MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Bank Rules : చనిపోయిన వారి ఏటీఎం కార్డు వాడొచ్చా? బ్యాంక్ రూల్స్ ఏం చెబుతున్నాయి?

Bank Rules : చనిపోయిన వారి ఏటీఎం కార్డు వాడొచ్చా? బ్యాంక్ రూల్స్ ఏం చెబుతున్నాయి?

ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి ఏటీఎం కార్డు, నెట్ బ్యాంకింగ్ వంటివి ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ లోంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చా…?  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ఏం చెబుతున్నాయి?

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 02 2026, 06:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
చనిపోయిన వారి ఏటీఎం కార్డు వాడొచ్చా..?
Image Credit : Asianet News

చనిపోయిన వారి ఏటీఎం కార్డు వాడొచ్చా..?

వయసు మీదపడి ఇంట్లోని పెద్దవాళ్లు లేదంటే అనారోగ్యం లేదా ప్రమాదాల బారినపడి కుటుంబసభ్యులు ఎవరైనా చనిపోతే వారి బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు కుటుంబసభ్యులు తీసుకుంటారు. బ్యాంకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏటిఎం లేదా ఇంటర్నెట్ బ్యాకింగ్ ఉపయోగించి అకౌంట్లోని డబ్బులన్ని విత్ డ్రా చేసుకుంటారు. ఇలా చేయడం లీగలా లేక ఇల్లీగలా?  ఈ డౌట్ చాలామందికి ఉంటుంది. దీన్ని ఇప్పుడు నివృత్తి చేసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
బ్యాంకింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి?
Image Credit : X

బ్యాంకింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి?

ఇంట్లోని పెద్దవాళ్లు తమ ఏటీఎం కార్డు, పిన్ నంబర్‌ను కుటుంబ సభ్యులతో పంచుకోవడం సాధారణమే. వాళ్లు బతికున్నంత వరకు ఇది పెద్ద సమస్య కాదు. కానీ ఖాతాదారుడు చనిపోయాక కూడా అదే కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ వాడితే తెలియని చట్టపరమైన చిక్కులు వస్తాయి.

 బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం… ఒక వ్యక్తి చనిపోగానే వారి బ్యాంక్ అకౌంట్ పై హక్కులు మారిపోతాయి. వారి ఏటీఎం కార్డు, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ వాడటం చట్టపరంగా తప్పు అవుతుంది. ఎందుకంటే ఆ ఖాతాలోని డబ్బు కేవలం ఒక్కరికి కాకుండా, చట్టపరమైన వారసులు అందరికీ చెందింది.

34
నామినీ తీసుకోవచ్చా..?
Image Credit : Getty

నామినీ తీసుకోవచ్చా..?

చాలామంది చేసే పొరపాటు 'నేను నామినీ కాబట్టి డబ్బులు తీసుకోవచ్చు' అని అనుకోవడం. కానీ నామినీగా ఉన్నంత మాత్రాన సరిపోదు. ముందుగా బ్యాంకు అధికారులకు ఖాతాదారుడి మరణవార్త తెలిపి అవసరమైన పత్రాలు సమర్పించాలి. ఈ ప్రక్రియ పాటించకుండా ఏటీఎం నుంచి డబ్బు తీస్తే అది చట్టరిత్యా నేరం… దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే అది మోసం కిందకు వస్తుంది.

ఇలాంటి నిబంధనల వెనుక ఉన్న ఉద్దేశం చనిపోయిన వ్యక్తి డబ్బును సురక్షితంగా ఉంచడమే. ఒకే కుటుంబంలో చాలామంది చట్టపరమైన వారసులు ఉండొచ్చు. వారి హక్కులకు భంగం కలగకుండా ఉండేందుకే బ్యాంకులు మరణ ధృవీకరణ పత్రం, నామినీ వివరాలు, ఇతర పత్రాలను పరిశీలించాకే డబ్బును విడుదల చేస్తాయి. ఇది భవిష్యత్తులో కుటుంబ కలహాలను, చట్టపరమైన సమస్యలను నివారిస్తుంది.

44
 చట్టపరమైన చిక్కులు రాకూడదంటే ఏం చేయాలి?
Image Credit : Getty

చట్టపరమైన చిక్కులు రాకూడదంటే ఏం చేయాలి?

కుటుంబంలో ఎవరైనా చనిపోతే బ్యాంక్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో వారి ఏటీఎం లేదా యూపీఐ వాడొద్దు. ముందుగా బ్యాంకుకు రాతపూర్వకంగా సమాచారం ఇచ్చి క్లెయిమ్ ఫారమ్, ఇతర పత్రాలు సమర్పించాలి. సరైన పద్ధతి పాటిస్తే, డబ్బు సురక్షితంగా అందుతుంది, అనవసరమైన చట్టపరమైన చిక్కులు కూడా రావు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Care Tips: హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందా? అసలు నిజమేంటి.. డాక్టర్లు ఏం చెప్తున్నారు?
Recommended image2
మరణం తర్వాత మ‌నిషి శరీరంలో ఏం జరుగుతుంది? మొదట మారేది ఇదే..
Recommended image3
Godavari: గోదావరి నది సముద్రంలో కలిసే చోట కనిపించే అద్భుతం.. ‘అన్నా చెల్లెళ్ల గట్టు’
Related Stories
Recommended image1
Banking: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా.? ఫిబ్ర‌వ‌రి 15 నుంచి మార‌నున్న రూల్స్ తెలుసుకోవాల్సిందే
Recommended image2
Now Playing
HDFC బ్యాంకులో ఉన్న మీ డబ్బు సేఫేనా.? అస‌లు ఏం జ‌రుగుతోంది? | HDFC Bank Crisis | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved