MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Feature
  • Meat : మీరు కొనే మటన్ తాజాదేనా? ఈ 4 ట్రిక్స్‌తో ఈజీగా కనిపెట్టండి !

Meat : మీరు కొనే మటన్ తాజాదేనా? ఈ 4 ట్రిక్స్‌తో ఈజీగా కనిపెట్టండి !

Meat : తాజా మటన్, నిల్వ ఉంచిన మాంసాన్ని గుర్తించడం ఎలాగో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే మటన్ కొనే ముందు ఈ చిన్న జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 28 2026, 06:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మటన్ ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. మీరు తినేది మాంసమా? రోగాలా?
Image Credit : our own

మటన్ ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. మీరు తినేది మాంసమా? రోగాలా?

మన తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వచ్చిందంటే చాలు.. ముక్క లేనిదే ముద్ద దిగదు. అందులోనూ మటన్ అంటే ఉండే క్రేజే వేరు. కిలో వెయ్యి రూపాయలకు చేరువలో ఉన్నా సరే, ఇష్టంగా కొనుక్కుని లొట్టలేసుకుంటూ తింటాం. అయితే, మనం ఇంత ఖర్చు పెట్టి కొనే మటన్ నిజంగా ఆరోగ్యకరమైనదేనా? అంటే అవునని కచ్చితంగా చెప్పలేం. కొంతమంది వ్యాపారులు లాభాల కోసం నిల్వ ఉంచిన మాంసాన్ని, ఐస్ పెట్టిన మటన్‌ను తాజా మాంసంలా రంగులు కలిపి అమ్ముతున్నారు. ఇలాంటి కల్తీ లేదా నిల్వ మాంసం తింటే ఫుడ్ పాయిజన్ అయ్యి ప్రాణాలకే ప్రమాదం కలగవచ్చు. అందుకే మటన్ కొనే ముందు ఈ విషయాలను గమనించండి..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రంగును బట్టి మటన్ నాణ్యతను పట్టేయండి
Image Credit : our own

రంగును బట్టి మటన్ నాణ్యతను పట్టేయండి

మటన్ షాపుకి వెళ్ళగానే ముందుగా మనం చూడాల్సింది మాంసం రంగు. తాజా మటన్ ఎప్పుడూ లేత ఎరుపు లేదా పింక్ రంగులో మెరుస్తూ ఉంటుంది. ఒకవేళ మాంసం ముదురు రంగులోకి మారినా, అక్కడక్కడా నల్లటి మచ్చలు ఉన్నా, లేదా రంగు వెలిసిపోయినట్లు అనిపించినా అది నిల్వ మాంసమని గుర్తుంచుకోవాలి. ఎముకల దగ్గర రంగు మారుతున్నా అది పాత మాంసానికి సంకేతం. కాబట్టి కంటికి ఇంపుగా, సహజమైన ఎరుపు రంగులో ఉన్నదాన్నే ఎంచుకోండి.

Related Articles

Related image1
ఇండియన్స్‌కు పండగే.. ఒక్క రూపాయి వీసా ఖర్చు లేకుండా ఈ 10 దేశాలకు చెక్కేయండి !
Related image2
SIP Investment Tips : నెలకు రూ. 5,000 పెట్టుబడితో రూ. 6 కోట్ల సంపద ఎలా బాసూ?
35
మటన్ ను తాకి చూస్తే తెలిసిపోతుంది
Image Credit : our own

మటన్ ను తాకి చూస్తే తెలిసిపోతుంది

మటన్ తాజాగా ఉందా లేదా అని తెలుసుకోవడానికి అది ముట్టుకుని చూడటం ఉత్తమం. ఫ్రెష్ మటన్ ఎప్పుడూ కాస్త గట్టిగా, స్ప్రింగ్‌లా ఉంటుంది. అంటే మీరు వేలితో నొక్కినప్పుడు ఆ గుంట వెంటనే పూడిపోయి మాంసం పాత స్థితికి రావాలి. అలా కాకుండా మెత్తగా ఉండి, వేలి ముద్ర అలాగే ఉండిపోతే అది పాడైపోవడానికి సిద్ధంగా ఉందని అర్థం. అలాగే మాంసం జిగటగా ఉండకూడదు. పట్టుకుంటే జారిపోతున్నా, జిగటగా అనిపించినా అది బ్యాక్టీరియా చేరిన నిల్వ మాంసం అని గ్రహించాలి.

45
మాంసం వాసన చూసి జాగ్రత్త పడండి
Image Credit : our own

మాంసం వాసన చూసి జాగ్రత్త పడండి

మాంసానికి ఒక సహజమైన వాసన ఉంటుంది. కానీ అది అసహ్యంగా ఉండదు. ఒకవేళ మీరు కొనే మటన్ నుంచి వింతైన వాసన, పులుపు వాసన లేదా అమ్మోనియా వంటి వాసన వస్తుంటే అది కచ్చితంగా పాడైపోయినట్టే. పాత మాంసాన్ని కడిగి అమ్మినా సరే, ఈ వాసన ద్వారా సులభంగా కనిపెట్టవచ్చు. మాంసం ముక్కలు నీరు కారుతున్నట్లుగా ఉంటే అది డీఫ్రాస్ట్ చేసిన అంటే ఐస్ గడ్డ కట్టించి తీసిన మాంసం అయి ఉండవచ్చు.

55
ఎక్కడ కొంటున్నారు? ఏది కొంటున్నారు?
Image Credit : Getty

ఎక్కడ కొంటున్నారు? ఏది కొంటున్నారు?

మటన్ కొనేటప్పుడు కేవలం మాంసం మీదే కాదు, షాపు పరిసరాల మీద కూడా దృష్టి పెట్టాలి. లైసెన్స్ ఉన్న షాపుల్లో, పరిశుభ్రంగా ఉండే చోట మాత్రమే మాంసం కొనండి. రోడ్డు పక్కన దుమ్ము పడే చోట, ఈగలు ముసురుతున్న చోట కొంటే రోగాలను కొని తెచ్చుకున్నట్లే. మాంసం కొన్నాక ఎక్కువ సేపు బయట ఉంచకుండా వెంటనే వండుకోవడం లేదా ఫ్రిజ్‌లో భద్రపరుచుకోవడం మంచిది. వండేటప్పుడు కూడా తగినంత ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తే అందులోని క్రిములు నశిస్తాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఆహారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Property Buying Tips: వర్షాకాలంలోనే ఇల్లు కొనాలి.. ఎందుకో తెలుసా?
Recommended image2
Dakshina Kailasam: గ్రహణ సమయంలోనూ మూయని ఏకైక గుడి.. ఈ ఆలయానికి జీవితంలో ఒక్కసారైనా ఎందుకు వెళ్లాలి?
Recommended image3
Human Eye: మ‌నిషి క‌న్ను కెమెరా అనుకుంటే.. ఎన్ని మెగాపిక్సెల్స్‌తో స‌మాన‌మో తెలుసా?
Related Stories
Recommended image1
ఇండియన్స్‌కు పండగే.. ఒక్క రూపాయి వీసా ఖర్చు లేకుండా ఈ 10 దేశాలకు చెక్కేయండి !
Recommended image2
SIP Investment Tips : నెలకు రూ. 5,000 పెట్టుబడితో రూ. 6 కోట్ల సంపద ఎలా బాసూ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved