MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • Diamonds Price : వజ్రాభరణాలు కొనేందుకు ఇదే సరైన సమయం..ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయిన డైమండ్స్ ధరలు

Diamonds Price : వజ్రాభరణాలు కొనేందుకు ఇదే సరైన సమయం..ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయిన డైమండ్స్ ధరలు

బంగారం ధరలేమో పైపైకి ఎగబాకుతూ సామాన్యులకు దూరమవుతుంటే… డైమండ్స్ ధరలు భారీగా తగ్గుతూ ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. మరి డైమండ్స్ ధరలు తగ్గడానికి కారణాలేంటో తెలుసా?

4 Min read
Author : Arun Kumar P
Published : Sep 25 2026, 01:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
భారీగా తగ్గుతున్న డైమండ్స్ ధరలు
Image Credit : Getty

భారీగా తగ్గుతున్న డైమండ్స్ ధరలు

ప్రస్తుతం బంగారం ధరలు పెరుగుతున్నాయి... ఇప్పటికే ఆల్ టైమ్ గరిష్ఠానికి పసిడి ఎగబాకింది. ఇదే సమయంలో బంగారం కంటే ఎక్కువ విలువ కలిగిన డైమండ్స్ ధరలు మాత్రం రోజురోజుకి తగ్గుతున్నాయి… ఆల్ టైమ్ కనిష్టానికి చేరాయి. ఒకప్పుడు వజ్రం అంటే అరుదైనది, ఖరీదైనది అనే భావన ఉండేది... కానీ ఇప్పుడు సహజ వజ్రాల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. తాజాగా సహజ వజ్రాల హోల్‌సేల్ ధరలు రెండు దశాబ్దాల కనిష్ఠ స్థాయికి చేరినట్లు మార్కెట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. 2021లో ఉన్న గరిష్ఠ స్థాయితో పోలిస్తే ప్రస్తుతం సహజ వజ్రాల హోల్‌సేల్ ధరలు దాదాపు 30–40 శాతం తక్కువగా ఉన్నాయి.

వజ్రాల వ్యాపారం కొత్తమలుపు తిరుగుతోంది... ల్యాబ్‌లో తయారయ్యే కృత్రిమ వజ్రాలు మార్కెట్‌ను వేగంగా మార్చేస్తున్నాయి. తక్కువ ధరకు దొరికే ఈ వజ్రాలకు వినియోగదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వాటి ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న చైనా వంటి దేశాల నుంచి కృత్రిమ వజ్రాలు సరఫరా అధికం అయ్యింది. ఇవన్నీ సహజ వజ్రాల మార్కెట్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. అసలు డైమండ్ ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? బంగారం ధరలు పెరుగుతున్న సమయంలో వజ్రాల ధరలు ఎందుకు పడిపోతున్నాయి? అనేది తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రెండు దశాబ్దాల కనిష్ఠానికి సహజ వజ్రాల ధరలు
Image Credit : pixabay

రెండు దశాబ్దాల కనిష్ఠానికి సహజ వజ్రాల ధరలు

సహజ వజ్రాల ధరలు ఒక్కసారిగా, ఒకే రోజులో పడిపోలేదు. గత కొన్నేళ్లుగా మార్కెట్‌లో మార్పులు కొనసాగుతున్నాయి. కరోనా తర్వాత అంటే 2021 ప్రాంతంలో వజ్రాల ధరలు గణనీయంగా పెరిగాయి. అయితే ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల డిమాండ్ మారడం, ఆభరణాల మార్కెట్‌లో నిల్వలు పెరగడం, ల్యాబ్ గ్రోన్ వజ్రాల పోటీ పెరగడంతో సహజ వజ్రాల ధరలపై ఒత్తిడి మొదలైంది.

2026లో ఈ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. డి బీర్స్ (ప్రముఖ వజ్రాల కంపెనీ) తాజా రిపోర్ట్స్ ప్రకారం... 2026 మొదటి అర్ధభాగంలో దాని రఫ్ డైమండ్ సగటు వాస్తవ విక్రయ ధర క్యారెట్‌కు 105 డాలర్లకు పడిపోయింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 32 శాతం తగ్గుదల. అదే సమయంలో రఫ్ డైమండ్ ధర సూచీ కూడా 16 శాతం తగ్గింది.

35
ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అసలు కథేంటి?
Image Credit : Getty

ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అసలు కథేంటి?

డైమండ్ ధరలపై ఇంత ప్రభావం చూపుతున్న ప్రధాన కారణాల్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఒకటి. పేరులో ‘ల్యాబ్’ ఉన్నప్పటికీ ఇవి సాధారణ గాజు ముక్కలు కాదు. సహజ వజ్రాల్లో ఉండే కార్బన్ క్రిస్టల్ నిర్మాణాన్నే ఉపయోగించి అధునాతన సాంకేతికతతో ప్రయోగశాలల్లో తయారు చేస్తారు. అందువల్ల చూడటానికి, రసాయనికంగా, భౌతిక లక్షణాల పరంగా సహజ వజ్రాలకు ఇవి చాలా దగ్గరగా ఉంటాయి. అయితే వీటిని భూమి లోపల కోట్ల సంవత్సరాలు పట్టే ప్రక్రియ ద్వారా తవ్వి తీయాల్సిన అవసరం ఉండదు. నియంత్రిత వాతావరణంలో పెద్ద మొత్తంలో తయారు చేయవచ్చు.

ఇదే ధర విషయంలో భారీ తేడాకు కారణమవుతోంది. ప్రస్తుతం ల్యాబ్ గ్రోన్ వజ్రాలు సమానమైన సహజ వజ్రాల కంటే సాధారణంగా 70–85 శాతం వరకు తక్కువ ధరకు లభిస్తున్నట్లు మార్కెట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. అందుకే వినియోగదారులు సహజ వజ్రాల కంటే వీటిని కొనుగోలు చేసేందుకే ఆసక్తి చూపుతున్నారు.

ల్యాబ్ డైమండ్స్ ధరలు కూడా ఎందుకు పడిపోతున్నాయి?

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. సహజ వజ్రాల ధరలు మాత్రమే కాదు.. ల్యాబ్ గ్రోన్ వజ్రాల ధరలు కూడా వేగంగా పడిపోతున్నాయి. ఉత్పత్తి సామర్థ్యం పెరగడం, సాంకేతికత అభివృద్ధి చెందడం, తయారీదారుల మధ్య పోటీ పెరగడం వల్ల ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ధరలు నిరంతరం తగ్గుతున్నాయి.

డైమండ్స్ పరిశ్రమల డేటా ప్రకారం... 2018 నుంచి ల్యాబ్ గ్రోన్ వజ్రాల హోల్‌సేల్ ధరలు భారీగా క్షీణించాయి. 2026 రెండో త్రైమాసికంలో కూడా వాటి ధరలు సంవత్సర ప్రాతిపదికన సగటున 13 శాతం తగ్గాయి. దీంతో ఒకప్పుడు సహజ వజ్రాలకు ప్రత్యామ్నాయంగా కనిపించిన ల్యాబ్ వజ్రాలు ఇప్పుడు మరింత చౌకగా మారుతున్నాయి. ఇది ముఖ్యంగా మధ్యస్థ ధరల సహజ వజ్రాలపై ఎక్కువ ఒత్తిడిని పెంచుతోంది.

చైనా నుంచి భారీ సరఫరా

ల్యాబ్ గ్రోన్ డైమండ్ మార్కెట్‌లో చైనా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచ ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఉత్పత్తిలో చైనా వాటా 60 శాతానికి పైగా ఉన్నట్లు తాజా మార్కెట్ రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. 2026 మొదటి ఆరు నెలల్లో చైనా నుంచి ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఎగుమతులు గత ఏడాదితో పోలిస్తే 65.3 శాతం పెరిగినట్లు సమాచారం.

మార్కెట్‌లోకి తక్కువ ధరలో పెద్ద మొత్తంలో వజ్రాలు రావడంతో సరఫరా పెరిగింది. అదే సమయంలో కొనుగోలుదారులు తక్కువ ధరలో పెద్ద పరిమాణంలో వజ్రాన్ని ఎంచుకునే అవకాశం పొందుతున్నారు. దీంతో సహజ వజ్రాలకు ఉన్న ధర ప్రీమియంపై కూడా ఒత్తిడి పెరుగుతోంది.

45
అమెరికా, చైనా మార్కెట్లలో డిమాండ్ ఎలా ఉంది?
Image Credit : Getty

అమెరికా, చైనా మార్కెట్లలో డిమాండ్ ఎలా ఉంది?

డైమండ్ మార్కెట్ పూర్తిగా సరఫరా సమస్య వల్లే పడిపోవడం లేదు. డిమాండ్ వైపు కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా చైనా మార్కెట్‌లో డైమండ్ డిమాండ్ బలహీనంగా ఉందని డి బీర్స్ 2026 ఫస్ట్ హాఫ్ రిపోర్ట్ పేర్కొంది. అదే సమయంలో అమెరికాలో కొన్ని విభాగాల్లో సహజ వజ్రాల ఆభరణాల అమ్మకాలు మెరుగుపడ్డాయి. భారతదేశంలో కూడా డిమాండ్ బలంగానే ఉందని సంస్థ పేర్కొంది.

అంటే ప్రపంచంలోని అన్ని మార్కెట్లలో ఒకే విధమైన పరిస్థితి లేదన్నమాట. కొన్ని దేశాల్లో వినియోగదారులు సహజ వజ్రాలను కొనుగోలు చేస్తుండగా, మరికొన్ని మార్కెట్లలో ఆర్థిక పరిస్థితులు, వినియోగదారుల ప్రాధాన్యాల్లో మార్పులు, ల్యాబ్ వజ్రాల లభ్యత వంటి అంశాలు డిమాండ్‌ను ప్రభావితం చేస్తున్నాయి.

అన్ని డైమండ్స్ ధరలు ఒకేలా తగ్గడం లేదు

‘డైమండ్ ధరలు 30–40 శాతం తగ్గాయి’ అనే వార్త చూసి అన్ని రకాల వజ్రాలు అంతే స్థాయిలో చౌకయ్యాయని భావించకూడదు. వజ్రం పరిమాణం, రంగు, క్లారిటీ, కట్, నాణ్యత, సర్టిఫికేషన్ వంటి అనేక అంశాల ఆధారంగా ధర మారుతుంది.

ప్రత్యేకంగా చిన్న పరిమాణం, తక్కువ నాణ్యత కలిగిన సహజ వజ్రాలపై ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీనికి విరుద్ధంగా పెద్ద పరిమాణం, అధిక నాణ్యత కలిగిన సహజ వజ్రాలకు కొంత డిమాండ్ కొనసాగుతోంది. అరుదైన లక్షణాలు ఉన్న వజ్రాలు సాధారణ మార్కెట్‌లోని వజ్రాల కంటే భిన్నంగా ధర నిర్ణయించబడతాయి.

55
ముందుముందు డైమండ్ మార్కెట్ ఎలా ఉండొచ్చు?
Image Credit : Gemini AI

ముందుముందు డైమండ్ మార్కెట్ ఎలా ఉండొచ్చు?

ప్రస్తుతం మార్కెట్‌లో రెండు విభిన్న ధోరణులు కనిపిస్తున్నాయి. ఒకవైపు ల్యాబ్ గ్రోన్ వజ్రాల ఉత్పత్తి, పోటీ, ధరల తగ్గుదల కొనసాగుతున్నాయి. మరోవైపు సహజ వజ్రాల ఉత్పత్తిదారులు సరఫరాను మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

డి బీర్స్ ప్రకారం 2026లో రఫ్ డైమండ్ మార్కెట్ పరిస్థితులు ముఖ్యంగా తక్కువ విలువ కలిగిన విభాగాల్లో సవాలుగా ఉన్నాయి. అయితే రాబోయే సంవత్సరాల్లో సహజ వజ్రాల ఉత్పత్తి తగ్గడం, పరిశ్రమలో పేరుకుపోయిన నిల్వలు క్రమంగా సాధారణ స్థాయికి రావడం వల్ల సరఫరా-డిమాండ్ సమతుల్యత మెరుగుపడే అవకాశం ఉందని సంస్థ అంచనా వేసింది.

అయితే ప్రస్తుతం కనిపిస్తున్న మార్పు కేవలం తాత్కాలిక ధరల హెచ్చుతగ్గులుగా మాత్రమే చూడలేము. వినియోగదారుల అభిరుచులు, ల్యాబ్ గ్రోన్ వజ్రాల సాంకేతిక అభివృద్ధి, తక్కువ ధరలు, సహజ వజ్రాల అరుదు వంటి అంశాలు భవిష్యత్తులో మార్కెట్ నిర్మాణాన్ని ప్రభావితం చేయవచ్చు.

బంగారం పైపైకి.. డైమండ్ కిందకిందకి ఎందుకు?

మొత్తంగా చూస్తే బంగారం, వజ్రాల ధరలను ప్రభావితం చేసే మార్కెట్ శక్తులు ఒకేలా ఉండవు. బంగారానికి పెట్టుబడి డిమాండ్, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, వడ్డీ రేట్లు, భౌగోళిక అనిశ్చితులు వంటి అంశాలు ప్రభావం చూపుతాయి. వజ్రాల మార్కెట్‌లో మాత్రం వినియోగదారుల అభిరుచి, ఆభరణాల డిమాండ్, గనుల నుంచి వచ్చే సహజ వజ్రాల సరఫరా, ల్యాబ్ గ్రోన్ వజ్రాల పోటీ, మార్కెట్‌లోని నిల్వలు వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయి.

అందుకే ఒకవైపు బంగారం ధరలు పెరుగుతున్నా.. మరోవైపు సహజ వజ్రాల ధరలు 2021 గరిష్ఠాలతో పోలిస్తే 30–40 శాతం దిగువన ఉండటం కనిపిస్తోంది. ముఖ్యంగా ల్యాబ్ గ్రోన్ వజ్రాలు చౌకగా, పెద్ద మొత్తంలో అందుబాటులోకి రావడం ఈ మార్పుకు ప్రధాన కారణాల్లో ఒకటిగా మారింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
River : వందల కిలోమీటర్లు ప్రవహించినా సముద్రంలో కలవదు.. భూమిపైనే కనుమరుగయ్యే ఏకైక భారతీయ నది ఏదో తెలుసా?
Recommended image2
Idli Capital: మనదేశంలో ఏ నగరాన్ని ఇడ్లీ రాజధానిగా పిలుచుకుంటారు?
Recommended image3
Rent House: అద్దె ఇంట్లో ఎన్ని సంవత్సరాలు ఉంటే కిరాయిదారుడికి ఆ ఇల్లు సొంతమవుతుంది?
Related Stories
Recommended image1
Diamonds : మీరు కూడా ఓవర్ నైట్ లో కోటీశ్వరులు కావాలా..? అయితే వెంటనే రాయలసీమకు వెళ్ళండి
Recommended image2
Diamond Rings: అమ్మాయిల కోసం లేటెస్ట్ డైమండ్ రింగ్స్ డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved