MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Harivarasanam Song : శబరిమల అయ్యప్పను నిద్రపుచ్చేది ఓ క్రైస్తవ స్వరమా..! జోలపాట పాడేది ఎవరో తెలుసా?

Harivarasanam Song : శబరిమల అయ్యప్పను నిద్రపుచ్చేది ఓ క్రైస్తవ స్వరమా..! జోలపాట పాడేది ఎవరో తెలుసా?

కోట్లాదిమంది హిందువులు ఎంతో భక్తిశ్రద్దలతో కొలిచే శబరిమల అయ్యప్పస్వామిని నిద్రపుచ్చేది ఓ క్రైస్తవ స్వరం అని మీకు తెలుసా? ప్రతిరోజు రాత్రి ఆ స్వామికి జోలపాట పాడేది ఎవరో తెలుసా?

4 Min read
Author : Arun Kumar P
Published : Nov 04 2026, 11:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
శబరిమల అయ్యప్ప పవళింపు పాట ఏది?
Image Credit : Travancore devaswom Board Website

శబరిమల అయ్యప్ప పవళింపు పాట ఏది?

సాధారణంగా దేవాలయాల్లో ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, రాత్రి పవళింపు సేవతో నిద్రపుచ్చుతారు. కానీ కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయంలో మాత్రం రాత్రి వేళ వినిపించే ఓ మధురమైన గీతానికి ప్రత్యేక స్థానం ఉంది. రోజంతా భక్తుల శరణుఘోషలతో మారుమోగే సన్నిధానం రాత్రి వేళ నెమ్మదిగా ప్రశాంతంగా మారుతుంది. చివరగా 'హరివరాసనం విశ్వమోహనం' అనే కీర్తన ఆలయంలో ప్రతిధ్వనిస్తుంది... ఈ పాట వినిపించిన తర్వాతే అయ్యప్ప ఆలయ తలుపులు మూసివేస్తారు.

ఇందులో విశేషం ఏమిటంటే.. కోట్లాది మంది అయ్యప్ప భక్తులు భక్తితో వినే ఈ జోలపాటను ఆలపించిన గాయకుడు క్రైస్తవ కుటుంబంలో జన్మించిన ఓ ప్రముఖ సంగీత విద్వాంసుడు. ఆయనే కేజే యేసుదాస్. ఒక హిందూ దేవాలయంలో స్వామివారిని నిద్రపుచ్చే గీతంగా క్రైస్తవ గాయకుడి స్వరం వినిపించడం భారతదేశంలోని మతసామరస్యానికి చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది. అసలు ఈ పాట ఎప్పుడు మొదలైంది? దీన్ని రాసిందెవరు? యేసుదాస్ స్వరంలోనే ఎందుకు వినిపిస్తుంది? తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హరివరాసనం.. అయ్యప్ప స్వామి పవళింపు గీతం
Image Credit : travancore Devaswom Website

హరివరాసనం.. అయ్యప్ప స్వామి పవళింపు గీతం

'హరివరాసనం విశ్వమోహనం' అంటూ సాగే అయ్యప్పస్వామి పవళింపు కీర్తనను 'హరిహరాత్మజాష్టకం' అని కూడా పిలుస్తారు. శబరిమలలో వెలిసిన అయ్యప్ప హరిహరాత్మజుడిగా అంటే హరి (విష్ణువు), హరుడు (శివుడు) అంశాల కలయికగా భావిస్తారు. ఈ కీర్తనలో స్వామివారి మహిమను, దైవిక స్వరూపాన్ని కీర్తిస్తారు. ఇందులో మొత్తం ఎనిమిది శ్లోకాలు ఉండటంతో అష్టకం అనే పేరు వచ్చింది.

ప్రతిరోజూ రాత్రి ఆలయంలో చివరి పూజ అయిన అత్తాళ పూజ (అథాజ పూజ) ముగిసిన తర్వాత ఈ గీతాన్ని ఆలపిస్తారు. స్వామివారికి పవళింపు పలికే జోలపాటగా భక్తులు దీనిని భావిస్తారు. పాట పూర్తయ్యే సమయానికి ఆలయ గర్భగుడి తలుపులు మూసివేస్తారు.

35
యేసుదాస్ స్వరంలోనే ఎందుకు వినిపిస్తుంది?
Image Credit : Asianet News

యేసుదాస్ స్వరంలోనే ఎందుకు వినిపిస్తుంది?

శబరిమలలో ప్రస్తుతం వినిపించే హరివరాసనం వెనుక 1975 నాటి సినిమా కథ ఉంది. ఆ ఏడాది విడుదలైన మలయాళ చిత్రం 'స్వామి అయ్యప్పన్'లో ఈ కీర్తనను పొందుపరిచారు. ప్రముఖ సంగీత దర్శకుడు జి. దేవరాజన్ దీనికి స్వరాలు సమకూర్చగా, కేజే యేసుదాస్ తన మధురమైన గాత్రంతో ఆలపించారు.

సినిమా ద్వారా ఈ పాట దక్షిణ భారతదేశమంతటా విశేష ఆదరణ పొందింది. అనంతరం యేసుదాస్ పాడిన ఈ వెర్షన్‌ను శబరిమల ఆలయంలో రాత్రి వేళ ప్రసారం చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా ఇదే రికార్డింగ్ ఆలయ ముగింపు సమయంలో వినిపిస్తోంది.

అయితే ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం ఉంది. యేసుదాస్ పాటే ఆలయంలో వినిపించే ఏకైక గానం కాదు. ఆయన రికార్డింగ్ ప్రసారమయ్యే సమయంలో గర్భగుడి వద్ద ఆలయ పూజారులు కూడా సంప్రదాయబద్ధంగా ఈ కీర్తనను ఆలపిస్తారు. పూజారులు పాడే వెర్షన్‌లో ప్రతి పాదానికి 'స్వామి' అనే పదం కూడా ఉంటుంది.

మధ్యమావతి రాగంలో మనసుకు హాయినిచ్చే సంగీతం

హరివరాసనం పాట ఇంతగా ప్రజాదరణ పొందడానికి అందులోని భక్తిభావంతో పాటు సంగీతం కూడా ఓ కారణం. సంగీత దర్శకుడు జి. దేవరాజన్ ఈ గీతాన్ని మధ్యమావతి రాగంలో స్వరపరిచారు. ఈ రాగం కర్ణాటక సంగీతంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రశాంతమైన భావాన్ని, భక్తి పారవశ్యాన్ని కలిగించే స్వభావం దీనికి ఉంది.

యేసుదాస్ గాత్రంలోని మాధుర్యం, మధ్యమావతి రాగంలోని ప్రశాంతత కలిసిపోవడంతో ఈ పాట వినేవారికి ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా అయ్యప్ప మాల ధరించిన భక్తులకు ఈ గీతం ఎంతో ఆత్మీయంగా మారింది.

45
హరివరాసనం పాటను రాసిందెవరు?
Image Credit : x

హరివరాసనం పాటను రాసిందెవరు?

హరివరాసనం రచయిత విషయంలో ఆసక్తికరమైన చర్చ ఉంది. చాలాకాలంగా ఈ కీర్తనను కంబంకుడి కులత్తూర్ శ్రీనివాస అయ్యర్ రచించినట్లు ప్రచారంలో ఉంది. అయితే 2014లో మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పాటను తమ పూర్వీకురాలు కొన్నకత్తు జానకీ అమ్మ 1923లో రచించారని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.

జానకీ అమ్మ శబరిమల ఆలయ ప్రధాన పూజారిగా పనిచేసిన అనంతకృష్ణ అయ్యర్ కుమార్తె. ఆమె స్వయంగా రాసినట్లు చెబుతున్న చేతిరాత ప్రతులు తమ వద్ద ఉన్నాయని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. శ్రీనివాస అయ్యర్ ఈ కీర్తనను రచించలేదని, కేవలం సంకలనం చేశారని వారి వాదన. అయితే ఈ పాట రచయితపై ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం లేదు.

పాట పూర్తయ్యే వరకు గర్భగుడిలో ఏం జరుగుతుంది?

హరివరాసనం కేవలం ఓ పాట మాత్రమే కాదు.. శబరిమల ఆలయంలో రాత్రి పూజల ముగింపును సూచించే సంప్రదాయం కూడా. ఈ గీతం వినిపిస్తున్న సమయంలో గర్భగుడిలోని పూజారులు ఒక్కొక్కరుగా బయటకు వస్తారు. చివరగా ప్రధాన పూజారి (మేల్ శాంతి) మాత్రమే గర్భగుడిలో ఉంటారు.

ఆయన అక్కడి దీపాలను ఒక్కొక్కటిగా ఆర్పుతూ స్వామివారికి నమస్కరిస్తారు. కీర్తన ముగిసే సమయానికి చివరి దీపాన్ని కూడా ఆర్పి గర్భగుడి తలుపులు మూసివేస్తారు. ఇలా రోజంతా భక్తులకు దర్శనమిచ్చిన అయ్యప్ప స్వామికి రాత్రి పవళింపు పలుకుతారు.

55
1950ల నుంచే కొనసాగుతున్న సంప్రదాయం
Image Credit : x

1950ల నుంచే కొనసాగుతున్న సంప్రదాయం

యేసుదాస్ పాడిన సినిమా వెర్షన్ కంటే ముందే శబరిమలలో హరివరాసనం ఆలపించే సంప్రదాయం ఉన్నట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి. 1950లో ఆలయంలో అగ్నిప్రమాదం జరిగిన తర్వాత పునర్నిర్మాణం చేపట్టారు. అనంతరం 1955లో స్వామి విమోచనానంద ఈ అష్టకాన్ని ఆలయంలో మొదటిసారిగా ఆలపించినట్లు ఓ కథనం ప్రచారంలో ఉంది. అయితే ఈ సంప్రదాయం ప్రారంభానికి సంబంధించి వివిధ కథనాలు ఉన్నాయి.

2017లో హరివరాసనం పాత వెర్షన్‌లోని కొన్ని పదాల ఉచ్చారణ, పాఠాంతరాలను సరిచేసేందుకు కొత్తగా రికార్డు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. పూజారులు ఆలపించే సంప్రదాయ రూపంలో ప్రతి పాదానికి 'స్వామి' అనే పదం ఉంటుందని, ప్రసిద్ధ రికార్డింగ్‌లో అది లేదని అప్పట్లో చర్చ జరిగింది. అయితే ఆ ప్రతిపాదనకు వ్యతిరేకత రావడంతో యేసుదాస్ గాత్రంలోని ప్రసిద్ధ వెర్షన్‌ను మార్చే ప్రయత్నం ముందుకు సాగలేదు.

మతాలకు అతీతంగా మనసులను కలిపే గానం

ఒకవైపు శబరిమలలో అయ్యప్ప నామస్మరణ, మరోవైపు రాత్రి వేళ యేసుదాస్ గాత్రంలో హరివరాసనం.. ఈ రెండింటి కలయిక భక్తులకు ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తోంది. సంగీతానికి మతం, కులం, ప్రాంతం అనే హద్దులు ఉండవని ఈ సంప్రదాయం మరోసారి గుర్తుచేస్తోంది.

అయ్యప్ప భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎన్ని కిలోమీటర్లు నడిచినా, ఎన్ని రోజుల పాటు దీక్ష చేపట్టినా.. చివరకు వారి మనసుల్లో నిలిచిపోయే మధురమైన అనుభూతుల్లో హరివరాసనం ఒకటి. అందుకే ఈ గీతాన్ని కేవలం ఓ సినిమా పాటగా కాకుండా అయ్యప్ప స్వామి పవళింపు గీతంగా కోట్లాది మంది భక్తులు ఆరాధిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
 
1st ODI • NZ vs IND 2026
Innings Break
NZNZ
185
INDIND
-
IND chose to bowl.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Sweet: మనదేశంలోనే ఖరీదైన స్వీట్ ఇది.. దీని ధరతో ఒక బైక్ కొనేయచ్చు, ఈ స్వీట్ ఎక్కడ దొరుకుతుందంటే
Recommended image2
Orange City: మన దేశంలో ఆరెంజ్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా? ఇక్కడి ఆరెంజ్ చాలా ఫేమస్!
Related Stories
Recommended image1
Sabarimala: అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. ఏఐ రాకతో శబరిమలలో భారీ మార్పులు
Recommended image2
Sabarimala : బంగారం రాగిగా ఎలా మారింది? శబరిమల గుట్టు రట్టు.. హైకోర్టు చివాట్లు ! ఈడీ పంజా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved