MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Feature
  • Frog Rain : కప్పల వర్షం నిజమేనా? అవి ఆకాశంలోంచి పడతాయా? సైన్స్ ఏం చెబుతోంది

Frog Rain : కప్పల వర్షం నిజమేనా? అవి ఆకాశంలోంచి పడతాయా? సైన్స్ ఏం చెబుతోంది

వడగళ్ల వాన మాదిరిగానే కప్పల వర్షం కురుస్తుందా..? అంటే సైన్స్ అవుననే అంటోంది. అసలు మేఘాల్లోకి కప్పలు ఎలా చేరతాయి? ఆకాశంలోంచి కిందకు ఎలా పడతాయి? అనేది తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Aug 05 2026, 04:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కప్పల వర్షం కురుస్తుందా?
Image Credit : Gemini AI

కప్పల వర్షం కురుస్తుందా?

Frog Rains : వర్షాకాలం వచ్చిందంటే చాలు కప్పలు కుప్పలుతెప్పలుగా కనిపిస్తాయి. వాగులు, చెరువుల్లోనే కాదు జనావాసాల్లో కూడా కప్పలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ లో ఇలాగే పసుపుపచ్చగా మెరిసిపోతూ కొన్ని కప్పలు కనిపించాయి. ఈ విచిత్రమైన కప్పలు ఆకాశంలోంచి పడ్డాయనే ప్రచారం మొదలయ్యింది. మరి నిజంగానే వర్షంలో వడగళ్లు పడ్డట్లుగానే కప్పలు కూడా పడతాయా? కప్పల వర్షం నిజమేనా? అనే డౌట్ చాలామందికి ఉంటుంది. మరి నిజమేంటో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కప్పల వర్షం కురవడం నిజమేనా?
Image Credit : AI

కప్పల వర్షం కురవడం నిజమేనా?

ఆకాశం నుంచి కప్పలు వర్షంలా పడటం అనేది అపోహ కాదు, ఇది నిజమే. చరిత్రలో ఇలా కప్పలతో కూడిన వర్షాలు పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. దీని వెనుక సైంటిఫిక్ కారణం 'వాటర్‌స్పాట్' (Waterspout) లేదా నీటి సుడిగాలులు.

సముద్రాలు, చెరువులు లేదా పెద్ద సరస్సుల పైన శక్తివంతమైన సుడిగాలులు ఏర్పడినప్పుడు, అవి నీటితో పాటు అందులో ఉన్న చిన్నచిన్న కప్పలు, చేపలు వంటి జీవులను గాలిలోకి పీల్చుకుంటాయి. ఈ జీవులు మేఘాల వేగంతో పాటు మైళ్ల దూరం ప్రయాణిస్తాయి. గాలివేగం తగ్గగానే వర్షపు చుక్కలతో పాటు నేలపై పడతాయి. గాలిలో పీల్చుకోబడిన కప్పలే కిందకు పడతాయి తప్ప ఆకాశంలో లేదా మేఘాలలో కప్పలు తయారవ్వవు.

34
వర్షం పడగానే కప్పలు ఎక్కడి నుంచి వస్తాయి?
Image Credit : pinterest

వర్షం పడగానే కప్పలు ఎక్కడి నుంచి వస్తాయి?

వర్షం పడకముందు ఒక్క కప్ప కూడా కనిపించదు... కానీ మొదటి వర్షం పడగానే వేలాది కప్పలు బయటకు వస్తాయి. దీనికి కారణం వాటి జీవన శైలిలోని 'సుప్తావస్థ' (Aestivation). అంటే వేసవి కాలంలో తీవ్రమైన ఎండలు, నీటి ఎద్దడిని తట్టుకోవడానికి కప్పలు భూమిలో లోతుగా లేదా తేమ ఉన్న ప్రదేశాల్లో బొరియలు చేసుకుని దాక్కుంటాయి. ఈ సమయంలో అవి తమ శరీర జీవక్రియలను పూర్తిగా తగ్గించుకుని, ఆహారం తీసుకోకుండా నిద్రావస్థలోకి వెళతాయి.

వర్షాకాలం మొదలవగానే మొదటి వర్షపు చుక్కలు పడి నేల తడవగానే, ఆ తేమ, చల్లదనానికి కప్పలు మేల్కొని బయటకు వస్తాయి. ముఖ్యంగా ఇవి సంతానోత్పత్తి కోసమే ఒక్కసారిగా బయటకు వచ్చి శబ్దాలు చేస్తాయి. ఇలా కప్పలన్నీ ఒకేసారి బయటకురావడంతో కప్పల వర్షం కురిసినట్లుగా ఉంటుంది. వర్షపు నీటితోపాటే ఈ కప్పలు జనావాసాల్లోకి కొట్టుకువస్తాయి... వీటిని చూసి ప్రజలు నిజంగానే వర్షపునీటితో పాటే కప్పలు ఆకాశం నుండి పడ్డాయని అనుకుంటారు. కానీ నిజానికి అవి భూమిలోంచి బయటకు వస్తాయి. ఆకాశంలోంచి కప్పలు పడటం చాలా అరుదు.

44
పసుపు పచ్చ కప్పల ప్రత్యేకత ఏమిటి?
Image Credit : Gemini AI

పసుపు పచ్చ కప్పల ప్రత్యేకత ఏమిటి?

వర్షాకాలంలో కనిపించే ప్రకాశవంతమైన పసుపు పచ్చ కప్పలను 'ఇండియన్ బుల్‌ఫ్రాగ్' (Indian Bullfrog) అని పిలుస్తారు. వీటి పసుపు రంగు వెనుక ఒక ప్రత్యేకమైన కారణం ఉంది...వీటికి రంగు మారే నైపుణ్యం ఉంటుంది.

సాధారణ రోజుల్లో ఈ కప్పలు గోధుమ లేదా ముదురు పచ్చ రంగులో ఉంటాయి. కానీ వర్షకాలంలో ప్రత్యుత్పత్తి సమయంలో మగ కప్పలు మాత్రమే తమ శరీరాన్ని ప్రకాశవంతమైన పసుపు రంగులోకి మార్చుకుంటాయి. ఈ పసుపు వర్ణంతో పాటు మగ కప్పల గొంతు వద్ద ఉండే శబ్ద కోశాలు (Vocal sacs) నీలి రంగులోకి మారతాయి.ఆడ కప్పలను ఆకర్షించడానికి, ఇతర మగ కప్పలకు తమ ఆధిపత్యాన్ని చూపడానికి ఈ రంగుల మార్పు ఉపయోగపడుతుంది. జతకట్టే ప్రక్రియ పూర్తికాగానే ఇవి మళ్లీ తమ సాధారణ గోధుమ రంగులోకి మారిపోతాయి.

ప్రకృతిలో జరిగే ఈ వింతల వెనుక మూఢనమ్మకాలు కాకుండా సంపూర్ణ శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. వర్షకాలంలో జీవవైవిధ్యంలో భాగమైన ఈ కప్పలు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో, క్రిమి కీటకాలను అదుపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే కప్పలను మనుషులకు హితకాారిగా పేర్కొంటారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Facts : వాటర్ బాటిల్‌పై అడ్డంగా గీతలుంటాయి కదా.. ఎందుకో తెలుసా?
Recommended image2
IRCTC Ultimate Ooty Tour: బడ్జెట్‌లో హైదరాబాద్ నుంచి ఊటీ, కూనూర్ ట్రిప్.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Recommended image3
River : వేల కిలోమీటర్లు ప్రయాణించి... సముద్రంలో కలవక ముందే కనుమరుగయ్యే నది ఏది?
Related Stories
Recommended image1
Snake : విషం లేని పాములు కూడా ప్రాణాలు తీయగలవు.. ఎలాగో తెలుసా?
Recommended image2
Rain Facts : వర్షాన్ని ఎలా కొలుస్తారు? మిల్లీమీటర్, సెంటీమీటర్ వర్షం అంటే ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved