Most Powerful Dog: పులిని కూడా భయపెట్టే బలమైన కుక్క.. దీని శక్తి తెలిస్తే షాకవుతారు
Most Powerful Dog: ప్రపంచంలోనే అత్యంత శక్తవంతమైన శునకం గురించి ఇక్కడ వివరించాము. ఇది పులిని కూడా వేటాడేంత శక్తివంతమైనది. అందుకు మేకలకు, గొర్రెలకు కాపలాగా దీన్ని ఎన్నో దేశాల్లో పెంచుకుంటారు. ఇంతకీ ఆ కుక్క ఏ జాతికి చెందిందో తెలుసా?

పులిని భయపెట్టే కుక్క
అడవిలో పులి కనిపిస్తేనే పెద్దపెద్ద జంతువులు భయంతో పరుగులు తీస్తాయి. అలాంటి పులిని ఎదుర్కొనే ధైర్యం ఉన్న కుక్కలు కూడా ఉన్నాయా? ప్రపంచంలోనే అత్యంత బలమైన కుక్క జాతుల్లో ఒకటిగా పేరొందిన కంగల్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. టర్కీకి చెందిన ఈ కుక్కలను గొర్రెలు, మేకల మందలను తోడేళ్లు, ఇతర క్రూర మృగాల నుంచి కాపాడేందుకు పెంచుతారు. భారీ శరీరం, బలమైన కండరాలు, వేగం, శక్తివంతమైన దవడలు వీటి ప్రత్యేకత. అందుకే ప్రమాదకరమైన జంతువులను ఎదుర్కొనే కాపలా కుక్కగా కంగల్కు మంచి పేరుంది. అయితే పులిని వేటాడగలదా అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం అంత సులువు కాదు.
ఇది కరిచిందంటే...
కంగల్ కుక్క బరువు సాధారణంగా 60 నుంచి 80 కిలోల వరకు ఉంటుంది. దీని కాటు బలం దాదాపు 743 PSIగా చెబుతారు. బలమైన దవడలతో ప్రత్యర్థిని గట్టిగా పట్టుకోగలదు. పులితో పోలిస్తే కంగల్ బలం తక్కువే అయినా, ఇతర జంతువులను ఎదుర్కొనే ధైర్యం, వేగం దీనికి ఉన్నాయి. ముఖ్యంగా పశువులపై దాడి చేసే తోడేళ్లను తరిమికొట్టడంలో ఈ కుక్కలు సమర్థంగా పనిచేస్తాయి. అందుకే వీటిని పశువుల కాపలా కోసం ప్రత్యేకంగా పెంచుతారు.
బెంగాల్ పులి బలం ఎంత?
ఇక బెంగాల్ పులి విషయానికి వస్తే దాని బలం కంగల్ కంటే చాలా ఎక్కువ. ఒక పెద్ద బెంగాల్ పులి బరువు 250 నుంచి 350 కిలోల వరకు ఉంటుంది. దాని కాటు బలం 1,050 PSI కంటే ఎక్కువగా ఉంటుంది. దాదాపు నాలుగు అంగుళాల పొడవైన గోళ్లతో చేసే దాడి కూడా అత్యంత ప్రమాదకరం. పులి తన బరువు, వేగం, పదునైన పంజాలతో పెద్ద జంతువులను సైతం వేటాడగలదు. కాబట్టి కంగల్ ఎంత బలమైన కుక్క అయినా పులిని చంపలేదు కానీ భయపెట్టగలదు.













