MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • స్వర్గం చూడాలని ఉందా అయితే హిమాలయాల్లో ఉన్న ఈ ప్రాంతానికి ట్రిప్ వేయండి

స్వర్గం చూడాలని ఉందా అయితే హిమాలయాల్లో ఉన్న ఈ ప్రాంతానికి ట్రిప్ వేయండి

ఏదైనా ప్రాంతం అందంగా, ప్రశాంతంగా ఉంటే.. స్వర్గంలా ఉంది అంటాము. నిజంగా ఆ స్వర్గం లాంటి ప్రాంతం మనదేశంలోనే ఉంది. హిమాలయాల్లో ఉన్న ఈ ప్రాంతం పేరు మధ్యమహేశ్వర్. ఇది పంచ కేదార క్షేత్రాల్లో ఒకటి. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇది ఉంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Aug 23 2026, 08:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మధ్యమహేశ్వర్ ఎక్కడ ఉంది?
Image Credit : social media

మధ్యమహేశ్వర్ ఎక్కడ ఉంది?

హిమాలయాల్లో ఉన్న ఒక అందమైన ప్రాంతం మధ్యమహేశ్వర్. పర్వతాలు, పచ్చని అడవులు, జలపాతాలు, నదులు, మంచుతో నిండిన శిఖరాల మధ్య ప్రశాంతంగా, గంభీరంగా ఉంటుంది ఈ ప్రాంతం. ఆ ప్రశాంత వాతావరణంలో కొన్ని రోజులు గడిపితే చాలు మనస్సు, శరీరం ఉత్తేజితమవుతాయి. ఉత్తరాఖండ్‌లో ఉంది ఈ మధ్యమహేశ్వర్. రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న ఈ ఆలయం పంచకేదారాలలో ఒకటి. ఇక్కడ శివుని మధ్యభాగం అంటే నాభిని పూజిస్తారు.

మధ్యమహేశ్వర్ ఆలయం సముద్ర మట్టానికి సుమారు 3,497 మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీని చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం పర్యాటకులను కట్టిపడేస్తుంది. ఇక్కడి నుండి చౌఖంబా సహా హిమాలయాలలోని ఎత్తైన శిఖరాల అద్భుత దృశ్యాలను చూడొచ్చు. కుటుంబంతో కలిసి వెళ్లేవారికి ఇది ఎంతో అద్భుత అనుభూతిని మిగులుస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మధ్యమహేశ్వర్‌కు ఎలా వెళ్లాలి?
Image Credit : social media

మధ్యమహేశ్వర్‌కు ఎలా వెళ్లాలి?

తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారు ముందుగా ఢిల్లీని చేరుకోవాలి. అక్కడ నుండి రోడ్డు మార్గంలో హరిద్వార్, రిషికేశ్, దేవప్రయాగ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, ఉఖిమఠ్ మీదుగా రాన్సీ గ్రామానికి చేరుకోవచ్చు. రాన్సీ గ్రామం నుంచే మధ్యమహేశ్వర్ ట్రెక్‌ మొదలవుతుంది. అదే బేస్ పాయింట్. అక్కడ నుండి సుమారు 16-17 కిలోమీటర్లు కాలినడకన ట్రెక్ చేయాలి.

Related Articles

Related image1
వంటింట్లో స్టవ్ పక్కనే సింక్ ఉండొచ్చా? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు?
Related image2
పశ్చిమ బెంగాల్‌లోని ఈ ప్రాంతాల్లో ఆగస్టు 18న స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు చేసుకుంటారు?
33
దారి పొడవునా ప్రకృతి అందాలే
Image Credit : social media

దారి పొడవునా ప్రకృతి అందాలే

ట్రెక్కింగ్ అంటే ఇష్టమైన వాళ్లకి ఇది బాగా నచ్చుతుంది. ట్రెక్కింగ్ మొదలుపెట్టాక గోండార్, బంటోలి వంటి అందమైన పల్లెలు కనిపిస్తాయి. అడవులు, నదులు, జలపాతాలు, ఎత్తైన పర్వతాల మధ్య సాగే ఈ ట్రెకింగ్ మర్చిపోలేని అనుభూతిని అందిస్తుంది. దారిలో పర్యాటకులు బస చేయడానికి, భోజనం చేయడానికి హోంస్టేలు, చిన్న లాడ్జీలు కూడా ఉంటాయి.

మధ్యమహేశ్వర్ ఆలయం చేరుకున్నాక అక్కడ నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో బుద్ధ మధ్యమహేశ్వర్ ఉంది. ఇక్కడి నుండి చౌఖంబా, నీలకంఠ్ సహా మంచుతో కప్పిన అనేక పర్వత శిఖరాల అద్భుత దృశ్యం కనిపిస్తుంది. దీనితో పాటు, కాంచని తాల్ అనే ఎత్తైన హిమనీనద సరస్సు కూడా ఉంది. అక్కడికి చేరుకోవడానికి ప్రత్యేకంగా ట్రెకింగ్ చేయాలి. ఏదైనా ఈ ప్రదేశం కూడా స్వర్గాన్ని గుర్తుకు తెస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
ప్రయాణం

Latest Videos
Recommended Stories
Recommended image1
కుక్క ప‌ని గాడిద చేస్తే ఏమ‌వుతుందో తెలుసా.? మీ కండ్లు తెరిపించే కథ
Recommended image2
Unsolved Mysteries: ప్రపంచంలో ఇప్పటికీ పరిష్కారం కాని 7 మిస్టరీలు.. శాస్త్రవేత్తలకూ అంతుచిక్కని రహస్యాలివే!
Recommended image3
ఎర్రబస్సు రంగు ఎందుకు మారింది? ఆర్టిసి బస్సులకు ఆకుపచ్చ, తెలుగు రంగులే ఎందుకు వేశారు?
Related Stories
Recommended image1
వంటింట్లో స్టవ్ పక్కనే సింక్ ఉండొచ్చా? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు?
Recommended image2
పశ్చిమ బెంగాల్‌లోని ఈ ప్రాంతాల్లో ఆగస్టు 18న స్వాతంత్య్ర దినోత్సవం ఎందుకు చేసుకుంటారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved