MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • IRCTC : కేవలం రూ.5670 చాలు.. హైదరాబాద్ నుండి అన్నవరం, ద్రాక్షారామం, అంతర్వేది, రాజమండ్రి చుట్టివచ్చేలా టూర్ ప్యాకేజ్

IRCTC : కేవలం రూ.5670 చాలు.. హైదరాబాద్ నుండి అన్నవరం, ద్రాక్షారామం, అంతర్వేది, రాజమండ్రి చుట్టివచ్చేలా టూర్ ప్యాకేజ్

గోదావరి నదీతీరంలోని దేేవాలయాలను చుట్టివచ్చేలా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకుందాం.

4 Min read
Author : Arun Kumar P
Published : Oct 23 2026, 03:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐఆర్సిటిసి గోదావరి టూర్ ప్లాన్
Image Credit : Gemini AI

ఐఆర్సిటిసి గోదావరి టూర్ ప్లాన్

తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించాలని అనుకుంటున్నారా? ముఖ్యంగా గోదావరి జిల్లాలను చుట్టిరావాలని అనుకునేవారికి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చులో అన్నవరం సత్యనారాయణ స్వామి, అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి, ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయాలను సందర్శించేలా 'గోదావరి టెంపుల్ టూర్' ప్యాకేజీని ప్రకటించింది IRCTC.

రాజమండ్రిని కేంద్రంగా చేసుకుని నాలుగు రోజుల పాటు సాగే ఈ యాత్రలో ఆధ్యాత్మిక క్షేత్రాలతో పాటు గోదావరి ఘాట్, బీచ్ వంటి ప్రదేశాలను కూడా సందర్శించవచ్చు. రైలు ప్రయాణం, హోటల్ వసతి, స్థానిక రవాణా వంటి సదుపాయాలతో కూడిన ఈ టూర్ ప్యాకేజీకి ధర ఎంత? ఏయే ప్రాంతాలను సందర్శిస్తారు? టూర్‌లో ఏ సదుపాయాలు ఉంటాయి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

గోదావరి టెంపుల్ టూర్ ప్యాకేజీ...

ఐఆర్సిటిసి అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజీ పేరు గోదావరి టెంపుల్ టూర్ (Godavari Temple Tour). ఈ యాత్రలో రాజమండ్రి, అన్నవరం, అంతర్వేది, అప్పనపల్లి, అయినవిల్లి, ద్రాక్షారామం వంటి ప్రాంతాలను సందర్శించేలా షెడ్యూల్ రూపొందించారు. ప్రతి శుక్రవారం రాత్రి హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి రైలులో బయలుదేరి, సోమవారం తెల్లవారుజామున తిరిగి చేరుకునేలా ప్రయాణ ప్రణాళిక ఉంది.

పని ఒత్తిడి కారణంగా ఎక్కువ రోజులు సెలవులు తీసుకోలేనివారికి, కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించాలనుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగకరంగా ఉంటుంది. తక్కువ ఖర్చులోనే (ఒక్కరికి రూ.5670) టూర్ పూర్తిచేయవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గోదావరి టెంపుల్ టూర్ సాగుతుందిలా...
Image Credit : Gemini

గోదావరి టెంపుల్ టూర్ సాగుతుందిలా...

మొదటి రోజు : హైదరాబాద్ నుంచి రైలు ప్రయాణం

టూర్ మొదటి రోజు శుక్రవారం రాత్రి ప్రయాణం ప్రారంభమవుతుంది. లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో రాత్రి 8.30 గంటలకు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రాత్రి 9.15 గంటలకు గౌతమి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 12738) ఎక్కాలి. అక్కడి నుంచి రాజమండ్రికి రాత్రి ప్రయాణం కొనసాగుతుంది.

రెండో రోజు: అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనం

శనివారం తెల్లవారుజామున 4.38 గంటలకు రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు తీసుకెళ్లి, ఫ్రెష్‌అప్ అయ్యేందుకు అవకాశం కల్పిస్తారు. అనంతరం సుమారు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయానికి బయలుదేరుతారు. రత్నగిరి కొండపై వెలసిన ఈ ఆలయం సత్యనారాయణ స్వామి వ్రతాలకు ప్రసిద్ధి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దర్శనం అనంతరం రాజమండ్రికి తిరిగి వస్తారు. సాయంత్రం గోదావరి ఘాట్, ఇస్కాన్ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి రాజమండ్రిలోని హోటల్‌లో బస చేస్తారు.

మూడో రోజు : అంతర్వేది, అప్పనపల్లి, అయినవిల్లి, ద్రాక్షారామం

ఆదివారం ఉదయం హోటల్ నుంచి చెక్‌అవుట్ చేసి ఆలయాల సందర్శనకు బయలుదేరుతారు. ఈ రోజున పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది.

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం : గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతానికి సమీపంలో ఉన్న అంతర్వేది ఆధ్యాత్మికంగానే కాకుండా ప్రకృతి అందాల పరంగానూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం అంతర్వేది బీచ్‌ను సందర్శిస్తారు.

అప్పనపల్లి బాల బాలాజీ ఆలయం : కోనసీమ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.

అయినవిల్లి విఘ్నేశ్వర ఆలయం : అయినవిల్లిలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయం కోనసీమలో ప్రసిద్ధి చెందిన గణపతి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు.

ద్రాక్షారామం భీమేశ్వర స్వామి ఆలయం : ఈ యాత్రలో మరో ముఖ్యమైన క్షేత్రం ద్రాక్షారామం. ఇక్కడి శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. శైవ భక్తులకు ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యమైనది. ద్రాక్షారామం పేరు దక్ష ప్రజాపతితో ముడిపడిన పురాణ కథనాల వల్ల కూడా ప్రాచుర్యంలో ఉంది.

ఆలయాల సందర్శన పూర్తయిన తర్వాత రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఆదివారం రాత్రి 8.18 గంటలకు బయలుదేరే గౌతమి ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 12737)లో హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.

నాలుగో రోజు : హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం

సోమవారం తెల్లవారుజామున 4.35 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు, ఉదయం 5.55 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. దీంతో నాలుగు రోజుల గోదావరి ఆలయాల యాత్ర ముగుస్తుంది.

35
IRCTC టూర్ ప్యాకేజీ ధరలివే..
Image Credit : Chat GPT

IRCTC టూర్ ప్యాకేజీ ధరలివే..

ఈ ప్యాకేజీలో ప్రయాణికుల సంఖ్య, గది షేరింగ్ విధానం, రైలు ప్రయాణ తరగతిని బట్టి ధరలు మారుతాయి. IRCTC వివరాల ప్రకారం, స్లీపర్ క్లాస్‌తో కూడిన స్టాండర్డ్ ప్యాకేజీ, 3ACతో కూడిన కంఫర్ట్ ప్యాకేజీ అందుబాటులో ఉన్నాయి.

1 నుండి 3 ప్యాసింజర్స్ తో కూడిన ప్యాకేజీ డిటెయిల్స్

కంఫర్ట్ (3AC)

సింగిల్ షేరింగ్ - రూ.15400/-

ట్విన్ షేరింగ్ - రూ.8990/-

ట్రిపుల్ షేరింగ్ - రూ. 7230/-

చైల్డ్ విత్ బెడ్ (5-11 yrs) - రూ.6140/-

చైల్డ్ (బెడ్ లేకుండా) (5-11 yrs) - రూ.5020/-

స్టాండార్డ్ (SL)

సింగిల్ షేరింగ్ - రూ.13840/-

ట్విన్ షేరింగ్ - రూ.7430/-

ట్రిపుల్ షేరింగ్ - రూ.5670/-

చైల్డ్ విత్ బెడ్ (5-11 yrs) - రూ.4580/-

చైల్డ్ (బెడ్ లేకుండా) (5-11 yrs) - రూ.3460/-

4 నుండి 6 ప్యాసింజర్స్ తో కూడిన ప్యాకేజీ డిటెయిల్స్

కంఫర్ట్ (3AC)

ట్విన్ షేరింగ్ - రూ.7490/-

ట్రిపుల్ షేరింగ్ - రూ.6680/-

చైల్డ్ విత్ బెడ్ (5-11 yrs) - రూ.6140/-

చైల్డ్ (బెడ్ లేకుండా) (5-11 yrs) - రూ.5020/-

స్టాండార్డ్ (SL)

ట్విన్ షేరింగ్ - రూ.5930/-

ట్రిపుల్ షేరింగ్ - రూ.5120/-

చైల్డ్ విత్ బెడ్ (5-11 yrs) - రూ.4580/-

చైల్డ్ (బెడ్ లేకుండా) (5-11 yrs) - రూ.3460/-

ఈ ధరలు ఒక్కో వ్యక్తికి వర్తిస్తాయి. ఒకే గదిలో ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ఉండే విధానాన్ని బట్టి వ్యక్తికి అయ్యే ఖర్చు మారుతుంది. పిల్లల వయస్సు, బెడ్ అవసరం వంటి అంశాలను బట్టి కూడా ప్యాకేజీ ధరను ఎంచుకోవాలి.

45
ప్యాకేజీలో ఏయే సదుపాయాలు ఉంటాయి?
Image Credit : AI

ప్యాకేజీలో ఏయే సదుపాయాలు ఉంటాయి?

IRCTC అందించిన వివరాల ప్రకారం, ఈ టూర్ ప్యాకేజీలో కింది సదుపాయాలు ఉన్నాయి

  • స్టాండర్డ్ ప్యాకేజీలో స్లీపర్ క్లాస్, కంఫర్ట్ ప్యాకేజీలో 3AC రైలు ప్రయాణం.
  • టూర్ షెడ్యూల్ ప్రకారం స్థానిక ప్రాంతాల సందర్శనకు ఏసీ వాహన సదుపాయం.
  • రాజమండ్రిలో హోటల్ వసతి.
  • ట్రావెల్ ఇన్సూరెన్స్.
  • షెడ్యూల్‌లో పేర్కొన్న సందర్శన స్థలాలకు రవాణా.
  • టోల్ ఛార్జీలు, పార్కింగ్ ఖర్చులు, వర్తించే జీఎస్టీ.

ప్యాకేజీలో చేర్చని ఖర్చులు ఏమిటి?

ప్యాకేజీ ధర చెల్లించినంత మాత్రాన ప్రయాణంలో అయ్యే అన్ని ఖర్చులు అందులో భాగం కావు. కింది ఖర్చులను ప్రయాణికులే భరించాలి.

  • అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం.
  • రైలు ప్రయాణ సమయంలో ఆహారం.
  • సందర్శన ప్రాంతాల్లో ప్రవేశ టికెట్లు.
  • బోటింగ్, గుర్రపు స్వారీ వంటి వినోద కార్యక్రమాల ఖర్చులు.
  • టూర్ గైడ్ సేవలు.
  • ప్యాకేజీలో స్పష్టంగా పేర్కొనని ఇతర సేవలు.

అందువల్ల ప్రయాణానికి బడ్జెట్ సిద్ధం చేసుకునేటప్పుడు ప్యాకేజీ ధరతో పాటు భోజనం, వ్యక్తిగత ఖర్చులకు అవసరమైన మొత్తాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

55
బుకింగ్, సంప్రదింపుల వివరాలు
Image Credit : GEMINI

బుకింగ్, సంప్రదింపుల వివరాలు

ఈ ప్యాకేజీకి సంబంధించిన బుకింగ్, అందుబాటులో ఉన్న తేదీలు, తాజా ధరలు, ఇతర నిబంధనల కోసం IRCTC సౌత్ సెంట్రల్ జోన్‌ను సంప్రదించవచ్చు.

కార్యాలయ చిరునామా:

IRCTC – సౌత్ సెంట్రల్ జోన్,

9-1-129/1/302, 3వ అంతస్తు, ఆక్స్‌ఫర్డ్ ప్లాజా,

ఎస్.డి. రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.

సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు

8287932229

8287932228

9701360701

ఈ టూర్ ప్రతి శుక్రవారం నిర్వహించేలా షెడ్యూల్ ఇచ్చారు. అయితే ప్రయాణ తేదీలు, టికెట్ల లభ్యత, ప్యాకేజీ ధరలు మారే అవకాశం ఉన్నందున బుకింగ్‌కు ముందు IRCTC అధికారిక వర్గాల వద్ద తాజా వివరాలు నిర్ధారించుకోవాలి.

తక్కువ రోజుల్లో గోదావరి పుణ్యక్షేత్రాల సందర్శన

రైలు ప్రయాణం, హోటల్ వసతి, స్థానిక రవాణాను ఒకే ప్యాకేజీలో పొందాలనుకునే వారికి గోదావరి టెంపుల్ టూర్ ఉపయోగకరమైన ఎంపిక. అన్నవరం నుంచి అంతర్వేది వరకు ప్రముఖ ఆలయాలను దర్శించుకోవడంతో పాటు, గోదావరి ఘాట్, అంతర్వేది బీచ్ వంటి ప్రదేశాలను సందర్శించే అవకాశం ఇందులో ఉంది. కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లాలనుకునేవారు తమ బడ్జెట్‌కు తగిన స్టాండర్డ్ లేదా కంఫర్ట్ ప్యాకేజీని ఎంచుకోవచ్చు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Smart Toothbrush: వామ్మో బ్రష్ ధర రూ.47 వేలా? నోట్లో ఏం జరుగుతుందో లైవ్‌గా చూడొచ్చు
Recommended image2
Land Prices in USA : అమెరికాలో ఎకరం భూమి ధర ఎంతుంటుంది?
Recommended image3
Strange Village: అక్కడ ఊరి బయటే మహిళల బతుకు.. ఆ ఐదు రోజులు ప్రాణాలు అరచేతిలోనే!
Related Stories
Recommended image1
Bangkok Tour : ఇండియన్స్ ఎందుకు ఎక్కువగా బ్యాంకాక్ కు వెళ్తారో తెలుసా?
Recommended image2
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved