MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • Pyramid Mystery : ఈజిప్ట్ పిరమిడ్ల అసలు నిజం తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !

Pyramid Mystery : ఈజిప్ట్ పిరమిడ్ల అసలు నిజం తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే !

Pyramid Mystery : ఈజిప్ట్ పిరమిడ్ల నిర్మాణం ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నలుగానే ఉన్నాయి. అయితే, తాజాగా పరిశోధకులు గీజా పిరమిడ్ గురించి షాకింగ్ నిజాలు చెప్పారు. అది సమాధి కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ! షాకింగ్ వివరాలు ఇలా ఉన్నాయి..

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Apr 24 2026, 08:06 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
గీజా పిరమిడ్ : మమ్మీల విశ్రాంతి స్థలమా లేక ప్రాచీన విద్యుత్ కేంద్రమా?
Image Credit : Gemini

గీజా పిరమిడ్ : మమ్మీల విశ్రాంతి స్థలమా లేక ప్రాచీన విద్యుత్ కేంద్రమా?

వేల సంవత్సరాలుగా ఈజిప్ట్ పిరమిడ్ల గురించి ప్రపంచం ఒకే విషయాన్ని నమ్ముతూ వస్తోంది. అవి అక్కడి రాజుల శవాలను, అంటే మమ్మీలను భద్రపరిచేందుకు నిర్మించిన సమాధులని చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న ఒక కొత్త సిద్ధాంతం ఈ నమ్మకాలను పూర్తిగా తలకిందులు చేస్తోంది.

గీజాలోని మహా పిరమిడ్ అసలు సమాధే కాదని, అది ఒక అద్భుతమైన పవర్ ప్లాంట్ అని కొందరు నిపుణులు వాదిస్తున్నారు. దీనిని 'బ్యాటరీ థియరీ' అని పిలుస్తున్నారు. ఈ పిరమిడ్ లోపల లభించిన రసాయనాలు, అక్కడ వాడిన రాళ్లు ఇప్పుడు శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
సమాధా లేక విద్యుత్ కేంద్రమా? కొత్త చర్చ మొదలైంది
Image Credit : our own

సమాధా లేక విద్యుత్ కేంద్రమా? కొత్త చర్చ మొదలైంది

రాజు ఖుఫు జ్ఞాపకార్థం నిర్మించిన గీజా పిరమిడ్ ప్రస్తుతం తన అసలు గుర్తింపు గురించి కొత్త చర్చకు దారితీస్తోంది. ప్రముఖ మిస్టరీ ఎక్స్‌పర్ట్ ఏజే జెంటైల్ ప్రకారం.. పిరమిడ్ లోపల దొరికిన ఆధారాలు అది సమాధి అనే వాదనపై అనేక సందేహాలను రేకెత్తిస్తున్నాయి. డైలీ స్టార్ రిపోర్టుల ప్రకారం.. పిరమిడ్ లోపలి గోడలపై, రహస్య గదులలో కొన్ని ప్రత్యేక రసాయనాల ఆనవాళ్లు కనిపించాయి. సాధారణంగా ఒక సమాధిలో ఇలాంటి రసాయనాలు ఉండాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు.

36
రసాయనాలు.. గురుత్వాకర్షణ శక్తి
Image Credit : Gemini

రసాయనాలు.. గురుత్వాకర్షణ శక్తి

పిరమిడ్ లోపల జింక్ క్లోరైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వంటి మూలకాలు ఉన్నట్లు జెంటైల్ గుర్తించారు. ఈ రసాయనాలను పిరమిడ్ లోపల ఉండే సన్నని మార్గాల ద్వారా కిందికి పంపేవారని ఈ సిద్ధాంతం చెబుతోంది. గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ రసాయనాలు వేగంగా కిందికి ప్రవహించి ఒకదానితో ఒకటి కలిసినప్పుడు రసాయనిక చర్య జరిగి హైడ్రోజన్ వాయువు విడుదలయ్యేది. ఈ వాయువు వల్ల పిరమిడ్ లోపల విపరీతమైన ఒత్తిడి, శక్తి పుట్టేదని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

46
క్వార్ట్జ్ రాళ్లతో విద్యుత్ కనెక్షన్
Image Credit : Gemini

క్వార్ట్జ్ రాళ్లతో విద్యుత్ కనెక్షన్

పిరమిడ్ లోని కింగ్స్ చాంబర్ ను ప్రత్యేకంగా రోజ్ గ్రానైట్ రాళ్లతో నిర్మించారు. ఈ రాళ్లలో అత్యధిక మొత్తంలో క్వార్ట్జ్ అనే పదార్థం ఉంటుంది. శాస్త్రీయంగా క్వార్ట్జ్ రాళ్లపై ఒత్తిడి పడినప్పుడు అవి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి, దీనినే పిజోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. పిరమిడ్ భారీ నిర్మాణం, భూమిలోని ప్రకంపనలు కలిసినప్పుడు, ఈ రాళ్లు ఒక శక్తివంతమైన ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లా పనిచేసేవని బ్యాటరీ థియరీ గురించి పలువురు పరిశోధకులు చెబుతున్నారు.

56
వైర్ లెస్ ఎనర్జీ సాధ్యమేనా?
Image Credit : Gemini

వైర్ లెస్ ఎనర్జీ సాధ్యమేనా?

ఒకప్పుడు పిరమిడ్ పైభాగంలో బంగారంతో చేసిన క్యాప్‌స్టోన్ ఉండేదని కొందరు హిస్టోరియన్స్ వాదన. బంగారం విద్యుత్తును చాలా వేగంగా ప్రసారం చేస్తుంది. పిరమిడ్ లోపల పుట్టిన అపారమైన విద్యుత్ శక్తిని ఈ బంగారు శిఖరం ద్వారా ఆకాశంలోకి పంపేవారని, అంటే వైర్ లేకుండానే శక్తిని సరఫరా చేసేవారని ఈ థియరీ చెబుతోంది. ప్రముఖ శాస్త్రవేత్త నికోలా టెస్లా ప్రతిపాదించిన వైర్‌లెస్ విద్యుత్ సాంకేతికతకు ఇది దగ్గరగా ఉండటం గమనార్హం.

66
మమ్మీలు ఏమయ్యాయి? అంతుచిక్కని ప్రశ్నలు
Image Credit : @Freepik

మమ్మీలు ఏమయ్యాయి? అంతుచిక్కని ప్రశ్నలు

అసలు ఇది సమాధే అయితే, అక్కడ ఏనాడూ ఒక్క మమ్మీ కూడా ఎందుకు దొరకలేదు? అన్నది పెద్ద ప్రశ్న. దొంగలు వాటిని ఎత్తుకెళ్లారని కొందరు చెబుతున్నా, దానికి సరైన ఆధారాలు లేవు. బహుశా ఈ పిరమిడ్లను ఈజిప్షియన్లు నిర్మించలేదని, అంతకంటే ముందే ఉన్న ఈ అద్భుత కట్టడాలను చూసి వారు ఆశ్చర్యపోయి, వాటిని దేవుళ్ల అద్భుతాలుగా భావించి తమ సంస్కృతిలో చేర్చుకున్నారని జెంటైల్ వంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఒకవేళ పిరమిడ్ విద్యుత్తును ఉత్పత్తి చేస్తే, ఆ కాలంలో ఆ విద్యుత్తును దేని కోసం వాడేవారు? అన్నదానికి ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలు లేవు. ఏది ఏమైనా, ఈ బ్యాటరీ థియరీ గీజా పిరమిడ్‌ను మరోసారి ప్రపంచంలోనే అతిపెద్ద మిస్టరీగా మార్చేసింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
విద్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Telugu Saying: కాలం కలిసి రాకపోతే కర్రే పామై కాటేస్తుంది! పెద్దలు ఈ సామెత ఎందుకు చెప్పారో తెలుసా?
Recommended image2
ప్రపంచంలో అత్యధిక ముస్లింలు ఉన్న దేశమేదో తెలుసా? ఇండియా స్థానమెంత?
Recommended image3
US Apartment Rules: అమెరికాలో రోడ్డుపై ఈ పని చేస్తే చిక్కుల్లో పడ్డట్లే
Related Stories
Recommended image1
Property Buying Checklist : ఇల్లు కొంటున్నారా? ఈ 10 డాక్యుమెంట్లు చెక్ చేసుకోండి!
Recommended image2
Top 10 Fastest Motorcycles : గంటకు 400 కిమీ.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన టాప్ 10 బైకులు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved