- Home
- Feature
- IRCTC Dakshin Bharat Yatra: ఐఆర్సీటీసీ దక్షిణ భారత యాత్ర.. 5 దివ్య క్షేత్రాల దర్శనం.. భారతీయ రైల్వేల బంపర్ ఆఫర్
IRCTC Dakshin Bharat Yatra: ఐఆర్సీటీసీ దక్షిణ భారత యాత్ర.. 5 దివ్య క్షేత్రాల దర్శనం.. భారతీయ రైల్వేల బంపర్ ఆఫర్
IRCTC Dakshin Bharat Yatra: ఐఆర్సీటీసీ అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. ఐఆర్సీటీసీ జమ్మూ నుంచి దక్షిణ భారతదేశ యాత్ర కోసం 'భారత్ గౌరవ్' ప్రత్యేక ట్రెయిన్‌ను ప్రకటించింది. ఈ 13 రోజుల టూర్ వివరాలు, ధరలు, ప్యాకేజీ విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఐఆర్సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ.. దక్షిణ భారత్ యాత్ర
భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికుల కోసం మరో అద్భుతమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. నవంబర్ 14 నుంచి జమ్మూ నుంచి 'దక్షిణ భారతదేశ యాత్ర' (Dakshin Bharat Yatra) పేరుతో భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలును నడపనున్నట్లు ప్రకటించింది. ఈ యాత్ర మొత్తం 12 రాత్రులు, 13 రోజుల పాటు కొనసాగుతుంది. జమ్మూ నుంచి బయలుదేరే ఈ ట్రెయిన్ ద్వారా ప్రయాణికులు దేశంలోని ప్రముఖ దివ్య క్షేత్రాలను దర్శించుకోవచ్చు.
ఎక్కడెక్కడ దర్శనాలు? బోర్డింగ్ స్టేషన్లు ఇవే
ఈ టూర్ ప్యాకేజీలో తిరుపతి, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, మార్కాపూర్ (మల్లికార్జున జ్యోతిర్లింగం) వంటి పవిత్ర ప్రదేశాలను కవర్ చేయనున్నారు. ప్రయాణికులు జమ్మూ, పఠాన్‌కోట్ జంక్షన్, అమృత్సర్ జంక్షన్, జలంధర్ సిటీ, లుధియానా జంక్షన్, ఎస్ఏఎస్ నగర్ మొహాలి, చండీగఢ్, అంబాలా కంటోన్మెంట్, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్, సోనిపట్, ఢిల్లీ సఫ్దర్ గంజ్, మధుర జంక్షన్, ఆగ్రా కంటోన్మెంట్, గ్వాలియర్ జంక్షన్, వీరాంగన లక్ష్మీబాయి (ఝాన్సీ) స్టేషన్లలో ఎక్కవచ్చు.
మూడు రకాల ప్యాకేజీలు.. ధరల వివరాలు
ప్రయాణికుల సౌకర్యార్థం ఐఆర్సీటీసీ ఈ యాత్రను మూడు కేటగిరీలుగా విభజించింది. స్లీపర్ క్లాస్, త్రీ ఏసీ, టూ ఏసీ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
• ఎకానమీ ఎస్ఎల్ కేటగిరీలో ఒక్క వ్యక్తికి రూ. 26,895గా ధర నిర్ణయించారు. అలాగే 5 నుండి 11 సంవత్సరాల పిల్లలకు రూ. 25,390 ఉంటుంది.
• స్టాండర్డ్ 3ఏసీ కేటగిరీ ధర రూ. 42,605 కాగా, పిల్లలకు రూ. 40,835గా ఉంది.
• కంఫర్ట్ 2ఏసీ కేటగిరీలో పెద్దలకు రూ. 56,830, పిల్లలకు రూ. 54,705గా ధరలను ఫిక్స్ చేశారు. ఈ ట్రెయిన్లో స్లీపర్ సీట్లు 480, 3ఏసీ సీట్లు 210, 2ఏసీ సీట్లు 50 వరకు అందుబాటులో ఉన్నాయి.
ప్రయాణ ప్రణాళిక, సౌకర్యాలు
ఈ రైలు ప్రయాణంలో ప్రయాణికులకు కేవలం శాఖాహార భోజనం మాత్రమే అందించనున్నారు. రైలులో, బయట మంచి రెస్టారెంట్లు లేదా హోటళ్లలో భోజన వసతి ఉంటుంది. ప్రయాణికుల భద్రత కోసం రైలులో సెక్యూరిటీ సిబ్బందితో పాటు, ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తున్నారు. నవంబర్ 26న టూర్ ముగిసి తిరిగి జమ్మూ చేరుకుంటారు. హోటల్ బస, వాష్ అండ్ ఛేంజ్, రవాణా సౌకర్యాలు ఎంచుకున్న కేటగిరీని బట్టి నాన్ ఏసీ లేదా ఏసీ పద్ధతిలో ఏర్పాటు చేస్తారు.
బుకింగ్, ముఖ్యమైన సూచనలు
ఈ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవడానికి ఆన్లైన్ ద్వారా www.irctctourism.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ప్రయాణికులు తమ వెంట ఓటరు ఐడీ లేదా ఆధార్ కార్డుతో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉంచుకోవాలని ఐఆర్సీటీసీ సూచించింది. రైలు సమయాలు లేదా ప్రయాణ షెడ్యూల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని, ప్రయాణానికి ముందు రైల్వే శాఖ నిబంధనలను పాటించాలని అధికారులు తెలిపారు.













