MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Facts: ఎడారిలో పాత్రలను ఎలా శుభ్రం చేస్తారో తెలుసా? నీళ్లు లేకుండానే అంట్లు ఎలా క్లీన్ అవుతాయి?

Facts: ఎడారిలో పాత్రలను ఎలా శుభ్రం చేస్తారో తెలుసా? నీళ్లు లేకుండానే అంట్లు ఎలా క్లీన్ అవుతాయి?

Facts: ఇంట్లో తిన్న తరువాత అంట్లు తోమడానికి బకెట్లకు బకెట్లు నీళ్లు వాడుతుంటారు. ఖరీదైన సోప్ లు ఉపయోగిస్తారు. కానీ ఎడారిలో ఇవేమీ లేకుండా.. అసలు నీళ్లే వాడకుండా పాత్రలను ఎలా శుభ్రం చేస్తాదో తెలుసా? షాక్ అవుతారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 08 2026, 12:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పాత్రల కోసం ఖరీదైన సబ్బులు, బకెట్ల కొద్ది నీరు..
Image Credit : gemini AI

పాత్రల కోసం ఖరీదైన సబ్బులు, బకెట్ల కొద్ది నీరు..

మన ఇళ్లలో భోజనాలు చేసిన తరువాత వంట వండిన పాత్రలు, తిన్నపళ్ళాలు కడగడానికి బకెట్లకు బకేట్లు నీళ్లు, ఖరీదైన సోప్ లు, లిక్విడ్స్ వాడుతుంటారు. ఒక్క పూట నీళ్లు రాకుంటే సింక్ నిండా అంట్లు పేరుకుపోతుంటాయి. మళ్లీ నీళ్లు వచ్చేవరకూ.. పాత్రలు అలా మురిగిపోవాల్సిందే. నీళ్లు సరిగ్గా రాని ప్రాంతాల్లో అయితే .. గిన్నెలు తోమడం ఆడవారికి కొండంత భారంగా మారుతుంది. మరి అలాంటిది చుక్క నీరు కూడా దొరకని, కేవలం ఇసుక తిన్నెలు మాత్రమే ఉండే ఎడారి ప్రాంతాల్లో (Deserts) నివసించే ప్రజలు వంట పాత్రలను ఎలా శుభ్రం చేసుకుంటారో ఎప్పుడైనా ఆలోచించారా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇసుకే సబ్బు.. బూడిదే వారి లిక్విడ్!
Image Credit : gemini ai

ఇసుకే సబ్బు.. బూడిదే వారి లిక్విడ్!

నీటి కొరత ఎక్కువగా ఉండే ఎడారి ప్రాంతాలలో ప్రజలు పాత్రలను కడగడానికి ఒక వినూత్నమైన, సాంప్రదాయ పద్ధతిని ఉపయోగిస్తారు. నీళ్లు లేకుండానే గిన్నెలను అద్దంలా మెరిపిస్తారు. ఆ ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు ప్రపంచాన్నే ఆకట్టుకుంటున్నాయి. ఎడారిలో నీటిని కేవలం తాగడానికి, వంట వండుకోవడానికి మాత్రమే చాలా పొదుపుగా వాడుకుంటారు. 

Related Articles

Related image1
Facts: జపాన్ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? లేడి యూట్యూబర్ చెప్పిన సంచలన విషయాలు...
Related image2
Facts: అమెరికా రోడ్లపై కరెంటు తీగలు కనిపించవు ఎందుకో తెలుసా? ఇండియాలో ఇది సాధ్యమేనా?
35
నీటిని వృథా చేయరు
Image Credit : gemini AI

నీటిని వృథా చేయరు

పాత్రలు కడగడానికి అస్సలు నీటిని వృథా చేయరు. ఎడారిలో దొరికే శుభ్రమైన, వేడి ఇసుక(Hot Sand)ను గిన్నెలు తోమడానికి ప్రధానంగా ఉపయోగిస్తారు. పాత్రల్లో మిగిలిపోయిన జిడ్డు, ఆహార పదార్థాలను ఇసుకతో బాగా రుద్దుతారు. ఇసుకలో ఉండే గరుకుదనం (Abrasive nature) వల్ల పాత్రలకు పట్టిన ఎంతటి మొండి జిడ్డు అయినా వదిలిపోతుంది.

45
ఎలా శుభ్రం చేస్తారంటే?
Image Credit : gemini AI

ఎలా శుభ్రం చేస్తారంటే?

వంట చేసిన తర్వాత మిగిలిన కట్టెల బూడిద (Wood Ash)ను ఇసుకతో కలుపుతారు. బూడిదలో సహజసిద్ధమైన ఆల్కలీన్ గుణాలు ఉంటాయి. ఇది జిడ్డును వదిలించడమే కాకుండా, పాత్రలపై ఉండే బ్యాక్టీరియా, క్రిములను నశింపజేయడానికి ఒక అద్భుతమైన శానిటైజర్‌గా పనిచేస్తుంది. మొదట పాత్రల్లోని జిడ్డును ఎండిపోయిన గడ్డితో లేదా చిన్న గుడ్డతో తుడిచేస్తారు. ఆ తర్వాత వేడి ఇసుక, బూడిద మిశ్రమాన్ని వేసి గిన్నె లోపల, బయట బాగా రుద్దుతారు. దీనివల్ల పాత్రలకు ఉన్న మసి, నూనె జిడ్డు పూర్తిగా వదిలిపోతాయి. చివరగా ఒక పొడి గుడ్డతో ఆ ఇసుకను పూర్తిగా తుడిచేస్తారు. అంతే, పాత్రలు నీళ్లు లేకుండానే సరికొత్తగా మెరిసిపోతాయి.

55
పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది..
Image Credit : gemini AI

పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది..

ఈ పద్ధతిని వారు ఎన్నో ఏళ్లుగా ఉపయోగిస్తున్నారు. ఇండియాలోని రాజస్థాన్ ప్రాంతంలో ఉంటున్న కొన్ని గ్రామాల వారు...తమ పూర్వికుల కాలం నుంచి ఈ పద్దతిని ఉపయోగిస్తున్నారు. దీని వల్ల నీరు వేస్ట్ కాకుండా.. ఆదా అవ్వడమే కాదు.. ఎలాంటి కెమికల్స్ లేకుండా ఇలా గిన్నెలు కడగడం వల్ల పర్యావరణం కూడా పాడవకుండా ఎంతో మేలు జరుగుతుంది. నీటి కొరతను అధిగమించడానికి ప్రకృతి ప్రసాదించిన వనరులను ఎలా వాడుకోవాలో చెప్పడానికి ఎడారి ప్రజల ఈ జీవన శైలి ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. రీసెంట్ గా దీనికి సబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Onions: ఈ ఊరిలో ఉల్లిపాయలు అమ్మరు, కొనరు, తినరు.. అది చట్టరీత్యా నేరం కూడా
Recommended image2
Telangana First Airport: నిజాం కాలంలోనే నైట్ ల్యాండింగ్.. తెలంగాణ ఫస్ట్ ఎయిర్‌పోర్ట్ ఏదో తెలుసా?
Recommended image3
Facts : ఇండియాలో స్కూల్ టీచర్ల సంఖ్య ఎంతో తెలుసా? ఏపీ, తెలంగాణలో ఎంతమంది?
Related Stories
Recommended image1
Facts: జపాన్ లో క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? లేడి యూట్యూబర్ చెప్పిన సంచలన విషయాలు...
Recommended image2
Facts: అమెరికా రోడ్లపై కరెంటు తీగలు కనిపించవు ఎందుకో తెలుసా? ఇండియాలో ఇది సాధ్యమేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved