MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Feature
  • Hill Stations: ఈ 5 హిల్ స్టేషన్లకు పొరపాటున కూడా వెళ్లొద్దు.. వెరీ డేంజరస్

Hill Stations: ఈ 5 హిల్ స్టేషన్లకు పొరపాటున కూడా వెళ్లొద్దు.. వెరీ డేంజరస్

Hill Stations: కొండల్లో, లోయల్లో  ట్రిప్ కు వెళితే ఎంతో ఆనందంగా ఉంటుంది. కానీ, కొన్ని హిల్ స్టేషన్లు చూడటానికి ఎంత అందంగా ఉంటాయో, అంతే ప్రమాదకరం కూడా. అలాంటి హిల్ స్టేషన్ల వివరాలు ఇక్కడ ఇచ్చాము.

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 12 2026, 07:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రోహ్‌తాంగ్ పాస్
Image Credit : freepik

రోహ్‌తాంగ్ పాస్

 హిమాచల్ ప్రదేశ్ మనాలికి సమీపంలో ఉంటుంది రోహ్‌తాంగ్ పాస్. ఇది మంచుతో నిండి ఉంటుంది. ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. కానీ పెళ్లయిన జంటలు మాత్రం ఈ ప్రదేశానికి వెళ్లే ముందు ఆలోచించుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొండల అంచులకు వెళ్లడం ఏమాత్రం మంచిది కాదు. ఈ మంచకొండపై అకస్మాత్తుగా మంచు తుఫానులు (Avalanche), కొండచరియలు విరిగిపడుతూ ఉంటాయి.  ఇది చాలా ఎత్తులో ఉండటం వల్ల ఆక్సిజన్ కొరత ఏర్పడవచ్చు. రోడ్లు అకస్మాత్తుగా మూసుకుపోతే చాలా రోజుల పాటు అక్కడే చిక్కుకుపోవాల్సి రావచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
లాచెన్,  లాచుంగ్..  సిక్కిం
Image Credit : Getty

లాచెన్, లాచుంగ్.. సిక్కిం

 సిక్కిం రాష్ట్రంలోని ఉత్తర సిక్కింలోని ఈ రెండు హిల్ స్టేషన్లు ఉంటాయి. చూసేందుకు ఇవి రెండు ఎంతో అందంగా ఉంటాయి. కానీ ఇక్కడి వాతావరణం క్షణాల్లో మారిపోతుంది. భారీ వర్షాల వల్ల ఇక్కడి రోడ్లు పూర్తిగా పాడైపోతాయి. కొండచరియలు ఎప్పుడు విరిగిపడతాయో చెప్పడం కష్టం. ఇరుకైన రోడ్లు, ఆకస్మిక వరదల కారణంగా, అత్యవసర వైద్య సహాయం పొందడం కూడా అసాధ్యం.

35
ఖజ్జియార్, హిమాచల్ ప్రదేశ్
Image Credit : lakshpuri Instagram

ఖజ్జియార్, హిమాచల్ ప్రదేశ్

హిమాచల్ ప్రదేశ్ లోని   ఖజ్జియార్ ప్రాంతాన్ని 'భారతదేశపు మినీ స్విట్జర్లాండ్' అని పిలుస్తారు, ఇది శీతాకాలంలో స్వర్గంలా కనిపిస్తుంది. కానీ ఈ సీజన్‌లో ఆ ప్రాంతానికి వెళ్లడం చాలా ప్రమాదకరం.  చలికాలంలో ఇక్కడి ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోతాయి కాబట్టి కొంతమందికి ఇక్కడ ఊపిరిపీల్చుకోవడం కూడా కష్టంగా అనిపిస్తుంది. భారీ హిమపాతాలు వచ్చాయంటే అక్కడ్నించి బయటికి రావడం కష్టంగా ఉంటుంది. దీని వల్ల కరెంట్, నీటి సరఫరా నిలిచిపోతుంది. రోడ్లు పూర్తిగా మూసుకుపోతూ ఉంటాయి. 

45
కాలింపాంగ్, పశ్చిమ బెంగాల్
Image Credit : @TAPASDAS21/X

కాలింపాంగ్, పశ్చిమ బెంగాల్

పశ్చిమ బెంగాల్  లోని డార్జిలింగ్‌కు సమీపంలో ఉంటుంది కాలింపాంగ్.  ఇది ప్రశాంతమైన హిల్ స్టేషన్. వర్షాకాలంలో మాత్రం ఈ ప్రాంతానికి వెళ్లకూడదు, చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. వానాకాలంలో తీస్తా నది అధిక వేగంతో ప్రవాహిస్తుంది. దీనివల్ల  కొండ రోడ్లు జారుడుగా మారతాయి. వర్షాకాలంలో కొండచరియలు విరిగిపడుతూ ఉంటాయి.  అలా జరిగితే ఈ ప్రాంతానికి చాలా రోజుల పాటు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి.

55
లేహ్-లడఖ్
Image Credit : our own

లేహ్-లడఖ్

జమ్మూ కాశ్మీర్  వెళ్లాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అక్కడ చూడాల్సిన ప్రాంతాల్లో లడఖ్ ఒకటి. ఇక్కడికి వెళ్లిన కొంతమందికి 'అక్యూట్ మౌంటైన్ సిక్‌నెస్' (AMS) సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉంటాయి కాబట్టి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తల తిరగడం, తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ప్రయాణం
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd : పాలను గడ్డకట్టించి పెరుగుగా మార్చేది ఓ బ్యాక్టీరియానా? పెరుగుకు పుల్లటి రుచి ఎలా వస్తుంది?
Recommended image2
Unique Temples : దేవుళ్లకు నైవేద్యంగా మందు, మటన్, చేపలు.. భక్తులకూ ఇవే ప్రసాదం.. ఎక్కడో తెలుసా?
Recommended image3
Telugu Saying: లోకువ మొగుడికి నూకల జావ! ఈ సామెత అసలు అర్థం ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Motivational story: మొదట టెంపో డ్రైవర్... ఇప్పుడు సొంత విమాన సంస్థ నడిపిస్తున్న సక్సెస్ మ్యాన్
Recommended image2
Gold in Ocean: సముద్రంలో ఎంత బంగారం ఉందో తెలుసా? ఆ బంగారాన్ని ఎందుకు వెలికితీయడం లేదు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved