MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Coffee Rave: కాఫీ రేవ్..ఈ మార్నింగ్ రేవ్ పార్టీ గురించి విన్నారా?

Coffee Rave: కాఫీ రేవ్..ఈ మార్నింగ్ రేవ్ పార్టీ గురించి విన్నారా?

Gen Z కారణంగా కొత్త కల్చర్ డైలీ లైఫ్ లోకి వచ్చి చేరుతోంది. ఇప్పుడు మన దేశంలోని మెట్రో నగరాల్లో ట్రెండింగ్ లో ఉన్న కల్చర్.. కాఫీ రేవ్. నేటి యువతలో ఫుల్ క్రేజ్ ఉంది. ఎక్కువమంది ఈ లేటెస్ట్ సంస్కృతిని ఇష్టపడుతున్నారు. అసలు ఈ కాఫీ రేవ్ అంటే ఏంటీ.? 

3 Min read
Author : Asianet News Telugu
| Updated : Jan 08 2026, 01:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ట్రెండ్ మార్చేసిన యూత్
Image Credit : Asianet News

ట్రెండ్ మార్చేసిన యూత్

రాత్రి పార్టీలంటే ఆల్కహాల్, హాంగోవర్, మిడ్ నైట్ వరకూ హంగామా. ఇదే ఇప్పటివరకూ మనకు తెలిసిన పార్టీ సంస్కృతి. కానీ ఇప్పటి Gen Z యువత ఆ ట్రెండ్ ను మార్చేశారు. Alcoholకి గుడ్‌బై చెప్పి, Coffeeని సెలబ్రేట్ చేస్తూ Coffee Rave అనే కొత్త ట్రెండ్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నారు.

ఈ Coffee Rave అంటే ఉదయం లేదా పగటిపూట కాఫీ షాప్‌లలో జరిగే మ్యూజిక్ పార్టీ. ఈ కాఫీ రేవ్ మార్నింగ్ 7 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. మంచి వైబ్ తో మ్యూజిక్ ఉంటుంది. DJ ఉంటుంది. ఇక్కడ ఆల్కహాల్ ఉండదు, హ్యాంగోవర్ ఉండదు. వేలల్లో బిల్స్ ఉండవు, బౌన్సర్స్ ఉండరు. పర్మిషన్లు అక్కర్లేదు. కానీ ఎనర్జీ మాత్రం డబుల్ ఉంటుంది.

25
ఇండియాలో విస్తరిస్తున్న కాఫీ రేవ్
Image Credit : Getty

ఇండియాలో విస్తరిస్తున్న కాఫీ రేవ్

ఈ ట్రెండ్ మొదట యూరప్, అమెరికా దేశాల్లో పాపులర్ కాగా, ఇప్పుడు భారత్‌లోనూ మెల్లగా అడుగుపెడుతోంది. ముఖ్యంగా మెట్రో నగరాల్లోని కాఫీ షాప్‌లు, కో-వర్కింగ్ స్పేస్‌లు ఉదయాన్నే చిన్న DJ సెషన్‌లతో Coffee Rave ఈవెంట్స్ నిర్వహిస్తున్నాయి. కొత్త లైఫ్‌స్టైల్ కు మ్యూజిక్ తోడవడంతో ఈ కాంబినేషన్ యువతను బాగా ఆకట్టుకుంటోంది.

ఇప్పుడు మన దేశంలో నాగపూర్ నుంచి గురుగ్రామ్, సూరత్, హైదరాబాద్, వైజాగ్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని మెట్రో సిటీల్లోకి ఈ కాఫీ రేవ్ కల్చర్ వచ్చి చేరింది. కాఫీ షాప్ లు ఇప్పుడు కల్చరల్ ప్లే గ్రౌండ్స్ గా మారిపోతున్నాయి. దీనికి కారణం లో కాస్ట్, మంచి బిజినెస్ కూడా. కస్టమర్స్ ఎక్కువగా రావడం వల్ల జిమ్ ట్రైనర్స్ కు న్యూ కస్టమర్స్ దొరుకుతారు కూడా. ఆధునిక యువత ఎక్కువ సేపు ఉత్సాహంగా ఉండేందుకు కాఫీ, ఎస్ ప్రెస్సో, బ్లాక్ కాఫీ కోసం కెఫెలకు క్యూ కడుతున్నారు. ఉదయాన్నే ఈ కాఫీ రేవ్ ల వల్ల చిల్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.

Related Articles

Related image1
Bangalore Rave Party : అసలు ఏమిటీ రేవ్ పార్టీ..? ఎలా జరుపుకుంటారు? సినీతారల పనేంటి?
Related image2
banjara hills rave party... డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ఎవ్వరినీ వదలం : వెస్ట్‌జోన్ డీసీపీ
35
సైకాలజీ ఏమంటోంది?
Image Credit : Getty

సైకాలజీ ఏమంటోంది?

సైకాలజిస్టుల ప్రకారం, కాఫీలో ఉండే క్యాఫైన్ తాత్కాలికంగా ఫోకస్, మూడ్‌ను పెంచుతుంది. అదే సమయంలో మ్యూజిక్ డోపమిన్‌ను విడుదల చేయడంతో, ఆల్కహాల్ లేకుండానే మంచి అనుభూతి కలుగుతుంది. అందుకే ఫిట్‌నెస్, మెంటల్ హెల్త్‌పై అవగాహన పెరుగుతున్న యువత Coffee Rave వైపు మొగ్గు చూపుతోంది. ఇంకో విశేషం ఏంటంటే ఈ పార్టీలకు వచ్చే వారు రాత్రి నిద్రను కోల్పోరు. పార్టీ అయిపోయాక ఆఫీస్‌కు వెళ్లడం, వర్క్ చేయడం, డే ప్లాన్ కొనసాగించడం నార్మల్ గానే ఉంటుంది. అందుకే Coffee Rave ను చాలా మంది ప్రొడక్టివ్ పార్టీ కల్చర్ గా చెబుతున్నారు.

45
కాఫీ రేవ్ రావడానికి కారణాలేంటి?
Image Credit : our own

కాఫీ రేవ్ రావడానికి కారణాలేంటి?

హెల్త్ అవేర్‌నెస్ పెరగడం, లైఫ్‌స్టైల్ మార్పు, సోషల్ మీడియా ప్రభావం, గొడవలు ఉండవు. ఆల్కహాల్ వల్ల ఆరోగ్య సమస్యలు, మెంటల్ స్ట్రెస్ పెరుగుతున్నాయనే దానిపై యువతకు అవగాహన పెరిగింది. ఆల్కహాల్‌కు బదులుగా కాఫీ వంటి వాటికి మొగ్గుచూపుతున్నారు. జీవనశైలిలో నైట్ షిఫ్ట్స్, స్క్రీన్ టైమ్, నిద్రలేమి కారణంగా రాత్రి పార్టీలను యువత తగ్గిస్తోంది. ఉదయాన్నే మంచి ఎనర్జీతో రోజును కొనసాగించాలనే ఆలోచన నుంచి ఈ Coffee Rave వచ్చింది. ఇక సోషల్ మీడియా ప్రభావం నేటి యువతపై బాగానే ఉంది. యూరప్, అమెరికాలో వైరల్ అయిన Coffee Rave వీడియోలు సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అయ్యాయి. అదే యువతను ఆకర్షించింది. పబ్ ల్లో ఉండే అల్లరి, గొడవలకన్నా, కాఫీ రేవ్‌లో నెట్‌వర్కింగ్, క్రియేటివ్ థింకింగ్ పై చర్చలు ఎక్కువగా ఉంటాయి.

55
కాఫీ రేవ్ సమాజానికి మంచిదా… చెడ్డదా?
Image Credit : our own

కాఫీ రేవ్ సమాజానికి మంచిదా… చెడ్డదా?

అయితే కాఫీ రేవ్ అనేది అసలు సమాజానికి మంచిదా… చెడ్డదా? అన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పాజిటివ్ చూసుకుంటే ఆల్కహాల్ లేకపోవడం వల్ల ఆరోగ్యానికి తక్కువ నష్టం, హ్యాంగోవర్ లేకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. నిద్రలేమి తగ్గి, రోజువారీ పనులు ప్రభావితం ఉండదు. యువతలో ఫిట్‌నెస్, మెంటల్ హెల్త్ పై అవగాహన పెరుగుతుంది. మరి నష్టాలు చూసుకుంటే ఎక్కువ క్యాఫైన్ తీసుకుంటే ఆందోళన, గుండె దడ వంటి సమస్యలు వస్తాయి. శబ్ద కాలుష్యం వల్ల పరిసరాల్లో ఉండే ఫ్యామిలీస్ కు ఇబ్బంది ఉంటుంది. దీన్ని అదునుగా చూసుకుని వ్యాపారం కమర్షియల్ మారే అవకాశం ఉంది.

యువత మత్తు నుంచి బయటపడుతూ, ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు Coffee Rave ఎంచుకున్నట్లు చూడొచ్చు. అయితే ట్రెండింగ్ అయినా సరే బ్యాలెన్స్‌లో ఉంటేనే బెస్ట్. అయితే ఇప్పుడు రేవ్ పార్టీ అంటే రాత్రికి మాత్రమే పరిమితం కాదు, ఉదయానికి కూడా వర్తిస్తుంది. ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ రేవ్ పార్టీకి వెళ్తా అంటే..మార్నింగ్ వెళ్లావా, రాత్రి వెళ్లావా అనడం మాత్రం మర్చిపోవద్దు.

About the Author

భారత దేశం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Become Rich: ధనవంతులు కావాలనుకునే వారు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి
Recommended image2
అమీర్ పేట అమ్మాయి ఓయోకు వెళితేనే జీవితం మారుతుందా... అసలు ఈ సమాజం ఎటుపోతోంది..?
Recommended image3
Gold Price: పాకిస్తాన్‌లో గ్రాము బంగారం ఎంతో తెలుసా? పాపం అక్కడి ప్రజలు
Related Stories
Recommended image1
Bangalore Rave Party : అసలు ఏమిటీ రేవ్ పార్టీ..? ఎలా జరుపుకుంటారు? సినీతారల పనేంటి?
Recommended image2
banjara hills rave party... డ్రగ్స్ తీసుకున్నట్లు తేలితే ఎవ్వరినీ వదలం : వెస్ట్‌జోన్ డీసీపీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved