MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Feature
  • Rivers : ఇవేం దేశాల్రా బాబు.. కనీసం నదులు కూడా లేవా..!

Rivers : ఇవేం దేశాల్రా బాబు.. కనీసం నదులు కూడా లేవా..!

ప్రవహించే నదులు మన జీవితంలో భాగం. నది లేని జీవితాన్ని ఊహించుకోలేం. కానీ ప్రపంచంలో ఒక్కటంటే ఒక్క శాశ్వత నది కూడా లేని దేశాలు చాలానే ఉన్నాయి. అవేవో తెలుసా..?

3 Min read
Author : Arun Kumar P
Published : Apr 24 2026, 12:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నదులు లేని దేశాలివే..
Image Credit : Gemini AI

నదులు లేని దేశాలివే..

ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకు నదులే జీవనాధారం... ఇండియా వంటి వ్యవసాయ ఆధారిత దేశాలను నదులు లేకుండా ఊహించలేం. కానీ భౌగోళిక పరిస్థితుల వల్ల కొన్ని దేశాల్లో ఒక్కటంటే ఒక్క శాశ్వత నది కూడా లేదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. నదులు లేని దేశాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో నదులే లేవు..
Image Credit : Getty

ఈ మిడిల్ ఈస్ట్ దేశాల్లో నదులే లేవు..

సౌదీ అరేబియా

శాశ్వత నది లేని ప్రపంచంలోనే అతిపెద్ద దేశం సౌదీ అరేబియా. ఇక్కడి విశాలమైన ఎడారిలో 'వాడిస్' అనే ఎండిన నదీ లోయలు ఉంటాయి. అప్పుడప్పుడు కురిసే వర్షాలకు ఇవి నిండినా, వెంటనే ఎండిపోతాయి. అందుకే ఈ దేశం భూగర్భ జలాలపైనే ఎక్కువగా ఆధారపడుతుంది. అలాగే సముద్రపు ఉప్పునీటిని శుద్దిచేసి తాగునీటిగా వాడుకుంటుంది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

దుబాయ్, అబుదాబి వంటి ప్రపంచ ప్రఖ్యాత నగరాలు కలిగిన యూఏఈలో కూడా శాశ్వత నదులు లేవు. తీవ్రమైన పొడి వాతావరణం కారణంగా నదులు ఏర్పడలేవు. వర్షాకాలంలో అక్కడక్కడా లోయల్లో నీరున్నా, అవి ఎక్కువ కాలం నిలవవు. అందుకే తమ రోజువారీ అవసరాల కోసం ఈ దేశం సముద్రపు నీటిని శుద్ధి చేసే అత్యాధునిక డిసాలినేషన్ ప్లాంట్లపై ఆధారపడుతుంది.

ఖతార్

ఖతార్ భూభాగం మొత్తం చదునైన ఎడారి. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. అందుకే నదులు ఏర్పడవు. దేశంలో మంచినీటి సరస్సులు గానీ, ప్రవాహాలు గానీ లేవు. భూగర్భ జలాలు ఉన్నా అవి చాలా పరిమితం. ఇక్కడ కూడా ప్రజల దాహాన్ని తీర్చేది డిసాలినేషన్ ప్లాంట్లే.

35
ఈ దేశాల్లో కూడా నో రివర్స్
Image Credit : Getty

ఈ దేశాల్లో కూడా నో రివర్స్

కువైట్

కువైత్ దేశ సరిహద్దుల్లో ఒక్క నది గానీ, సరస్సు గానీ లేదు. అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం వల్ల ఇక్కడ సహజంగా మంచినీటిని నిల్వ చేయడం అసాధ్యం. చారిత్రకంగా నీటి కొరతే ఈ ప్రాంతంలో జనావాసాలను ప్రభావితం చేసింది. ప్రస్తుతం సముద్రపు నీటిని శుద్ధి చేసి తాగునీటి అవసరాలు తీర్చుకుంటున్నారు.

బహ్రెయిన్

బహ్రెయిన్‌లో నదులు లేవు. కానీ ఒకప్పుడు సముద్ర మట్టానికి దిగువన సహజసిద్ధమైన మంచినీటి ఊటలు ఉండేవి. కాలక్రమేణా అధిక వాడకం వల్ల ఈ ఊటలు చాలా వరకు ఎండిపోయాయి. ఇప్పుడు ఇక్కడ కూడా నీటి అవసరాలకు డిసాలినేషన్ ప్లాంట్లే ఆధారం.

ఓమన్

ఓమన్‌లో శాశ్వత నదులు లేవు. కానీ రుతుపవన వర్షాల తర్వాత నీటితో నిండే లోయలు (వాడిస్) చాలా ఉన్నాయి. వర్షాల తర్వాత ఇవి వ్యవసాయానికి తాత్కాలికంగా నీటిని అందిస్తాయి. అయినా ఇక్కడి ఏ ప్రవాహాన్ని పూర్తిస్థాయి నదిగా పరిగణించరు.

45
మాల్దీవుల్లో నదులే లేవా..?
Image Credit : X

మాల్దీవుల్లో నదులే లేవా..?

మాల్టా

మాల్టాలోనూ నదులు లేవు. భారీ వర్షాలు కురిసినప్పుడు మాత్రమే చిన్న చిన్న వాగులు ఏర్పడతాయి. అవి కూడా కొద్దికాలమే ప్రవహించి ఎండిపోతాయి. ఈ ద్వీపంలోని సున్నపురాయి నేల వల్ల వర్షపు నీరు వేగంగా భూమిలోకి ఇంకిపోతుంది. ఇక్కడ భూగర్భ జలాలే మంచినీటి సరఫరాలో కీలక పాత్ర పోషిస్తాయి.

మాల్దీవులు

మాల్దీవులు పల్లపు ప్రాంతంలో ఉండే పగడపు దీవుల సముదాయం. నదులు ఏర్పడటానికి అవసరమైన ఎత్తైన ప్రదేశాలు ఇక్కడ లేవు. అందుకే ఇక్కడ వాగులు, సరస్సులు వంటి మంచినీటి వనరులు ఏవీ కనిపించవు. వర్షపు నీరు నేరుగా భూమిలోకి ఇంకిపోతుంది.

వాటికన్ సిటీ

ప్రపంచంలోనే అతిచిన్న దేశమైన వాటికన్ సిటీలో నదులు ప్రవహించడానికి సరిపడా స్థలం కూడా లేదు. ఇది కేవలం 0.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మాత్రమే కలిగి ఉంటుంది... కాబట్టి నదులు ఏర్పడే అవకాశమే లేకుండాపోయింది.

55
నదులు లేకుంటే మంచినీరు ఎలా..?
Image Credit : Asianet News

నదులు లేకుంటే మంచినీరు ఎలా..?

ప్రపంచంలో సుమారు 19 దేశాల్లో నదులు లేవు. వీటిలో ఎక్కువ శాతం మధ్యప్రాచ్య దేశాలు (Middle East) లేదా చిన్న ద్వీప దేశాలు. అయితే .నదులు లేకుండా ఈ దేశాల్లో ప్రజలు ఎలా జీవిస్తున్నాయి..? అనేగా మీ ప్రశ్న. అయితే నదులు లేకపోయినా ఈ దేశాలు అధునాతన సాంకేతికతతో అభివృద్ధి చెందుతున్నాయి. మంచినీటి కోసం వారు అనుసరించే పద్ధతులు..

డీశాలినేషన్ (Desalination) : సముద్రపు నీటి నుండి ఉప్పును తొలగించి స్వచ్ఛమైన నీరుగా మార్చడం.

భూగర్భ జలాలు (Ground Water) : భూమి లోపల ఉన్న పురాతన నీటి నిల్వలను బోర్ల ద్వారా వెలికి తీయడం.

నీటి శుద్ధి (Water Recycling) : వాడిన నీటిని మళ్ళీ శుద్ధి చేసి వ్యవసాయానికి లేదా పరిశ్రమలకు వాడటం.

వాడీలు (Wadis) : వర్షాకాలంలో వచ్చే తాత్కాలిక ప్రవాహాలను ఆనకట్టల ద్వారా నిల్వ చేయడం.

నీరు ప్రాణాధారం. నదులు లేని దేశాలు నీటి విలువను గుర్తించి, ప్రతి చుక్కను పొదుపుగా వాడుతూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రకృతి ప్రసాదించిన వనరులు లేకపోయినా, మానవ మేథస్సుతో ఆ కొరతను ఎలా అధిగమించవచ్చో ఈ దేశాలు నిరూపిస్తున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రపంచం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Telugu Saying: కాలం కలిసి రాకపోతే కర్రే పామై కాటేస్తుంది! పెద్దలు ఈ సామెత ఎందుకు చెప్పారో తెలుసా?
Recommended image2
ప్రపంచంలో అత్యధిక ముస్లింలు ఉన్న దేశమేదో తెలుసా? ఇండియా స్థానమెంత?
Recommended image3
US Apartment Rules: అమెరికాలో రోడ్డుపై ఈ పని చేస్తే చిక్కుల్లో పడ్డట్లే
Related Stories
Recommended image1
Ganga River : కల్కి మూవీలో చూపించినట్లే... ఇండియాలో గంగా నదే లేకపోతే పరిస్థితేంటి
Recommended image2
Male river in India: భారతదేశంలో ఒకే ఒక్క మగనది ఏది? నదులకు స్త్రీల పేర్లే ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved