MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Driving Rules: మనదేశంలో హైవేపై డ్రైవ్ చేసేటప్పుడు పాటించాల్సిన రూల్స్ ఇవిగో...ఇవి మీకు ఎవరూ చెప్పి ఉండరు

Driving Rules: మనదేశంలో హైవేపై డ్రైవ్ చేసేటప్పుడు పాటించాల్సిన రూల్స్ ఇవిగో...ఇవి మీకు ఎవరూ చెప్పి ఉండరు

Driving Rules: హైవేపై డ్రైవింగ్ చేసేటప్పుడు మనదేశంలో కొన్ని రూల్స్ పాటించాలి. ఆ రూల్స్ గురించి తెలిసింది చాలా తక్కువ మందికే.భారత మోటారు వాహనాల చట్టం చెబుతున్న ముఖ్యమైన రూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 02 2026, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
హైవేపై పాటించాల్సిన రూల్స్
Image Credit : chatgpt

హైవేపై పాటించాల్సిన రూల్స్

నగర వీధుల్లో కారు నడపడానికి, హైవేపై కారు నడపడానికి ఎంతో తేడా ఉంటుంది. అలాగే హైవేపై రూల్స్ కూడా వేరేగా ఉంటాయి. కానీ హైవే రూల్స్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. హైవేపై భారీ వాహనాలు, వాతావరణ మార్పులు, వర్షం, పొగమంచు లాంటివి ఉంటాయి. కాబట్టి చిన్న తప్పు చేసినా పెద్ద ప్రమాదం జరగొచ్చు.

హైవేపై డ్రైవింగ్ చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన సేఫ్టీ రూల్స్ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్-2017 ప్రకారం డ్రైవర్లు పాటించాల్సిన రూల్స్ చాలా ఉన్నాయి. వాటిలో మనం పెద్దగా పట్టించుకోని 7 ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన రూల్స్
Image Credit : x

ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన రూల్స్

  1. హైవేపై స్పీడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ముందు వెళ్లే వాహనానికి మీ కారుకు మధ్య తగినంత గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ముందు వెళ్లే కారు సడెన్‌గా బ్రేక్ వేస్తే, మీరు మరీ దగ్గరగా ఉంటే వెంటనే కారును ఢీకొట్టే అవకాశం ఉంది. MoRTH రూల్స్ ప్రకారం, ముందు వెళ్లే వాహనం సడెన్‌గా స్పీడ్ తగ్గించినా లేదా ఆపినా, మీరు సురక్షితంగా ఆపగలిగేంత గ్యాప్ మెయింటైన్ చేయాలి.

2. సర్వీస్ రోడ్డు లేదా వేరే రోడ్డు నుంచి నేషనల్ హైవే/స్టేట్ హైవేపైకి ఎక్కేటప్పుడు, హైవేపై అప్పటికే వెళ్తున్న వాహనాలకు ముందుగా దారి ఇవ్వాలి. రూల్స్ ప్రకారం, హైవేపైకి వచ్చే వాహనం అప్పటికే హైవేపై వెళ్తున్న ట్రాఫిక్‌కు దారి ఇవ్వాలి తప్ప దానికి అడ్డుగా లేదా ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించకూడదు.

3. యాక్సిలరేషన్/మెర్జింగ్ లేన్ ఉంటే, దాన్ని ఉపయోగించి తగినంత స్పీడ్ అందుకున్నాకే ట్రాఫిక్‌లో కలవాలి. దానికి ముందు, కలిసేటప్పుడు రియర్-వ్యూ, సైడ్-వ్యూ మిర్రర్స్ ద్వారా ట్రాఫిక్‌ను గమనిస్తూ ఇండికేటర్ వాడాలి. హైవేపై కాస్త గ్యాప్ దొరికింది కదా అని వెంటనే వాహనాన్ని లోపలికి తిప్పడం చాలా ప్రమాదం.

33
వర్షంలో ఇలా డ్రైవ్ చేయద్దు
Image Credit : x

వర్షంలో ఇలా డ్రైవ్ చేయద్దు

వర్షం పడుతున్నప్పుడు రోడ్డుపై నీరు నిలిచిపోయే అవకాశం ఎక్కువ. ముందున్న వాహనాలు కూడా సరిగా కనిపించవు. బ్రేకింగ్ డిస్టెన్స్ కూడా పెరుగుతుంది. అందుకే వర్షం, తుఫాను లాంటి వాతావరణంలో వాహనాన్ని తక్కువ స్పీడ్‌తో నడపాలి. ముందు స్పష్టంగా కనిపించే దూరంలోనే వాహనాన్ని ఆపగలిగే స్పీడ్‌ను ఎంచుకోవాలని MoRTH రూల్స్ చెబుతున్నాయి. అలాగే, వాతావరణం బాలేనప్పుడు ముందు వెళ్లే వాహనానికి, మీకు మధ్య గ్యాప్ పెంచాలి.

హైవే టన్నెల్స్ (సొరంగ మార్గాలు)లో డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక రూల్స్ ఉంటాయి. టన్నెల్‌లోకి వెళ్లే ముందే డిప్పర్/హెడ్‌లైట్స్ ఆన్ చేయాలి. అలాగే టన్నెల్స్‌లో ఓవర్‌టేక్ అస్సలు చేయకూడదు. యూ-టర్న్ తీసుకోకూడదు. రివర్స్ తీయకూడదు. ఎమర్జెన్సీ అయితే తప్ప వాహనాన్ని ఆపడం లేదా పార్కింగ్ చేయడం చేయకూడదు. ఒకవేళ ఎమర్జెన్సీగా వాహనాన్ని ఆపాల్సి వస్తే హజార్డ్ వార్నింగ్ లైట్స్ వేయాలి. ః

రూల్స్ ప్రకారం రిఫ్లెక్టివ్ వార్నింగ్ ట్రయాంగిల్స్‌ను వాహనం ముందు, వెనుక పెట్టాలి. టన్నెల్ అంటే కేవలం చీకటిగా ఉండే రోడ్డు అనుకోకుండా, డ్రైవింగ్‌లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రాంతం అని గుర్తుంచుకోవాలి.

హైవేపై పెద్ద స్పీడ్ లిమిట్ బోర్డు చూడగానే కచ్చితంగా ఆ స్పీడ్‌తోనే వెళ్లాలని కొందరు అనుకుంటారు. కానీ స్పీడ్‌ను డిసైడ్ చేసేటప్పుడు రోడ్డు కండిషన్ మాత్రమే కాదు.. ట్రాఫిక్, వాతావరణం, విజిబిలిటీ, వాహనం కండిషన్ లాంటివి కూడా డ్రైవర్ దృష్టిలో పెట్టుకోవాలి.

MoRTH రూల్స్ ప్రకారం, ఎప్పుడూ వాహనం మీ కంట్రోల్‌లో ఉండే స్పీడ్‌తోనే నడపాలి. అలాగని స్పీడ్ లిమిట్ దాటకూడదు. ఉదాహరణకు, స్పీడ్ లిమిట్ 100 km/h ఉన్నా, భారీ వర్షం వల్ల విజిబిలిటీ బాగా తగ్గితే, 100 km/h స్పీడ్‌తో వెళ్లడం ఏమాత్రం సేఫ్ కాదు. స్పీడ్ లిమిట్ అనేది చట్టపరమైన గరిష్ట పరిమితి మాత్రమే. ప్రతి పరిస్థితిలోనూ అదే స్పీడ్‌తో వెళ్లాలని రూల్ లేదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dream: కలలు ఎందుకు వస్తాయి? నిద్రలో మెదడు చేసే వింతలు.. సైన్స్ వెల్లడించిన షాకింగ్ నిజాలివే
Recommended image2
Gold: హాల్‌మార్క్ చూసి గోల్డ్ కొంటున్నారా? అది ఫేక్ కావచ్చు.. ఈ 5 కచ్చితంగా చూడండి!
Recommended image3
Hyderabad To Kashmir Tour : ఈ దసరా సెలవుల్లో కశ్మీర్ చుట్టిరండి.. హైదరాబాద్ నుండి IRCTC టూర్ ప్లాన్
Related Stories
Recommended image1
Snake Weakness: విషపూరితపాముల వీక్‌నెస్ ఇదే.. ఆహారం కడుపులోనే కుళ్లిపోయి మరణిస్తాయి
Recommended image2
Migraine and Jalebi: ఉదయాన్నే జిలేబీ, పాలు కలిపి తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గిపోతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved