MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Haunted Places : ఇండియాలో టాప్ హారర్ స్పాట్స్ ఇవే.. రాత్రి కాదు పగలే చెమటలు పట్టిస్తాయి

Haunted Places : ఇండియాలో టాప్ హారర్ స్పాట్స్ ఇవే.. రాత్రి కాదు పగలే చెమటలు పట్టిస్తాయి

మీకు దెయ్యాలు, ఆత్మలతో కూడిన హారర్ కథలంటే ఇష్టమా..? అడ్వెంచర్ ట్రిప్స్ అంటే సరదానా..? అయితే ఇండియాలో కొన్ని భయానక ప్రదేశాలున్నాయి. వాటి గురించి తెలిస్తే ఒంటరిగా వెళ్లడానికి పగలు కూడా భయపడతారు.

2 Min read
Author : Arun Kumar P
Published : May 06 2026, 05:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
భంగర్ కోట
Image Credit : Gemini

భంగర్ కోట

రాజస్థాన్‌లోని భంగర్ కోటను ఇండియాలో అత్యంత భయానక ప్రదేశంగా చెబుతారు. అందుకే సూర్యాస్తమయం తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) ఇక్కడికి ఎవరినీ అనుమతించదు. ఓ మాంత్రికుడి శాపం వల్లే ఈ కోట ఇలా మారిపోయిందని కథలున్నాయి. ఇక్కడికి వచ్చినవాళ్లకు గాలిలో మాటలు, అడుగుల శబ్దాలు వినిపిస్తాయట.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
కులధార గ్రామం
Image Credit : Instagram

కులధార గ్రామం

రాజస్థాన్‌లోని ఈ కులధార గ్రామాన్ని పాలివాల్ బ్రాహ్మణులు ఒక్క రాత్రిలోనే ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఓ మంత్రి వేధింపుల నుంచి తప్పించుకోవడానికి వాళ్లంతా అలా చేశారట. వెళ్తూ వెళ్తూ.. ఈ గ్రామంలో మళ్లీ ఎవరూ స్థిరపడకూడదని శపించారని చెబుతారు. అప్పటి నుంచి ఇది ఓ పాడుబడిన దెయ్యాల ఊరిగా మిగిలిపోయింది.

36
గుజరాత్ డుమాస్ బీచ్
Image Credit : Getty

గుజరాత్ డుమాస్ బీచ్

గుజరాత్‌లోని ఈ డుమాస్ బీచ్‌లో ఇసుక నల్లగా ఉంటుంది. ఒకప్పుడు ఇది హిందువుల శ్మశానవాటిక. ఇక్కడ గాలిలో గుసగుసలు వినిపిస్తాయని, ఒంటరిగా వెళ్లినవాళ్లు మాయమైపోతారని అంటారు. చనిపోయిన వారి ఆత్మలు ఇక్కడే తిరుగుతాయని, అందుకే కుక్కలు కూడా ఖాళీ ప్రదేశం వైపు చూస్తూ అరుస్తాయని స్థానికులు నమ్ముతారు.

46
శనివార్ వాడా కోట, పుణె
Image Credit : Getty

శనివార్ వాడా కోట, పుణె

పుణెలోని ఈ శనివార్ వాడా కోటలో ఓ యువ పేశ్వా రాకుమారుడి ఆత్మ తిరుగుతుందట. అతడి బంధువులే అతన్ని దారుణంగా చంపేశారని చెబుతారు. పౌర్ణమి రాత్రుళ్లలో 'కాకా మాలా వాచా' (బాబాయ్, నన్ను రక్షించు) అంటూ ఆ యువరాజు పెట్టే కేకలు ఈ రాతి గోడల్లో ప్రతిధ్వనిస్తాయని స్థానికులు అంటారు.
56
మీరట్‌లోని జీపీ బ్లాక్
Image Credit : incredibleindia.gov.in

మీరట్‌లోని జీపీ బ్లాక్

మీరట్‌లోని ఈ పాడుబడిన రెండంతస్తుల భవనంలో వింత ఘటనలు జరుగుతాయట. ఓ కొవ్వొత్తి వెలుగులో నలుగురు వ్యక్తులు కూర్చొని మందు తాగుతూ కనిపిస్తారని చాలామంది చెప్పారు. మరికొందరేమో ఎర్ర చీర కట్టుకున్న ఓ మహిళ ఈ ఇంటి నుంచి బయటకు వస్తుందని, దగ్గరికి వెళ్లేసరికి గాలిలో కలిసిపోతుందని చెబుతుంటారు.

66
డౌ హిల్, కుర్సియాంగ్
Image Credit : AI image

డౌ హిల్, కుర్సియాంగ్

కుర్సియాంగ్‌లోని డౌ హిల్‌లో 'డెత్ రోడ్' అనే ఓ దారి ఉంది. ఇక్కడ తలలేని ఓ అబ్బాయి చెట్లలోకి నడుచుకుంటూ వెళ్లి మాయమైపోతాడని చెబుతారు. అంతేకాదు సమీపంలోని బోర్డింగ్ స్కూళ్లలో రాత్రిపూట కారిడార్లలో అడుగుల శబ్దాలు, నవ్వులు వినిపిస్తాయని కూడా చాలామంది రిపోర్ట్ చేశారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
ప్రయాణం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bhavani island: కృష్ణా నది మధ్యలో అందమైన ద్వీపం ‘భవాని ఐలాండ్’.. దసరా సెలవుల్లో ఓ ట్రిప్పేయండి
Recommended image2
Facts: కొంగ‌లు ఒంటి కాలుపై ఎందుకు నిల‌బ‌డ‌తాయో, ఎప్పుడైనా ఆలోచించారా.?
Recommended image3
Andhra's Goa: గోవా దాకా ఎందుకు? మన దగ్గరే 'ఆంధ్రా గోవా'.. ఫుల్ డిటైల్స్ ఇవే
Related Stories
Recommended image1
భయంతో చెమటలు పట్టించే 5 ఇండియన్ హారర్ వెబ్ మూవీస్
Recommended image2
Horror Comedy: ఓటీటీలో తప్పక చూడాల్సిన 6 హారర్ కామెడీ చిత్రాలు.. దెయ్యం సినిమాతో హీరోయిన్ రికార్డులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved