Snake : ఈ 5 సంకేతాలు కనిపించాయో.. మీ ఇంట్లో పాములు ఉన్నట్లే.. తస్మాత్ జాగ్రత్త..!
ఎండలు మండిపోతున్నాయి కదా. వేడికి తట్టుకోలేక పాములు చల్లని ప్రదేశాల కోసం వెతుకుతూ ఇళ్లలోకి వస్తుంటాయి. పాము కనిపించకపోయినా, అది ఇంట్లో దాక్కుందని కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇంట్లో పాములుంటే ఈజీగా గుర్తించండిలా..
ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది… తెలుగు రాష్ట్రాల్లో 40-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రోజుల్లో వేసవి తాపం మరింత పెరగనుంది. ఈ ఎండలు, ఉక్కపోత కేవలం మనుషులనే కాదు జంతువులను కూడా తీవ్ర ఇబ్బందిపెడుతుంది. అందుకే అవికూడా ఎండలనుండి ఉపశమనం పొందేందుకు చల్లని ప్రాంతాలను వెతుక్కుంటాయి. ఈ క్రమంలో ప్రమాదకరమైన పాములు కూడా బొరియల్లోంచి బయటకు వచ్చి ఇళ్లలోకి చేరుకుంటాయి.
అయితే పాములు ఇళ్లలోకి చేరినా కొన్నిసార్లు మనం గుర్తించలేం. అవి రహస్యంగా దాక్కుంటాయి. ఇలాంటి సమయంలో కొన్ని సంకేతాల ద్వారా ఇళ్లలో పాములను గుర్తించవచ్చు. ఇలా మీ ఇంట్లో పాము ఉందో లేదో ఈ 5 ముఖ్యమైన సంకేతాల ద్వారా తెలుసుకొండి.
1. పాము కుబుసం
పాములు పెరిగే కొద్దీ తమ పాత చర్మాన్ని (కుబుసం) వదిలేస్తాయి. మీ ఇంటి టెర్రస్, స్టోర్ రూమ్ లేదా మెట్ల కింద పాము కుబుసం కనిపిస్తే, దగ్గర్లోనే పాము ఉందని అర్థం. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి… ఇంట్లోనివారిని అలర్ట్ చేయండి. వెంటనే పామును గుర్తించేందుకు చర్యలు తీసుకొండి.
2. వింత వాసన
3. నేలపై 'S' ఆకారం చాారలు
దుమ్ము, ధూళి ఉన్న నేలపై పాము పాకితే 'S' ఆకారంలో వంకర గుర్తులు ఏర్పడతాయి. మీ ఇంటి నేలపై ఉన్న దుమ్ములో ఇలాంటి గీతలు కనిపిస్తే, పాము అటువైపుగా వెళ్లిందని అర్థం. అలాంటి ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి.
4. ఎలుకలు కనిపించకుంటే..
మీ ఇంట్లోని ఎలుకలు, బల్లులు ఉన్నట్టుండి కనిపించకుండా పోతే అది ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే పాములు వాటిని వేటాడతాయి. ఎలుకల సంఖ్య తగ్గితే, పాము వాటిని తినేసిందని అనుమానించాలి.
5. పాముల శబ్దం...
పాములు కదిలేటప్పుడు ఎండు ఆకులపై పాకినట్లు సరసరమనే శబ్దం వస్తుంది. అంతేకాదు ప్రమాదం అనిపిస్తే పాములు గట్టిగా బుసలు కొడతాయి. ఇలాంటి శబ్దాలు వినిపిస్తే వెంటనే అప్రమత్తంగా ఉండండి.
సాధారణంగా పాములు నేరుగా దాడి చేయవు. కానీ పొరపాటున వాటిపై కాలు వేసినా, వాటికి హాని తలపెట్టినా దాడి చేస్తాయి. అందుకే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే స్నేక్ క్యాచర్లను సంప్రదించడం మంచిది.

