MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • SIP Investment Tips : నెలకు రూ. 5,000 పెట్టుబడితో రూ. 6 కోట్ల సంపద ఎలా బాసూ?

SIP Investment Tips : నెలకు రూ. 5,000 పెట్టుబడితో రూ. 6 కోట్ల సంపద ఎలా బాసూ?

SIP Investment Tips : నెలకు రూ. 5,000 ఎస్‌ఐపీతో రూ. 6 కోట్లు సంపాదించవచ్చని మీకు తెలుసా? సీఏ నితిన్ కౌశిక్ చెప్పిన మనీ మంత్రం, స్టెప్ అప్ ఎస్‌ఐపీ పద్ధతి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Apr 26 2026, 07:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎస్‌ఐపీ మ్యాజిక్: నెలకు రూ. 5 వేలతో రూ. 6 కోట్లు
Image Credit : Gemini

ఎస్‌ఐపీ మ్యాజిక్: నెలకు రూ. 5 వేలతో రూ. 6 కోట్లు

చాలా మంది పెట్టుబడిదారులు భారీ మొత్తంలో డబ్బు చేతికి వచ్చినప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించాలని వేచి చూస్తుంటారు. కానీ, ఇలా వేచి చూడటం వల్ల కాలం వృధా అవ్వడమే కాకుండా, కాంపౌండింగ్ వల్ల వచ్చే భారీ ప్రయోజనాన్ని కోల్పోతారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ సిఏ నితిన్ కౌశిక్ సోషల్ మీడియాలో ఇన్వెస్టర్లకు ఒక అద్భుతమైన పొదుపు మంత్రాన్ని వివరించారు. తక్కువ మొత్తంతో మొదలుపెట్టి కోట్లు ఎలా సంపాదించవచ్చో ఆయన లెక్కలతో సహా వివరించారు. ఆ వివరాలు గమనిస్తే..

25
చిన్న మొత్తంతోనే మొదలుపెట్టండి
Image Credit : Gemini

చిన్న మొత్తంతోనే మొదలుపెట్టండి

పెట్టుబడి విషయంలో ఎప్పుడు మొదలుపెట్టాం అనేది ఎంత మొత్తంతో మొదలుపెట్టాం అనే దానికంటే చాలా ముఖ్యం. నితిన్ కౌశిక్ తన ఎక్స్ పోస్ట్‌లో పెట్టుబడిదారులకు కీలక సూచనలు చేశారు. మీరు నెలకు రూ. 50,000 పెట్టుబడి పెట్టే స్థాయికి వచ్చే వరకు వేచి చూడకండి. మీ వద్ద ప్రస్తుతం ఎంత ఉంటే అంతతోనే, అంటే మీకు భారంగా అనిపించని చిన్న మొత్తంతోనే ప్రయాణాన్ని ప్రారంభించండి. త్వరగా పెట్టుబడి మొదలుపెట్టడం వల్ల మీ డబ్బుకు పెరగడానికి ఎక్కువ సమయం దొరుకుతుందని చెప్పారు.

Related Articles

Related image1
Horror Movie: పాతికేళ్ల క్రితం వచ్చిన హర్రర్ మూవీ ఇది, ఒంటరిగా చూసే ధైర్యం చేయద్దు
Related image2
White Towel: ప్రభుత్వ అధికారుల కుర్చీపై తెల్ల టవల్ ఎందుకు వేస్తారు? దాని వెనుక కథ ఇదే
35
స్టెప్ అప్ ఎస్‌ఐపీ: రూ. 5,000 తో రూ. 6 కోట్లు
Image Credit : Gemini

స్టెప్ అప్ ఎస్‌ఐపీ: రూ. 5,000 తో రూ. 6 కోట్లు

సాధారణ ఎస్‌ఐపీ కంటే స్టెప్ అప్ ఎస్‌ఐపీ అద్భుతాలు సృష్టిస్తుందని కౌశిక్ వివరించారు. ఉదాహరణకు, మీరు నెలకు రూ. 5,000 తో ఎస్‌ఐపీ ప్రారంభించి, ప్రతి ఏటా ఆ పెట్టుబడిని కేవలం 10 శాతం పెంచుకుంటూ వెళ్లాలి. అంటే మొదటి ఏడాది రూ. 5,000 కడితే, రెండో ఏడాది రూ. 5,500 కట్టాలి. ఇలా 30 ఏళ్ల పాటు పెట్టుబడి కొనసాగిస్తూ, సగటున 12 శాతం వార్షిక రాబడి వస్తుందని అంచనా వేస్తే, మీ సంపద ఏకంగా రూ. 6 కోట్లకు చేరుకుంటుంది. కేవలం 10 శాతం వార్షిక పెంపు మీ పెట్టుబడిని ఊహించని స్థాయికి తీసుకెళ్తుంది.

45
రూ. 2,000 ఇన్వెస్ట్ చేసినా కోటీశ్వరులు అవ్వొచ్చు
Image Credit : Gemini

రూ. 2,000 ఇన్వెస్ట్ చేసినా కోటీశ్వరులు అవ్వొచ్చు

పెట్టుబడి మొత్తం చిన్నదైనా, కాలం గడిచేకొద్దీ అది భారీగా మారుతుంది. ఒకవేళ మీరు నెలకు కేవలం రూ. 2,000 మాత్రమే పొదుపు చేయగలిగితే, దీర్ఘకాలంలో అది రూ. 2 కోట్లుగా మారుతుందని కౌశిక్ పేర్కొన్నారు. అదే విధంగా, నెలకు రూ. 20,000 చొప్పున ఇన్వెస్ట్ చేసే వారు క్రమం తప్పకుండా పెట్టుబడిని కొనసాగిస్తే, అది రూ. 22 కోట్ల భారీ నిధిగా మారుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి, కాలమే మీ సంపదను పెంచుతాయి.

55
లక్ష్యం పెద్దదైనా.. అడుగు చిన్నదే
Image Credit : Gemini

లక్ష్యం పెద్దదైనా.. అడుగు చిన్నదే

చాలా మంది ఇన్వెస్టర్లు పెద్ద గోల్స్ గురించి ఆలోచిస్తూ అసలు పెట్టుబడే మొదలుపెట్టకుండా ఆగిపోతుంటారు. భారీ మూలధనం కోసం ఎదురుచూడటం కంటే, అందుబాటులో ఉన్న వనరులతోనే ముందుకు సాగాలని కౌశిక్ సూచించారు. "స్టార్టింగ్ ఎర్లీ బీట్స్ స్టార్టింగ్ బిగ్" అంటే త్వరగా ప్రారంభించడం అనేది, భారీ మొత్తంతో ప్రారంభించడం కంటే మేలు అనే సూత్రాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఏడాదికి 10 శాతం చొప్పున పెట్టుబడిని పెంచుకోవడం అనేది మధ్యతరగతి వారికి కూడా సాధ్యమయ్యే విషయమే. కాబట్టి, కాలం విలువను గుర్తించి ఇప్పుడే ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభించాలని ఆయన సూచిస్తున్నారు.

STOP chasing a 50k monthly investment you can’t afford.

If you start a 5k SIP today and increase it by just 10% every year, a 12% return turns that capital into 6 Crores over three decades.

Even at 2k a month with that same step-up, you end up with 2 Crores, while 20k scales to…

— CA Nitin Kaushik (FCA) | LLB (@Finance_Bareek) April 13, 2026

ముఖ్య గమనిక:

మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. పైన పేర్కొన్న లెక్కలు కేవలం అవగాహన కోసం, స్టెప్ అప్ ఎస్‌ఐపీ వల్ల కలిగే ప్రయోజనాలను వివరించడానికి మాత్రమే. గతంలో వచ్చిన రాబడులు భవిష్యత్తులోనూ అలాగే వస్తాయని గ్యారెంటీ లేదు. పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించి, పథకాలకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా చూడండి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వ్యాపారం
పర్సనల్ పైనాన్స్
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
గోల్డ్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటి.? గోల్డ్ లోన్‌కి దీనికి తేడా ఏంటి.? లాభాలు ఏంటి.?
Recommended image2
No Cost EMIలో ఏం కొనకండి.. అసలు ఈ లెక్కలు చూస్తే మళ్లీ జన్మలో అటు వెళ్లరు.. ఎందుకంటే.?
Recommended image3
Home Loan: హోమ్ లోన్‌తో ఇల్లు కొనాలనుకుంటున్నారా? ఇప్పుడే కళ్లు తెరవండి.. ఇది మీకోసమే
Related Stories
Recommended image1
Horror Movie: పాతికేళ్ల క్రితం వచ్చిన హర్రర్ మూవీ ఇది, ఒంటరిగా చూసే ధైర్యం చేయద్దు
Recommended image2
White Towel: ప్రభుత్వ అధికారుల కుర్చీపై తెల్ల టవల్ ఎందుకు వేస్తారు? దాని వెనుక కథ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved