Ketu gamanam: కేతువు దుష్టగ్రహమే అయినా ఈ 3 రాశులకు మాత్రం తెగ కలిసొచ్చేస్తుంది
Ketu gamanam: జ్యోతిషశాస్త్రంలో కేతువును దుష్ట గ్రహంగా చెప్పుకుంటారు. అయితే కొన్నిసార్లు కేతువు వల్లే కొందిరికి అధికంగా కలిసివస్తుంది. కేతువు శుక్రుడు కలవడం వల్ల రాజయోగాన్ని ఇస్తుందని చెబుతారు. ఈ యోగం వల్ల 3 రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది.

కేతువుతో మూడు రాశులకు లక్
జ్యోతిషశాస్త్రంలో నవగ్రహాలలో కేతువును చాలా దుష్ట గ్రహంగా భావిస్తారు. దాని ప్రభావం జీవితంలో భారీ మార్పులను తెస్తుందని జ్యోతిష్యులు చెబుతారు. సాధారణంగా కేతువును ఆటంకాలు, ఆలస్యం, ఆధ్యాత్మికత, కర్మ ఫలాలకు చిహ్నంగా చూస్తారు. కేతువు ఎప్పుడూ నెగెటివ్ ఫలితాలనే ఇవ్వడు. కొన్ని గ్రహాల కలయికలతో ముఖ్యంగా శుక్రుడితో కలిసినప్పుడు కొందరి జీవితాలను ఊహించని స్థాయికి తీసుకెళ్తాడని నమ్ముతారు.
వృషభ రాశి
వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వీరికి కేతువు శుక్ర కలయిక వల్ల ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. అలాగే వ్యాపారం విస్తరించడానికి కూడా ఇది అనుకూల సమయం. కొత్త పెట్టుబడి పెట్టేందుకు అవకాశాలు లభించవచ్చు. వాహనం కొనాలనే కోరిక తీరుతుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది.
తులా రాశి
తులారాశి వారికి వృత్తి, వ్యాపారాలలో కొత్త శిఖరాలను అందుకునే అవకాశం ఉంది. విదేశీ ఉద్యోగం, కొత్త ఒప్పందాలు, ఉన్నత పదవి లేదా సామాజిక గుర్తింపు వంటి అవకాశాలు రావచ్చు. చాలా కాలంగా ప్లాన్ చేస్తున్న ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే కల కూడా నెరవేరవచ్చు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కుటుంబం ద్వారా శుభవార్తలు అందే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి, కొత్త వ్యాపార అవకాశం లేదా అదనపు ఆదాయం వంటివి అనుకూలంగా మారొచ్చని చెబుతున్నారు. పెట్టుబడులలో జాగ్రత్తగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది.

