MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Human Brain: ఒకరోజులో మన మెదడు ఎన్ని వేల ఆలోచనలు చేస్తుందో తెలుసా? మెదడు గురించి షాకింగ్ నిజాలు ఇవిగో

Human Brain: ఒకరోజులో మన మెదడు ఎన్ని వేల ఆలోచనలు చేస్తుందో తెలుసా? మెదడు గురించి షాకింగ్ నిజాలు ఇవిగో

Human Brain: మనిషి శరీరంలో మెదడు ఎంతో ముఖ్యమైనది. మెదడు చెప్పినట్టే శరీరం వింటుంది. మెదడు నిరంతరాయంగా పనిచేస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం ఆలోచిస్తూనే ఉంటుంది. మెదడు గురించి కొన్ని షాకింగ్ విషయాలను ఇక్కడ ఇచ్చాము. 

1 Min read
Author : Haritha Chappa
Published : Jun 25 2026, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మెదడు గురించి షాకింగ్ నిజాలు
Image Credit : Chat gpt

మెదడు గురించి షాకింగ్ నిజాలు

మానవ శరీరంలోని మెదడు అత్యంత ముఖ్యమైనది. అదే సమయంలో అత్యంత శక్తివంతమైనది మెదడు. మనం మాట్లాడటం, ఆలోచించడం, గుర్తుంచుకోవడం, కలలు కనడం.. ఇలా అన్నీ ఈ బ్రెయిన్ కంట్రోల్‌లోనే ఉంటాయి. దీని గురించి చాలామందికి తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. మెదడు గురించి తెలిస్తే ఎవరికైరా వారెవ్వా అనాలినిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఒక్కరోజులో ఎన్నో ఆలోచనలు
Image Credit : AI

ఒక్కరోజులో ఎన్నో ఆలోచనలు

ఒకరోజులో మీ మెదడు ఎన్ని ఆలోచనలు చేస్తుందో తెలుసా? అధ్యయనాల ప్రకారం, మనిషి మెదడు ప్రతిరోజూ వేలాది ఆలోచనలను సృష్టిస్తుంది. మనకు తెలియకుండానే బ్రెయిన్ ఎంతో సమాచారాన్ని ప్రాసెస్ చేస్తూనే ఉంటుంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మెదడు ఎప్పుడూ పూర్తిగా విశ్రాంతి తీసుకోదు. 

 చాలామంది నిద్రపోతున్నప్పుడు మెదడు కూడా రెస్ట్ తీసుకుంటుందని అనుకుంటారు. కానీ నిజానికి, నిద్రలోనే మెదడు చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది. రోజంతా సేకరించిన సమాచారాన్ని క్రమబద్ధీకరించి మెమరీలో సేవ్ చేయడం, అనవసరమైన సమాచారాన్ని తొలగించడం, మరుసటి రోజుకు శరీరాన్ని సిద్ధం చేయడం వంటి పనులన్నీ ఆ సమయంలోనే జరుగుతాయి.

34
మెదడుకు నొప్పి తెలియదు!
Image Credit : Asianet News

మెదడుకు నొప్పి తెలియదు!

 శరీరంలోని అన్ని భాగాలకు నొప్పి సంకేతాలను పంపే మెదడుకే నొప్పిని గ్రహించే నరాలు (receptors) ఉండవు. అందుకే కొన్ని ప్రత్యేకమైన బ్రెయిన్ సర్జరీలు రోగి మెలకువగా ఉన్నప్పుడే చేస్తారు.  మెదడులోని బిలియన్ల కొద్దీ నరాల కణాలు నిరంతరం సమాచారాన్ని మార్పిడి చేసుకుంటాయి. ఈ ప్రక్రియలో చిన్న మొత్తంలో విద్యుత్ తరంగాలు పుడతాయి. అందుకే EEG వంటి పరికరాలతో మెదడు పనితీరును రికార్డ్ చేయగలుగుతారు.

44
మీ మెదడు సూపర్ కంప్యూటర్!
Image Credit : stockPhoto

మీ మెదడు సూపర్ కంప్యూటర్!

ప్రస్తుత ప్రపంచంలోని అత్యాధునిక కంప్యూటర్లు కూడా ఇంకా మనిషి మెదడుకున్న పూర్తి సామర్థ్యాన్ని అందుకోలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్ఞాపకశక్తి, నేర్చుకునే నైపుణ్యం, సమస్యలను పరిష్కరించే తీరు, భావోద్వేగాలను అర్థం చేసుకునే సామర్థ్యం వంటి అనేక విషయాల్లో మనిషి మెదడు ఇప్పటికీ ప్రత్యేకమైనదే. మనం మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు, మెదడులోని చాలా భాగాలు ఒకేసారి పనిచేస్తాయి. దీనివల్ల ఒత్తిడి తగ్గి, ఆనందాన్ని కలిగించే హార్మోన్లు పెరుగుతాయి. అందుకే వైద్యులు కూడా ప్రతిరోజూ నవ్వాలని సూచిస్తుంటారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
రోడ్లు వేసేందుకు వాడే నల్లటి తారు ఎలా తయారవుతుందో తెలుసా?
Recommended image2
Waterless Washing machine: చుక్క నీరు అక్కర్లేని వాషింగ్ మెషీన్.. దుస్తులు చక్కగా ఉతికి పొడిగానే అందిస్తుంది
Recommended image3
US Student Jobs: అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చా? అసలు రూల్స్ ఇవే!
Related Stories
Recommended image1
Ketu gamanam: కేతువు దుష్టగ్రహమే అయినా ఈ 3 రాశులకు మాత్రం తెగ కలిసొచ్చేస్తుంది
Recommended image2
Earthquake: మనదేశంలోని ఈ నగరాల్లో భూకంపాలు అధికంగా వచ్చే అవకాశం, హైదరాబాద్ పరిస్థితేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved