Telugu

Snake Prevention: ఇదొక్కటి ఉంటే పాములు జన్మలో మీ ఇంట్లోకి రావు

Telugu

ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తప్పనిసరి

ఇంట్లోకి పాములు రాకుండా ఉండాలంటే ఈ 7 జాగ్రత్తలు తప్పనిసరి. కాస్త ఏమరుపాటు ఉన్నా అపాయం తప్పదు. అందుకే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే పాముల భయమే ఉండదు.

Image credits: Getty
Telugu

పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి

మీ ఇంటి చుట్టూ చెత్తాచెదారం, ఎండిన ఆకులు, పనికిరాని వస్తువులు, కట్టెల కుప్పలు లేకుండా చూసుకోండి. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే పాములు వచ్చేస్తాయి.

Image credits: social media
Telugu

కన్నాలు, బొరియలు మూసేయండి

ఇంటి చుట్టూ ఉండే ఎలుకల కన్నాలను పాములు తమ నివాసంగా మార్చుకుంటాయి. కాబట్టి, అలాంటి కన్నాలు, బొరియలు కనిపిస్తే వెంటనే వాటిని మూసేయండి.
Image credits: social media
Telugu

మొక్కల మధ్య తరచూ తనిఖీ చేయండి

మొక్కల పొదల్లో పాములు దాక్కునే అవకాశం చాలా ఎక్కువ. అందుకే, వాటిని తరచూ తనిఖీ చేయాలి. బాగా గుబురుగా పెరిగిన మొక్కలను ఎప్పటికప్పుడు కత్తిరించాలి. పొదలు లేకుండా చూసుకోవాలి.

Image credits: pexels
Telugu

నాఫ్తలీన్ గోళీలు వాడండి

మీ ఇంటి పరిసరాల్లో పాములు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో నాఫ్తలీన్ గోళీలు వేయడం మంచిది. వాటి ఘాడమైన వాసనకు పాములు దూరంగా ఉంటాయి.

Image credits: Getty
Telugu

తలుపుల కింద ఖాళీలు లేకుండా చూడండి

ఎయిర్‌హోల్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ల వద్ద నెట్ బిగించండి. ముఖ్యంగా, ఇంటి ప్రధాన ద్వారం, బాత్రూమ్ తలుపుల కింద ఎలాంటి ఖాళీలు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.
Image credits: Getty
Telugu

పగుళ్లు, సందులు లేకుండా చూసుకోండి

ఇంటి ఆవరణలోని ఇంటర్‌లాక్ టైల్స్ మధ్య లేదా కాంపౌండ్ వాల్, కాంక్రీట్ ఫ్లోరింగ్ మధ్య పగుళ్లు, సందులు లేకుండా జాగ్రత్తపడండి. వాటిని వెంటనే సిమెంట్‌తో పూడ్చండి.
Image credits: Getty

Black Bangles: నల్లరంగులో అందమైన లేటెస్ట్ డిజైన్ గాజులు

Beauty Tips: రాత్రి పడుకునేముుందు ఇదొక్కటి రాసినా ముఖం మెరిసిపోతది

Kitchen Hacks: కిచెన్‌లో బ్యాడ్ స్మెల్‍ పోగొట్టే సింపుల్ టిప్స్ ఇవిగో!

Zig Zag Bangles: చేతులకు ట్రెండీ లుక్ ఇచ్చే జిగ్ జాగ్ గాజులు