MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • Facts: సూర్యుడి అస‌లు రంగు ఏంటి.? మ‌న‌కు ఆరెంజ్ క‌ల‌ర్‌లో ఎందుకు క‌నిపిస్తుంది.?

Facts: సూర్యుడి అస‌లు రంగు ఏంటి.? మ‌న‌కు ఆరెంజ్ క‌ల‌ర్‌లో ఎందుకు క‌నిపిస్తుంది.?

Facts: సూర్యుడు ఏ రంగులో ఉంటాడు అన‌గానే ఠ‌క్కున పసుపు లేదా ఆరెంజ్ అని చెప్తాం. అయితే నిజానికి సూర్యుడి అసలు రంగు తెలుపు అని మీకు తెలుసా? అంతరిక్షం నుంచి చూస్తే సూర్యుడు పాలలాంటి తెల్లటి కాంతితో క‌నిపిస్తుంది. ఇంత‌కీ సూర్యుడి రంగులో ఉన్న మాయ ఏంటంటే.? 

2 Min read
Author : Narender Vaitla
Published : May 13 2026, 08:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సూర్యకాంతిలో అన్ని రంగులూ ఉంటాయి
Image Credit : Gemini AI

సూర్యకాంతిలో అన్ని రంగులూ ఉంటాయి

సూర్యుడు మన కళ్లకు పసుపు లేదా ఆరెంజ్ క‌ల‌ర్‌లో కనిపించడం వెనక కారణం భూమి చుట్టూ ఉన్న వాతావరణం. గాలి, ధూళి, వాయు కణాలు సూర్యకాంతిని మార్చి మనకు వేరే రంగులో చూపిస్తాయి. సూర్యుడి నుంచి వచ్చే కాంతి ఒక్క రంగు కాదు. అందులో ఇంద్రధనుస్సులో కనిపించే ఏడు రంగులూ కలిసే ఉంటాయి. ఈ రంగులన్నీ కలిసి బయటకు వచ్చినప్పుడు అది తెల్లటి కాంతిలా కనిపిస్తుంది. అందుకే అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన ఫొటోలు లేదా చంద్రుడి నుంచి చూసిన దృశ్యాల్లో సూర్యుడు పూర్తిగా తెల్లగా కనిపిస్తాడు. అక్కడ భూమిలా వాతావరణం లేకపోవడంతో కాంతి తన అసలు రూపంలోనే ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
భూమి వాతావరణం వల్లే సూర్యుడు పసుపుగా కనిపిస్తాడు
Image Credit : Getty

భూమి వాతావరణం వల్లే సూర్యుడు పసుపుగా కనిపిస్తాడు

సూర్యకాంతి భూమి వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు గాలి, ధూళి, వాయు కణాలను తాకుతుంది. దీంతో కాంతి అన్ని దిశల్లో వ్యాపిస్తుంది. ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు “స్కాటరింగ్” లేదా “ప్రకీర్ణనం” అంటారు. నీలం, ఊదా రంగుల కాంతి తరంగదైర్ఘ్యం చాలా చిన్నగా ఉంటుంది. అందుకే అవి ఎక్కువగా చెల్లాచెదురవుతాయి. ఈ కారణంగానే ఆకాశం మనకు నీలంగా కనిపిస్తుంది. మిగిలిన కాంతి పసుపు రంగు వైపు ఉండటంతో సూర్యుడు కూడా పసుపు రంగులో కనిపిస్తాడు.

34
ఉదయం, సాయంత్రం సూర్యుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడు?
Image Credit : Getty

ఉదయం, సాయంత్రం సూర్యుడు ఎర్రగా ఎందుకు కనిపిస్తాడు?

సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో సూర్యుడు ఎరుపు లేదా థిక్ ఆరెంజ్ క‌ల‌ర్‌లో కనిపిస్తాడు. దీనికి కూడా కారణం వాతావరణమే. ఆ సమయంలో సూర్యుడు భూమికి అంచున ఉన్నట్టుగా కనిపిస్తాడు. కాబట్టి సూర్యకాంతి మన కళ్లకు చేరేందుకు ఎక్కువ దూరం ప్రయాణించాలి. ఈ ప్రయాణంలో నీలం, ఆకుపచ్చ వంటి చిన్న తరంగదైర్ఘ్య కాంతి పూర్తిగా చెల్లాచెదురవుతుంది. చివరకు ఎరుపు, నారింజ రంగుల కాంతి మాత్రమే మనకు చేరుతుంది. అందుకే ఉదయం, సాయంత్రం సూర్యుడు ఎర్రగా కనిపిస్తాడు.

44
సూర్యుడి తెల్లటి కాంతి వెనక ఉన్న అసలు శక్తి
Image Credit : Gemini

సూర్యుడి తెల్లటి కాంతి వెనక ఉన్న అసలు శక్తి

సూర్యుడి లోపల నిరంతరం అణు సంయోగ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. హైడ్రోజన్ అణువులు కలిసిపోయి హీలియంగా మారుతాయి. ఈ ప్రక్రియలో భారీగా శక్తి, కాంతి విడుదలవుతుంది. సూర్యుడి ఉపరితల ఉష్ణోగ్రత సుమారు 5500 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. ఈ తీవ్రమైన వేడి, కాంతి వల్లే సూర్యుడు అంత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. అంతరిక్షంలో ఈ కాంతి స్వచ్ఛంగా ప్రయాణిస్తుంటే, భూమి వాతావరణంలోకి వచ్చిన తర్వాత మాత్రం రంగు మారినట్టు మనకు కనిపిస్తుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Idli History : ఇడ్లీ ఇండియన్ టిఫిన్ కాదా..! ఏ దేశం నుండి వచ్చిందో తెలుసా?
Recommended image2
Worlds Oldest Bank: వరల్డ్స్ ఓల్డెస్ట్ బ్యాంక్.. ప్రపంచ యుద్ధాలను సైతం తట్టుకుని ఎలా నిలబడింది?
Recommended image3
Indian Food: 1960లలో మన తాతలు ఎలాంటి ఆహారం కొనుక్కుని తినేవారో తెలుసా?
Related Stories
Recommended image1
Ceiling Fan: క‌రెంట్ లేక‌పోయినా న‌డిచే సీలింగ్ ఫ్యాన్.. ఇంతకీ ఫ్యాన్ ఎలా పనిచేస్తుందంటే.?
Recommended image2
Hyderabad: రూ. 530 కోట్ల‌తో మెగా ప్రాజెక్ట్‌.. హైద‌రాబాదీలకు ట్రాఫిక్ క‌ష్టాల నుంచి విముక్తి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved