MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Richest Temples in India : భారతదేశంలో అత్యంత సంపన్న దేవాలయం ఏది? తిరుపతి కాదు

Richest Temples in India : భారతదేశంలో అత్యంత సంపన్న దేవాలయం ఏది? తిరుపతి కాదు

భారతదేశంలో వీధివీధినా దేవాలయాలు కనిపిస్తాయి. కానీ కొన్ని ఆలయాలకు మాత్రం ప్రతి ఏటా కోట్లాది రూపాయల విరాళాలు వస్తుంటాయి. ఇలా దేశంలోనే అత్యంత సంపన్నమైన టాప్ 5 దేవాలయాలేవో తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 27 2026, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇండియాలో రిచ్చెస్ట్ టెంపుల్స్..
Image Credit : x

ఇండియాలో రిచ్చెస్ట్ టెంపుల్స్..

భారతదేశంలోని ఆలయాలు కేవలం పూజలు చేసే ప్రదేశాలు మాత్రమే కాదు, అవి ప్రజల ప్రగాఢ విశ్వాసానికి నిలువుటద్దాలు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తమ కోరికలు నెరవేరాయని ఆలయాలకు వచ్చి నగదు, బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులను విరాళంగా సమర్పిస్తారు. అందుకే దేశంలోని అనేక దేవాలయాలు ఏటా కోట్లాది రూపాయల ఆదాయాన్ని పొందుతున్నాయి.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
1. పద్మనాభస్వామి దేవాలయం, కేరళ
Image Credit : stockPhoto

1. పద్మనాభస్వామి దేవాలయం, కేరళ

కేరళలోని తిరువనంతపురంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయాన్ని దేశంలోనే అత్యంత సంపన్న దేవాలయంగా పరిగణిస్తారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, ఈ ఆలయంలోని ఆరు గదుల్లో మొత్తం 1 ట్రిలియన్ డాలర్లు అంటే లక్ష కోట్లకు పైగా సంపద ఉంది. అంతేకాదు గర్భగుడిలో రూ.500 కోట్ల విలువైన మహావిష్ణువు భారీ బంగారు విగ్రహం కొలువై ఉంది.

Related Articles

Related image1
Now Playing
Kamakhya Devi Temple: ఈ ఆలయంలో నెలసరిని పండగలా చేస్తారు ఎక్కడో తెలుసా? | Asianet News Telugu
Related image2
Significance of Temple Bells: గుడిలో గంట ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?
36
2. తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయం, ఆంధ్ర ప్రదేశ్
Image Credit : TTD.com

2. తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయం, ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం విరాళాల విషయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి ఏటా సుమారు రూ.650 కోట్ల విలువైన విరాళాలు వస్తాయి. టన్నుల కొద్దీ బంగారం, కోట్లాది రూపాయలు బ్యాంకు డిపాజిట్లుగా ఉన్నాయి. లడ్డూ ప్రసాదం, భక్తులు సమర్పించే వెంట్రుకల అమ్మకం ద్వారా కూడా ఆలయానికి లక్షలాది రూపాయల ఆదాయం వస్తుంది. ఈ ఆలయం విష్ణువు అవతారంగా భావించే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది.

46
3. షిర్డీ సాయి బాబా దేవస్థానం, మహారాష్ట్ర
Image Credit : Facebook

3. షిర్డీ సాయి బాబా దేవస్థానం, మహారాష్ట్ర

దేశంలోనే అత్యంత సంపన్న దేవాలయాల్లో మహారాష్ట్రలోని షిర్డీ కూడా ఉంది. ఇక్కడ సాయిబాబా ఆలయం ఉంది… దీన్ని సందర్శించేందుకు దేశ నలుమూలల నుండి నిత్యం వేలాదిమంంది భక్తులు వస్తూనే ఉంటారు. ఈ పవిత్ర దేవాలయానికి ఏటా సుమారు రూ.350 కోట్ల విలువైన విరాళాలు అందుతాయి. అంతేకాదు ఇతర రూపాల్లో కూడా ఈ ఆలయానికి ఆదాయం వస్తుంది.

56
4. మాతా వైష్ణోదేవి దేవస్థానం. జమ్మూ
Image Credit : chatgpt

4. మాతా వైష్ణోదేవి దేవస్థానం. జమ్మూ

జమ్మూలోని త్రికూట పర్వతాలపై ఉన్న మాతా వైష్ణోదేవి ఆలయం దేశంలోనే ప్రముఖ ఆద్యాత్మిక కేంద్రం. ఈ పుణ్యక్షేత్రానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు… అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ ఆలయం విరాళాల రూపంలో సుమారు రూ.500 కోట్లు సంపాదిస్తుంది.

66
సిద్ధివినాయక దేవస్థానం, ముంబై
Image Credit : Pixabay

సిద్ధివినాయక దేవస్థానం, ముంబై

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఉంది ఈ ప్రసిద్ధ సిద్ధివినాయక ఆలయం…  ఈ బొజ్జగణపయ్యను దర్శించుకునేందుకు సామాన్యుల నుంచి బాలీవుడ్ తారల వరకు వస్తుంటారు. దేశంలోనే అత్యంత సంపన్న అంబానీ కుటుంబం కూడా ఈ సిద్దివినాయకుడి పూజిస్తుంటారు. ఈ అద్భుతమైన ఆలయానికి ఏటా సుమారు రూ.125 కోట్ల విరాళాలు, కానుకలు వస్తాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rain: పిడుగులు ప‌డుతుంటే ‘అర్జునా.. ఫాల్గుణా..’ అని ఎందుకంటారో ఎప్పుడైనా ఆలోచించారా.?
Recommended image2
Tatkal Passport : కేవలం మూడు రోజుల్లోనే మీ చేతికి పాస్ పోర్ట్... ఎలాగో తెలుసా?
Recommended image3
Oldest Cities : ప్రపంచంలోనే అత్యంత పురాతన నగరాలు ఇవే
Related Stories
Recommended image1
Now Playing
Kamakhya Devi Temple: ఈ ఆలయంలో నెలసరిని పండగలా చేస్తారు ఎక్కడో తెలుసా? | Asianet News Telugu
Recommended image2
Significance of Temple Bells: గుడిలో గంట ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved