MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • ఒకే రైల్వే స్టేషన్.. రెండు రాష్ట్రాలు.. ఒక బెంచ్‌పై కూర్చుంటే ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నట్టే!

ఒకే రైల్వే స్టేషన్.. రెండు రాష్ట్రాలు.. ఒక బెంచ్‌పై కూర్చుంటే ఇద్దరూ వేర్వేరు రాష్ట్రాల్లో ఉన్నట్టే!

Facts: దేశంలో ఎన్నో ప్రత్యేకతలు కలిగిన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అలాంటి వాటిలో నవాపూర్ రైల్వే స్టేషన్ ఒక‌టి. ఈ స్టేషన్ ఒకే సమయంలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఉంటుంది. కొన్ని అడుగులు నడిస్తే ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలోకి వెళ్లిపోవచ్చు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jul 04 2026, 03:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఒక బెంచ్.. రెండు రాష్ట్రాలు
Image Credit : tripoto.com

ఒక బెంచ్.. రెండు రాష్ట్రాలు

నవాపూర్ రైల్వే స్టేషన్‌లో ఉన్న ఒక బెంచ్ ఈ స్టేషన్‌కు ప్రధాన ఆకర్షణ. ఆ బెంచ్ మధ్యలోనే మహారాష్ట్ర-గుజరాత్ రాష్ట్రాల సరిహద్దు వెళ్తుంది. బెంచ్ ఒక వైపున మ‌హారాష్ట్ర‌, మ‌రోవైపు గుజ‌రాత్ అని రాసి ఉంటుంది. దీంతో ఇద్దరు వ్యక్తులు ఒకే బెంచ్‌పై పక్కపక్కనే కూర్చున్నా.. ఒకరు మహారాష్ట్రలో, మరొకరు గుజరాత్‌లో ఉన్నట్లుగా భావిస్తారు. ఈ అరుదైన అనుభవాన్ని చూసేందుకు చాలామంది ప్రయాణికులు ప్రత్యేకంగా ఈ స్టేషన్‌ను సందర్శిస్తుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
స్టేషన్‌లోని సౌకర్యాలు రెండు రాష్ట్రాల్లో విభజన
Image Credit : tripoto.com

స్టేషన్‌లోని సౌకర్యాలు రెండు రాష్ట్రాల్లో విభజన

ఈ రైల్వే స్టేషన్‌లోని అన్ని విభాగాలు ఒకే రాష్ట్రంలో లేవు. టికెట్ కౌంటర్, రైల్వే పోలీస్ స్టేషన్ మహారాష్ట్రలోని నందుర్బార్ జిల్లా పరిధిలో ఉన్నాయి. అదే సమయంలో వెయిటింగ్ హాల్, మరుగుదొడ్లు, స్టేషన్ మాస్టర్ కార్యాలయం మాత్రం గుజరాత్‌లోని తాపీ జిల్లా పరిధిలో ఉన్నాయి. అందువల్ల ఒకే స్టేషన్‌లో పనిచేసే ఉద్యోగులు, ప్రయాణికులు రెండు రాష్ట్రాల పరిధిలోని ప్రాంతాలను ఉపయోగిస్తుంటారు.

Related Articles

Related image1
Egg Boiler: గుడ్లు ఉడ‌క‌బెట్ట‌డం ఎంతో సులువు.. ఆటో క‌ట్ఆఫ్‌తో ప‌నిచేసే స్మార్ట్ ఎగ్ బాయిల‌ర్
Related image2
పాత బట్టలకు కొత్త‌ పాత్రలు ఇచ్చేవారు డబ్బులు ఎలా సంపాదిస్తారో తెలుసా.? దీని వెన‌కాల ఏం అస‌లేం జ‌రుగుతుందంటే.
34
రెండు రాష్ట్రాల నిబంధనలు కూడా..
Image Credit : tripoto.com

రెండు రాష్ట్రాల నిబంధనలు కూడా..

ఈ స్టేషన్‌లో మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. రెండు రాష్ట్రాల చట్టాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని నిబంధనలు అమలు చేస్తారు. గుజరాత్‌లో ఆల్కహాల్ నిషేధం అమల్లో ఉండటంతో స్టేషన్ పరిసరాల్లో ఆల్కహాల్ వినియోగాన్ని అనుమతించరు. మరోవైపు మహారాష్ట్రలో గుట్కా, పాన్ మసాలాపై పరిమితులు ఉండటంతో వాటి వినియోగంపైనా జాగ్రత్తలు తీసుకుంటారు. రెండు రాష్ట్రాల నిబంధనలను గౌరవించేలా స్టేషన్ నిర్వహణ ఉంటుంది. అలాగే ప్రయాణికుల సౌకర్యం కోసం స్టేషన్‌లో ప్రకటనలను హిందీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో వినిపిస్తారు. దీంతో రెండు రాష్ట్రాల ప్రజలు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించగలుగుతున్నారు.

44
సోషల్ మీడియాలో వైరల్..
Image Credit : tripoto.com

సోషల్ మీడియాలో వైరల్..

నవాపూర్ రైల్వే స్టేషన్ ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఒకే స్టేషన్ రెండు రాష్ట్రాల్లో ఉండటం, ఒక బెంచ్ రెండు రాష్ట్రాలను కలపడం వంటి విశేషాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. నవాపూర్ స్టేషన్ మొత్తం సుమారు 800 మీటర్ల పొడవు ఉంటుంది. అందులో దాదాపు 500 మీటర్లు గుజరాత్‌లో, మిగిలిన 300 మీటర్లు మహారాష్ట్రలో ఉన్నాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
First Bhrat mata Painting: మొదటిసారి గీసిన భారతమాత పెయింటింగ్ ఎలా ఉండేదో తెలుసా?
Recommended image2
Beard Hygiene : గడ్డం పెంచడం మంచిదా, కాదా? సైన్స్ ఏం చెబుతోంది?
Recommended image3
Inspiring Story : ఇడ్లీ, దోసె పిండితో రూ.4000 కోట్ల వ్యాపారం.. ఆరో తరగతి ఫెయిలైన ఓ కుర్రాడి సక్సెస్ స్టోరీ
Related Stories
Recommended image1
Egg Boiler: గుడ్లు ఉడ‌క‌బెట్ట‌డం ఎంతో సులువు.. ఆటో క‌ట్ఆఫ్‌తో ప‌నిచేసే స్మార్ట్ ఎగ్ బాయిల‌ర్
Recommended image2
పాత బట్టలకు కొత్త‌ పాత్రలు ఇచ్చేవారు డబ్బులు ఎలా సంపాదిస్తారో తెలుసా.? దీని వెన‌కాల ఏం అస‌లేం జ‌రుగుతుందంటే.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved