- Home
- Feature
- Arunachala Moksha Yatra : కార్తీకమాసంలో హైదరాబాద్ టు అరుణాచల యాత్ర.. ఈ వీకెండ్ సెలవుల్లో IRCTC టూర్ ప్యాకేజీ
Arunachala Moksha Yatra : కార్తీకమాసంలో హైదరాబాద్ టు అరుణాచల యాత్ర.. ఈ వీకెండ్ సెలవుల్లో IRCTC టూర్ ప్యాకేజీ
పవిత్రమైన కార్తీకమాసంలో చాలామంది పుణ్యక్షేత్రాలను సందర్శించాలని ప్లాన్ చేస్తుంటారు. ఇలాంటివారి కోసమే IRCTC ప్రతి వీకెండ్ హైదరాబాద్ నుండి అరుణాచలం టూర్ ప్యాకేజీ సిద్దం చేసింది. ఈ టూర్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

అరుణాచల మోక్ష యాత్ర టూర్ ప్యాకేజీ
ఈ వీకెండ్ రెండో శనివారం, ఆదివారం (నవంబర్ 14,15) రెండ్రోజులు విద్యార్థులు, ఉద్యోగులకు సెలవులు వస్తున్నాయి. దీనికి తోడు కార్తీక మాసం కూడా కొనసాగుతోంది. దీంతో పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని, కుటుంబంతో కలిసి ఎక్కడికైనా టూర్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇది మంచి అవకాశం. అలాంటి వారి కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. ఈ ప్యాకేజీలో పుదుచ్చేరి, అరుణాచలం, కాంచీపురం వంటి మూడు ప్రముఖ ప్రాంతాలను సందర్శించవచ్చు. ఐదు రోజుల పాటు సాగే ఈ యాత్రలో రైలు ప్రయాణంతో పాటు స్థానిక రవాణా, హోటల్ వసతి వంటి సదుపాయాలు IRCTC కల్పిస్తోంది.
హైదరాబాద్ టు అరుణాచలం టూర్ ఇలా సాగుతుంది
IRCTC అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజీ పేరు 'అరుణాచల మోక్ష యాత్ర'. ఇందులో భాగంగా పుదుచ్చేరి, తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయం, కాంచీపురం ప్రాంతాలను సందర్శించవచ్చు. మొత్తం 4 రాత్రులు, 5 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుంది. ప్రతి శుక్రవారం కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ఈ టూర్ ప్రారంభమవుతుంది. ప్రయాణానికి స్లీపర్ క్లాస్ లేదా 3 ఏసీ తరగతులను ఎంచుకోవచ్చు.
మొదటి రోజు.. కాచిగూడ నుంచి రైలు ప్రయాణం
ఈ టూర్ మొదటి రోజు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభమవుతుంది. రైలు నంబర్ 17653 కాచిగూడ - పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు బయలుదేరాలి. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
రెండో రోజు.. పుదుచ్చేరి సందర్శన
రెండో రోజు శనివారం ఉదయం 11.05 గంటలకు పుదుచ్చేరి రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్‌కు తీసుకెళ్లి బస ఏర్పాటు చేస్తారు. అనంతరం పుదుచ్చేరిలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు.
ముఖ్యంగా అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన ఆరోవిల్, ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన అరవిందో ఆశ్రమం, ప్రకృతి అందాలకు పేరుగాంచిన పారడైజ్ బీచ్‌ను సందర్శించవచ్చు. ఈ ప్రాంతాల సందర్శన అనంతరం రాత్రి పుదుచ్చేరిలోనే బస ఉంటుంది.
మూడో రోజు.. అరుణాచలేశ్వరుడి దర్శనం
మూడో రోజు ఆదివారం ఉదయం హోటల్లో అల్పాహారం చేసిన తర్వాత పుదుచ్చేరి నుంచి తిరువణ్ణామలైకి బయలుదేరుతారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం సుమారు 120 కిలోమీటర్లు. తిరువణ్ణామలై చేరుకున్నాక హోటల్లో చెక్ ఇన్ అవుతారు.
ఆ తర్వాత భక్తులు ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించవచ్చు. కార్తీక మాసంలో అరుణాచల క్షేత్రానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. స్వామివారి దర్శనం చేసుకుని, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. రాత్రికి తిరువణ్ణామలైలో బస ఉంటుంది.
నాలుగో రోజు.. కాంచీపురం ఆలయాల సందర్శన
నాలుగో రోజు సోమవారం ఉదయం అల్పాహారం అనంతరం హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి కాంచీపురానికి బయలుదేరుతారు. తిరువణ్ణామలై నుంచి కాంచీపురం సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
కాంచీపురం చేరుకున్నాక ప్రసిద్ధ కామాక్షి అమ్మవారి ఆలయం, ఏకాంబరేశ్వర స్వామి ఆలయాలను సందర్శిస్తారు. దర్శనాలు పూర్తయిన తర్వాత అక్కడి నుంచి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న అరక్కోణం రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు.సాయంత్రం 6.05 గంటలకు బయలుదేరే రైలు నంబర్ 17651లో ప్రయాణం ప్రారంభమవుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం ఉంటుంది.
ఐదో రోజు.. తిరిగి కాచిగూడకు
ఐదో రోజు మంగళవారం ఉదయం 7.50 గంటలకు రైలు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. దీంతో పుదుచ్చేరి, అరుణాచలం, కాంచీపురం ఐదు రోజుల యాత్ర ముగుస్తుంది.
టూర్ ప్యాకేజీ టికెట్ ధరలు ఎంత?
ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణికుల సంఖ్య, గదులలో ఉండే విధానం, రైలు ప్రయాణ తరగతిని బట్టి ధరలు మారుతాయి. ఒకరి నుంచి ముగ్గురు ప్రయాణికులు కలిసి వెళ్లేవారికి, నలుగురి నుంచి ఆరుగురు ప్రయాణికులు కలిసి వెళ్లేవారికి వేర్వేరు ధరలు నిర్ణయించారు.
1 నుంచి 3 మంది ప్రయాణికులకు ఒక్కొక్కరికి ధరలు
కంఫర్ట్ ప్యాకేజీ (3AC)
ఇద్దరు ఒక గదిలో ఉండే విధానం (Twin Sharing): రూ.16,900
ముగ్గురు ఒక గదిలో ఉండే విధానం (Triple Sharing): రూ.13,210
5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో : రూ.10,030
5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ లేకుండా : రూ.7,530
స్టాండర్డ్ ప్యాకేజీ (Sleeper Class)
ఇద్దరు ఒక గదిలో ఉండే విధానం : రూ.14,820
ముగ్గురు ఒక గదిలో ఉండే విధానం : రూ.11,125
5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో : రూ.7,950
5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ లేకుండా : రూ.5,450
4 నుంచి 6 మంది ప్రయాణికులకు ఒక్కొక్కరికి ధరలు
కంఫర్ట్ ప్యాకేజీ (3AC)
ఇద్దరు ఒక గదిలో ఉండే విధానం : రూ.13,900
ముగ్గురు ఒక గదిలో ఉండే విధానం : రూ.11,920
5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో : రూ.10,030
5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ లేకుండా : రూ.7,530
స్టాండర్డ్ ప్యాకేజీ (Sleeper Class)
ఇద్దరు ఒక గదిలో ఉండే విధానం రూ.11,820
ముగ్గురు ఒక గదిలో ఉండే విధానం : రూ.9,840
5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో : రూ.7,950
5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ లేకుండా : రూ.5,450
ప్యాకేజీలో ఏమేం ఉంటాయి?
ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణికులకు పలు సదుపాయాలు కల్పిస్తున్నారు. స్టాండర్డ్ ప్యాకేజీ తీసుకున్నవారికి స్లీపర్ క్లాస్‌లో, కంఫర్ట్ ప్యాకేజీ ఎంచుకున్నవారికి 3 ఏసీలో రైలు ప్రయాణం ఉంటుంది. టూర్లో భాగంగా తిరిగేందుకు ఏసీ వాహనం ఏర్పాటు చేస్తారు.
రెండు రాత్రుల హోటల్ వసతితో పాటు అల్పాహారం అందిస్తారు. ప్రయాణ భీమా, టూర్ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాంతాల సందర్శన, టోల్ ఛార్జీలు, పార్కింగ్, వర్తించే జీఎస్టీ కూడా ప్యాకేజీలో భాగంగా ఉంటాయి.
ప్యాకేజీలో లేనివి ఇవే..
మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం, అదనపు ఆహార ఖర్చులు ప్రయాణికులే భరించాలి. రైలు ప్రయాణ సమయంలో ఆహారం కూడా ప్యాకేజీలో ఉండదు. సందర్శించే ప్రాంతాల్లో ప్రవేశ టికెట్లు, బోటింగ్, గుర్రపు స్వారీ వంటి వినోద కార్యక్రమాల ఖర్చులు కూడా అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. టూర్ గైడ్ సదుపాయం కూడా లేదు. ప్యాకేజీ ఇన్క్లూజన్స్లో పేర్కొనని ఇతర సేవలకు ప్రయాణికులే ఖర్చు పెట్టుకోవాలి.
బుకింగ్, ఇతర వివరాల కోసం ఎక్కడ సంప్రదించాలి?
ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం IRCTC సౌత్ సెంట్రల్ జోన్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.
IRCTC – South Central Zone
చిరునామా: 9-1-129/1/302, 3వ అంతస్తు, ఆక్స్ఫర్డ్ ప్లాజా, ఎస్.డి. రోడ్, సికింద్రాబాద్, తెలంగాణ.
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు
8287932229
8287932228
9701360701
కార్తీక మాసంలో అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవాలనుకునేవారికి, అదే సమయంలో పుదుచ్చేరి, కాంచీపురం అందాలను కూడా చూడాలనుకునేవారికి ఈ టూర్ ప్యాకేజీ ఒక మంచి అవకాశం. అయితే ప్రయాణానికి ముందు టూర్ తేదీలు, టికెట్ లభ్యత, ధరలు, బుకింగ్ నిబంధనలను IRCTC వద్ద ఒకసారి నిర్ధారించుకోవడం మంచిది.













