎవరు ?

సమాజానికి పునాది ... వివాహ - కుటుంబ వ్యవస్థ .

అది దెబ్బ తింటే ?

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
పశ్చిమ బెంగాల్‌లోని ఈ ప్రాంతాల్లో ఆగస్టు 18న స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు చేసుకుంటారు?
Recommended image2
Rare Trees: ప్రపంచంలో అత్యంత విచిత్రమైన 5 చెట్లు! ఎక్కడ ఉన్నాయో తెలుసా?
Recommended image3
Samosa: సమోసా ఏ దేశంలో పుట్టింది? మనదేశంలోకి ఎప్పుడు, ఎలా అడుగుపెట్టింది?
Related Stories
Recommended image1
Teen Suicide అయ్యో.. ఎంత ఘోరం? సెల్ ఫోన్ ప్రాణం తీసిందిగా!
Recommended image2
Suicide prevention day: నింద‌, ఒత్తిడి, మౌనం.. పెరుగుతున్న ఆత్మ‌హ‌త్య‌ల‌కు కార‌ణాలివే అంటున్న 1 లైఫ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved