MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Feature
  • Gold in Ocean: సముద్రంలో ఎంత బంగారం ఉందో తెలుసా? ఆ బంగారాన్ని ఎందుకు వెలికితీయడం లేదు?

Gold in Ocean: సముద్రంలో ఎంత బంగారం ఉందో తెలుసా? ఆ బంగారాన్ని ఎందుకు వెలికితీయడం లేదు?

Gold in Ocean: మన భూమి మీదే కాదు.. సముద్రంలో కూడా బంగారం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సముద్రంలో ఎంత బంగారం ఉందో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ బంగారాన్ని ఎందుకు బయటికి తీయడం లేదు? 

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 09 2026, 12:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సముద్రంలో బంగారం
Image Credit : Chat gpt

సముద్రంలో బంగారం

సముద్రం అంటే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది అందమైన బీచ్, ఎగసిపడుతున్న అలలు, చేపలు గుర్తొస్తాయి. కానీ మన కంటికి కనిపించకుండా కిలోల కొద్దీ బంగారం కూడా ఆ సముద్రంలో దాగి ఉంది. ప్రపంచంలోని అన్ని సముద్రాల్లో సుమారు 2 కోట్ల టన్నుల బంగారం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేసి చెబుతున్నారు. మరి ఆ బంగారాన్ని బయటికి తీస్తే సరిపోతుంది కదా.. అనే సందేహం వస్తుంది. కానీ అలా బంగారం తీయడం అంత సులువు కాదు. సముద్రంలో ఉన్న బంగారం ఘన రూపంలో అంటే ముక్కల రూపంలో ఉండదు. అది సముద్ర నీటిలో చాలా చిన్న చిన్న కణాలుగా కరిగిపోయి ఉంటుంది. అందుకే దాన్ని బయటకు తీయడం అంత సులువు కాదు. ఆ బంగారాన్ని తీయడం ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాలేదు. ఒక లీటర్ సముద్ర నీటిలో ఉండే బంగారం పరిమాణం చాలా స్వల్పంగా ఉంటుంది. కంటికి కనిపించని స్థాయిలో ఉండే ఈ బంగారాన్ని వేరు చేయాలంటే గ్యాలన్ల కొద్ది నీటిని శుద్ధి చేయాలి. దాని కోసం భారీ యంత్రాలు, అధునాతన సాంకేతికత, వేల కోట్ల రూపాయలు అవసరం అవుతుంది. అందుకే సముద్రంలో బంగారం ఉన్నా దాన్ని అలాగే వదిలేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
బంగారాన్ని ఎందుకు తీయడం లేదు?
Image Credit : Getty

బంగారాన్ని ఎందుకు తీయడం లేదు?

ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం కూడా ఆధునికంగా ఉంది. అయినా కూడా ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లేకుండా పోయంది. సముద్రం నుంచి బంగారం తీయాలంటే... ఆ బంగారం విలువ కన్నా ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అంటే ఖర్చు ఎక్కువ.. వచ్చే లాభం చాలా తక్కువ. అందుకే ఏ దేశం కూడా సముద్రంలోని బంగారాన్ని వెలికితీసే ప్రయత్నం చేయడం లేదు. అలాగే సముద్రంలోంచి బంగారం తీసే ప్రక్రియ మొదలుపెడితే సముద్ర జీవులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. కోట్ల లీటర్ల సముద్ర నీటిని శుద్ధి చేయడం వల్ల చేపలు, పగడపు దిబ్బలు, సముద్ర మొక్కలు వంటి జీవ వ్యవస్థకు నష్టం కలుగుతుంది. దుకే శాస్త్రవేత్తలు కేవలం బంగారం కోసం ప్రకృతిని ప్రమాదంలోకి నెట్టకూడదని చెబుతున్నారు. అయితే తక్కువ ఖర్చుతో పర్యావరణానికి హాని కలగకుండా బంగారాన్ని వేరు చేసే కొత్త పద్ధతులపై పరిశోధనలు జరుగుతున్నాయి.

Related Articles

Related image1
Diamond Rain: అక్కడ నీళ్లు కాదు, చిన్న చిన్న వజ్రాలు వానలా కురుస్తాయి.. ఎక్కడో తెలుసా?
Related image2
SBI Manager Salary: ఎస్‌బీఐ మేనేజర్ జీతం ఎంత? అన్ని కటింగ్స్ తరువాత చేతికొచ్చేది ఎంత?
33
శాస్త్రవేత్తలకే సవాలు
Image Credit : Getty

శాస్త్రవేత్తలకే సవాలు

సాంకేతికత బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా సముద్రం నుంచి బంగారం ఎలా తీయాలో తెలియక శాస్త్రవేత్తలు తలలు పట్టుకుంటున్నారు. కొత్త యంత్రాలు, కొత్త శాస్త్రీయ పద్ధతులు అందుబాటులోకి వస్తే సముద్ర నీటిలోని బంగారాన్ని సులభంగా వేరు చేయవచ్చు. ప్రస్తుతం మాత్రం అది సాధ్యం కాలేదు. అందుకే ప్రపంచంలోని సముద్రాల్లో కోట్ల టన్నుల బంగారం ఉన్నప్పటికీ, అది మనకు ఉపయోగపడడం లేదు. భూమిపై ఉన్న బంగారు గనుల నుంచి బంగారం తీయడం సులువగా ఉన్నప్పటికీ సముద్రం నుంచి మాత్రం తీయలేకపోతున్నాము. సముద్రంలోని బంగారం మాత్రం శాస్త్రవేత్తలకు పెద్ద సవాలుగానే మిగిలిపోయింది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
బంగారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Science Facts: 12 ఏళ్ల వయసులో అబ్బాయిలుగా మారే అమ్మాయిలు.. విచిత్ర గ్రామం ఇది !
Recommended image2
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ లీక్ కాకుండా ఉండాలంటే.. ఈ 3 సెట్టింగ్స్ ఆన్ చేయండి
Recommended image3
న‌మ్మ‌క ద్రోహం మ‌హా పాపం.. త‌ప్పు చేసి త‌ప్పించుకోవ‌డం అసాధ్యమ‌ని చెప్పే క‌థ
Related Stories
Recommended image1
Diamond Rain: అక్కడ నీళ్లు కాదు, చిన్న చిన్న వజ్రాలు వానలా కురుస్తాయి.. ఎక్కడో తెలుసా?
Recommended image2
SBI Manager Salary: ఎస్‌బీఐ మేనేజర్ జీతం ఎంత? అన్ని కటింగ్స్ తరువాత చేతికొచ్చేది ఎంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved