India's Slowest Train : ఏమిటీ..! ఈ రైలు 115+ స్టేషన్లలో ఆగుతుందా..!!
India's Slowest Train : ఏ రైలు అయినా పది లేదంటే 20 రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. సుదూర ప్రయాణం చేసే కొన్ని రైళ్లు 40 -50 స్టేషన్లలో ఆగుతాయి. కానీ ఓ ట్రైన్ ఏకంగా 115 కంటే ఎక్కువ స్టేషన్లలో ఆగుతుందట.. అదేదో తెలుసా?

ఈ ట్రైన్ చాలా స్పెషల్ గురూ...
Slowest Train : ఈ బిజీ జీవితంలో ఎవరైనా వేగానికే ప్రాధాన్యం ఇస్తారు... పని అయినా, ప్రయాణమైనా వేగంగా జరగాలని కోరుకుంటారు. అందుకే భారతీయ రైల్వే కూడా ప్రయాణికులను వేగంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు వందేభారత్ వంటి ట్రైన్స్ తీసుకువచ్చింది. ఇంతకంటే వేగంగా (గంటకు 320 కిలోమీటర్ల వేగంతో) దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్ త్వరలోనే అందుబాటులోకి తేనుంది. ఇలా ఇండియన్ రైల్వే ఫాస్టెస్ట్ ట్రైన్ ను తీసుకువస్తున్న వేళ ఓ రైలు ఇప్పటికీ అత్యంత నెమ్మదిగా ప్రయాణిస్తూనే ప్రయాణికుల మనసులు గెలుచుకుంటోంది. అదే హైరా-అమృత్‌సర్ ఎక్స్ ప్రెస్ (Howrah-Amritsar Express).
ఈ రైలుకు 115+ స్టాప్స్...
పశ్చిమ బెంగాల్ లోని హౌరా రైల్వే స్టేషన్ లో ప్రారంభమయ్యే ట్రైన్ వివిధ రాష్ట్రాల గుండా సుధీర్ఘ ప్రయాణం సాగిస్తూ అమృత్‌సర్ చేరుకుంటుంది. ఈ క్రమంలో హౌరా-అమృత్‌సర్ ఎక్స్ ప్రెస్ ఏకంగా 115కు పైగా స్టేషన్లలో ఆగుతుంది. కొన్ని పెద్దపెద్ద స్టేషన్లలో గంటల తరబడి ఆగుతుంది... చిన్న స్టేషన్లలో కొన్ని నిమిషాలు ఆగుతుంది… దీన్నిబట్టే ఈ రైలు వేగం ఎంతో అర్థం చేసుకోవచ్చు.
పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తర ప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మీదుగా హౌరా-అమృత్‌సర్ ప్రయాణం సాగుతుంది. ఇలా ఐదు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలనే కాదు అనేక పట్టణాలను కవర్ చేస్తూ దాదాపు 2000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ సుదూర ప్రయాణానికి 37 గంటల సమయం తీసుకుంటుంది… ఒక్కోసారి ఇంతకంటే ఎక్కువ సమయమే పట్టవచ్చు.
వేగం కాదు ప్రయాణికులే ముఖ్యం...
హౌరా-అమృత్‌సర్ ఎక్స్ ప్రెస్ వేగానికి కాదు ఎక్కువమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడానికి ప్రాధాన్యం ఇస్తుంది. తూర్పున ఈ చివర పశ్చిమ బెంగాల్ నుండి మధ్యభారతదేశం గుండా సాగుతూ పశ్చిమాన మరో చివర పంజాబ్ కు చేరుకుంటుంది. ఈ క్రమంలో వేలాదిమంది ప్రయాణికులు ఈ రైలును ఉపయోగించుకుంటారు.
చిన్నాపెద్ద అని తేడాలేదు.. ప్రతి స్టేషన్ లో హౌరా-అమృత్‌సర్ ఎక్స్ ప్రెస్ ఆగుతుంది. అందుకే ఇందులో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. నెమ్మదిగా ప్రయాణించినా నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది... ఇలా ఇండియన్ రైల్వేకు మంచి ఆదాయమే తెచ్చిపెడుతోంది. టికెట్ ధరలు కూడా తక్కువగా ఉండటంతో హౌరా-అమృత్‌సర్ ఎక్స్ ప్రెస్ సామాన్యుడి రైలుగా గుర్తింపుపొందింది.
నెమ్మదిగా నడిచే మరో రైలు
భారతదేశంలోనే అత్యంత నెమ్మదిగా నడిచే రైలు మెట్టుపాలయం–ఊటీ నీలగిరి ప్యాసింజర్ రైలు. ఈ రైలు గంటకు కేవలం 10 కి.మీ వేగంతో నడుస్తుంది. కొన్నిచోట్ల సైకిల్‌పై వెళ్లేవారు కూడా దీన్ని సులభంగా అధిగమించే స్పీడ్ ఉంటుంది. అయినప్పటికీ, దేశీయ పర్యాటకులు మాత్రమే కాకుండా విదేశీయులు కూడా ఈ రైలు ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకుంటారు.
ఈ రైలు తమిళనాడులోని మెట్టుపాలయం నుంచి ఊటీ వరకు 46 కి.మీ దూరాన్ని కవర్ చేస్తుంది. ఈ చిన్న దూరాన్ని పూర్తి చేయడానికి దాదాపు 5 గంటల సమయం పడుతుంది. ప్రతి రోజు ఉదయం 7:10 గంటలకు మెట్టుపాలయం నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఊటీ చేరుతుంది. తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై, సాయంత్రం 5:30 వరకు మెట్టుపాలయానికి చేరుకుంటుంది. టికెట్లు IRCTC వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.
అత్యంత వేగంగా నడిచే రైలు ఏది?
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా నడిచే రైలు జపాన్ లోని షాంఘై మాగ్లెవ్ (Shanghai Manglev). ఇది అయస్కాంత శక్తితో నడుస్తుంది... గంటకు 460 కి.మీ వేగం కలిగి ఉంటుంది. ఇదే జపాన్ లో బుల్లెట్ ట్రైన్స్ కూడా అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి... ఈ దేశ సాంకేతిక సహకారంతోనే భారత్ బుల్లెట్ ట్రైన్ ను అందుబాటులోకి తెస్తోంది.
ప్రస్తుతం భారతదేశంలో అత్యంత వేగంగా నడిచే రైలు వందేభారత్... దీని గరిష్ఠ వేగం గంటకు 180 కి.మీ. దేశంలోని అనేక ప్రధాన నగరాల మధ్య ఈ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అయితే గంటకు 320 కి.మీ వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్ మరో ఏడాది రెండేళ్లలో పట్టాలెక్కనుంది.

