MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • US Student Jobs: అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చా? అసలు రూల్స్ ఇవే!

US Student Jobs: అమెరికాలో చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్ చేయొచ్చా? అసలు రూల్స్ ఇవే!

US Part Time Jobs: అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులు పార్ట్ టైమ్ జాబ్ చేసుకోవడానికి అనుమతి ఉంది. అయితే, ఇది మీ వీసా రకం, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు, ఆ ఉద్యోగం మీ కోర్సుతో ఏ విధంగా సంబంధం కలిగి ఉంది అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 11 2026, 08:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
అమెరికాలో చదువుకుంటూ జాబ్.. ఈ రూల్స్ తెలియకపోతే వీసా క్యాన్సిల్
Image Credit : Chatgpt

అమెరికాలో చదువుకుంటూ జాబ్.. ఈ రూల్స్ తెలియకపోతే వీసా క్యాన్సిల్

అమెరికాలో ఎఫ్-1 వీసా ఉందంటే ఏ ఉద్యోగమైనా చేసుకోవచ్చని అర్థం కాదు. క్యాంపస్ లోపల చేసే ఉద్యోగాలకు ప్రత్యేక అనుమతులు అక్కర్లేదు. యూనివర్సిటీ లైబ్రరీ, కేఫెటేరియా, బుక్ స్టోర్ లేదా రీసెర్చ్ ల్యాబ్స్ లో పనిచేయవచ్చు. సాధారణంగా సెమిస్టర్ జరిగే సమయంలో వారానికి 20 గంటలు మాత్రమే పనిచేయడానికి అనుమతి ఉంటుంది.

సెలవు రోజుల్లో ఫుల్ టైమ్ పనిచేయవచ్చు. ఇక సీపీటీ (కర్కులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్), ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్) ద్వారా మేజర్ కోర్సుకు సంబంధించిన ఇంటర్న్‌షిప్‌లు చేసుకోవడానికి యూనివర్సిటీ డీఎస్ఓ, యూఎస్సీఐఎస్ అనుమతి తప్పనిసరి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లయితే ప్రత్యేక నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వారానికి 20 గంటల రూల్ ఎలా పనిచేస్తుంది?
Image Credit : chatgpt

వారానికి 20 గంటల రూల్ ఎలా పనిచేస్తుంది?

అకడమిక్ సెమిస్టర్ నడుస్తున్న సమయంలో ఆన్ క్యాంపస్ ఉద్యోగాలు చేసే విద్యార్థులు వారానికి గరిష్ఠంగా 20 గంటలు మాత్రమే పనిచేయాలి. మీరు రెండు ఆన్ క్యాంపస్ జాబ్స్ చేసినా రెండింటి కలిపి మొత్తం గంటలు 20 దాటకూడదు.

అదే అధికారిక పాఠశాల సెలవులు అంటే సమ్మర్, వింటర్ లేదా స్ప్రింగ్ హాలిడేస్ సమయంలో అయితే ఫుల్ టైమ్ పనిచేయడానికి వెసులుబాటు ఉంటుంది. సీపీటీ లేదా ప్రీ-కప్లీషన్ ఓపీటీ చేసే సమయంలో కూడా తరగతులు నడుస్తున్నప్పుడు వారానికి 20 గంటల రూల్ వర్తిస్తుంది.

35
సీపీటీ, ఓపీటీ మధ్య తేడా ఏమిటి?
Image Credit : AI-Generated (ChatGPT)

సీపీటీ, ఓపీటీ మధ్య తేడా ఏమిటి?

సీపీటీ అనేది మీ స్టడీ కరిక్యులమ్‌లో భాగంగా చేసే ఇంటర్న్‌షిప్ లేదా కో-ఆప్. ఇది చదువుకునే సమయంలోనే వస్తుంది. దీనికి మీ యూనివర్సిటీ డీఎస్ఓ అనుమతి ఇచ్చి ఫారం I-20 పై నమోదు చేయాలి. దీనికి ప్రత్యేకంగా ఈఏడీ కార్డ్ అవసరం ఉండదు.

ఇక ఓపీటీ అనేది మీ మేజర్ ఫీల్డ్ ఆఫ్ స్టడీకి నేరుగా సంబంధం ఉన్న ప్రాక్టికల్ వర్క్. ఇది చదువు పూర్తికాకముందు అంటే ప్రీ-కప్లీషన్ లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత చేసుకోవచ్చు. దీనికి యూఎస్ సీఐఎస్ ఆమోదం, ఈఏడీ (ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) కార్డు కచ్చితంగా ఉండాలి.

45
రెస్టారెంట్, సూపర్ మార్కెట్ లేదా డెలివరీ కంపెనీల్లో పనిచేయవచ్చా?
Image Credit : Chatgpt

రెస్టారెంట్, సూపర్ మార్కెట్ లేదా డెలివరీ కంపెనీల్లో పనిచేయవచ్చా?

ఎంతమంది యజమానులు రిక్రూట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, మీకు తగిన అనుమతి లేకపోతే రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, లేదా బయట ఉండే రిటైల్ స్టోర్లలో ఉద్యోగాలు చేయడానికి వీలులేదు. ఉబర్, డోర్ డాష్ వంటి గిగ్ వర్క్ లేదా ఫ్రీలాన్సింగ్ చేయడం కుదరదు. క్యాంపస్ వెలుపల ఏ పనిచేసినా, క్యాష్ లో జీతం తీసుకున్నా, రిమోట్ వర్క్ చేసినా అది నిబంధనలకు విరుద్ధమే. ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా ఇలాంటి పనులు చేస్తే ఎఫ్-1 స్టేటస్ ప్రమాదంలో పడుతుంది.

55
ఆర్థిక ఇబ్బందులు ఉంటే నిబంధనలు ఏమిటి?
Image Credit : Getty

ఆర్థిక ఇబ్బందులు ఉంటే నిబంధనలు ఏమిటి?

ఊహించని ఆర్థిక ఇబ్బందులు లేదా అత్యవసర పరిస్థితులు తలెత్తితే ఎఫ్-1 విద్యార్థులు క్యాంపస్ వెలుపల ఉద్యోగం చేయడానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి కనీసం ఒక పూర్తి అకాడమిక్ ఇయర్ ఎఫ్-1 స్టేటస్ లో ఉండి ఉండాలి. మంచి అకాడమిక్ రికార్డు కలిగి ఉండాలి.

డీఎస్ఓ సిఫార్సుతో పాటు యూఎస్ సీఐఎస్ కు దరఖాస్తు చేసి ఈఏడీ పొందిన తర్వాతే ఆఫ్-క్యాంపస్ జాబ్ ప్రారంభించాలి. కేవలం సాధారణ ఖర్చులు లేదా ట్యూషన్ ఫీజు కట్టుకోవడానికి ఈ నిబంధన వర్తించదు. ఎలాంటి ఉద్యోగం చేసే ముందైనా మీ యూనివర్సిటీ డీఎస్ఓ ని సంప్రదించడం అత్యంత ముఖ్యం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఉద్యోగాలు, కెరీర్
విద్య
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
వ్యాపారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
చింతించడం, బాధపడటం మధ్య తేడా ఏంటి.? ఈ క‌థ చ‌దివితే జీవ‌త సారం తెలుస్తుంది
Recommended image2
Snake: మ‌నిషి కంటే వేగంగా ప‌రిగెత్తే పాము.. దీని విషం ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో తెలుసా.?
Recommended image3
Indian Village: ఈ గ్రామంలో ఇంకా రాజు పెత్తనమే కొనసాగుతోంది, భారత చట్టాలు ఇక్కడ పనిచేయవు
Related Stories
Recommended image1
Top 5 Mangli Folk Songs: యూట్యూబ్ షేక్ అంతే.. మంగ్లీ టాప్ 5 ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image2
Hair Care Tips: హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఊడిపోతుందా? అసలు నిజమేంటి.. డాక్టర్లు ఏం చెప్తున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved