MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • America: కారులో ఢిల్లీ నుంచి అమెరికాకు వెళ్లిపోవచ్చు తెలుసా? ఆ రోడ్డు మార్గం ఇదిగో

America: కారులో ఢిల్లీ నుంచి అమెరికాకు వెళ్లిపోవచ్చు తెలుసా? ఆ రోడ్డు మార్గం ఇదిగో

America: అమెరికా వెళ్లాలంటే విమానం ఎక్కే వెళ్లాలని మరొక దారి లేదని అనుకుంటారంతా. కానీ రోడ్డు మార్గంలో కూడా వెళ్లొచ్చు. కాకపోతే కొంచెం ఎక్కువ రోజులు, ఎక్కువ ఖర్చు అవుతుంది. ఆ వివరాలు పూర్తిగా తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 30 2026, 10:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కారులో రోడ్డు మార్గంలో అమెరికాకు ఎలా వెళ్లాలి?
Image Credit : Gemini AI

కారులో రోడ్డు మార్గంలో అమెరికాకు ఎలా వెళ్లాలి?

భారత రాజధాని ఢిల్లీ నుంచి అమెరికాకు కారులో ప్రయాణించడం సాధ్యమేనా అంటే.. సరైన ప్రణాళిక, సంకల్పం ఉంటే ఖచ్చితంగా సాధ్యమే. సహజంగా ఖండాలు దాటి వెళ్లడానికి విమానాలు, ఓడలను ద్వారా ప్రయాణం చేస్తారు. అయితే రోడ్డు ప్రయాణాలను ఇష్టపడే సాహసికులు ప్రపంచ యాత్ర చేయాలన్న ఆలోచనతో ఇలా రోడ్డు మార్గాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. భారతదేశం, అమెరికా మధ్య నేరుగా భూమార్గం లేకపోయినా, ఆసియా, ఐరోపా ఖండాల మీదుగా రష్యా చేరుకుని, అక్కడి నుంచి పసిఫిక్ మహాసముద్రం మీదుగా కార్గో షిప్ ద్వారా వాహనాన్ని అమెరికా గడ్డపైకి చేర్చవచ్చు. ఈ సుదీర్ఘ ప్రయాణం అద్భుతమైన సాహసయాత్రలా అనిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇండియా నుంచి అమెరికాకు రోడ్డు దారి ఎలా?
Image Credit : pixabay

ఇండియా నుంచి అమెరికాకు రోడ్డు దారి ఎలా?

ఢిల్లీ నుంచి మీరు కారులో బయలుదేరి రోడ్డు మార్గంలో మొదట నేపాల్ లేదా మయన్మార్ చేరుకోవచ్చు. అక్కడ్నించి థాయిలాండ్, లావోస్ మీదుగా చైనా చేరుకోవచ్చు. అక్కడి నుంచి మధ్య ఆసియా దేశాలైన కిర్గిజిస్తాన్, కజకిస్తాన్ గుండా రష్యా భూభాగంలోకి ప్రవేశించాలి. సైబీరియా మంచు దారులను దాటుకుంటూ రష్యా తూర్పు తీర నగరమైన వ్లాదివోస్తోక్ లేదా మగదాన్ పోర్టుకు చేరుకోవాలి. ఇక్కడితో భూమార్గం ముగిసిపోతుంది. మగదాన్ పోర్టులో కారును కంటైనర్ నౌకలో ఎక్కించి అలాస్కా లేదా సియాటెల్ రేవుకు పంపాల్సి ఉంటుంది. ప్రయాణికులు అక్కడ్నించి ఓడలో లేదా విమానంలో అమెరికా చేరుకోవాలి. అలాస్కా లేదా సియాటెల్ పోర్టులో కార్గో క్లియరెన్స్ తీసుకోవాలి. ఇక అక్కడ్నించి అమెరికాలో మీకు నచ్చిన ప్రదేశానికి మీ కారులో వెళ్లిపోవచ్చు.

33
ఎంత ఖర్చవుతుంది?
Image Credit : Pixabay

ఎంత ఖర్చవుతుంది?

ఇలాంటి అంతర్జాతీయ ట్రిప్‌ చేయాలంటే భారీగానే ఖర్చవుతుంది. అలాగే అనుమతులు, పత్రాలు కూడా అత్యంత ప్రధానమైనవి. అన్ని దేశాలకు సరిపడా వీసాలతో పాటు భారత డ్రైవింగ్ లైసెన్స్, అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ తప్పనిసరిగా ఉండాలి. విదేశాల్లో వాహనం నడపడానికి అవసరమైన కార్నెట్ డి పాసేజ్ డి డ్యూయెన్ (CPD) పత్రం పొందాలి. కారు ఒరిజినల్ ఆర్సీ, అంతర్జాతీయ బీమా, ఎమిషన్ సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోవాలి. చైనా వంటి దేశాల్లో ప్రయాణించడానికి ముందస్తు ప్రభుత్వ అనుమతులు, స్థానిక గైడ్ అవసరం ఉంటుంది. రాళ్లూరప్పలు, మంచు దారులను తట్టుకునే ఫోర్-వీల్ డ్రైవ్ ఎస్‌యూవీ వాహనాలను ఎంపిక చేసుకోవాలి. ఇలా రోడ్డు మార్గంలో అమెరికా చేరుకోవాలంటే దాదాపు అరవై నుంచి తొంబై రోజుల సమయం పడుతుంది. అలాగే రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. కానీ ప్రయాణం మాత్రం చాలా సాహసోపేతంగా ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ప్రయాణం
భారత దేశం
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
(47.0 ov) 329 & 140/4
AUSAUS
429
Day 3
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Richest Caste In Telangana : తెలంగాణలో అత్యంత ధనిక కులం ఏదో తెలుసా?
Recommended image2
Millionaire Village: మన దేశంలోనే అత్యంత ధనిక గ్రామం... పేదరికం నుంచి మిలియనీర్ గ్రామంగా ఎలా మారింది?
Recommended image3
Gold in Silk Saree: పట్టుచీర జరీలో బంగారం ఉంటుందా? ఒక్క చీర నుంచి ఎంత బంగారం తీయొచ్చు?
Related Stories
Recommended image1
ప్రపంచంలోనే అత్యధిక పోలీసులు పనిచేస్తున్న రాష్ట్రం మనదేశంలోనే ఉంది, ఆ రాష్ట్రమేది?
Recommended image2
బంగాళాఖాతంలోనే ఎక్కువ తుఫాన్లు ఎందుకు వస్తాయి? అది కూడా ఈ రెండు నెలల్లోనే ఎందుకు ఎక్కువ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved