MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Feature
  • మనదేశంలో మరణ శిక్ష కోసం ఉరితాళ్లు తయారయ్యే ఏకైక ప్రాంతం ఇదే... ఆ తాడు పేరేంటో తెలుసా?

మనదేశంలో మరణ శిక్ష కోసం ఉరితాళ్లు తయారయ్యే ఏకైక ప్రాంతం ఇదే... ఆ తాడు పేరేంటో తెలుసా?

మనదేశంలో ఉరిశిక్షలు అమలులో ఉన్నాయి. ఇప్పటికే ఎంతో మందికి ఉరిశిక్షలు అమలయ్యాయి. తాజాగా ఓ హత్య కేసులో ఇద్దరు నిందితులకు ఉరిశిక్ష పడింది. అయితే ఉరిశిక్షకు వాడే తాళ్ల గురించి ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 25 2026, 08:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
మనదేశంలో ఉరితాళ్ల తయారీ కేంద్రం
Image Credit : Gemini AI

మనదేశంలో ఉరితాళ్ల తయారీ కేంద్రం

ప్రపంచంలో మరణశిక్ష అమలులో ఉన్న దేశాల్లో మనదేశం కూడా ఒకటి. ఇక్కడ కేవలం నేరస్థులకు ఉరి వేయడం ద్వారానే మరణి శిక్షను అమలుచేస్తారు. మరణశిక్షల అమలుకు అవసరమైన ప్రత్యేక ఉరితాళ్లను తయారుచేయిస్తారు. 2012 నాటి ఢిల్లీ నిర్భయ కేసు దోషులతో పాటు పార్లమెంట్‌పై దాడి నిందితుడు అఫ్జల్ గురు, ముంబై ఉగ్రదాడి నేరస్థుడు అజ్మల్ కసబ్ వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన ఎందరో దోషులకు ఉరిశిక్ష అమలు చేశారు. అయితే మనదేశంలో ఎక్కడ ఉరి శిక్ష అమలు చేసినా ఉరితాళ్లను తయారు చేసే ఏకైక కేంద్రం బీహార్‌లోని బక్సర్ సెంట్రల్ జైలు. గంగా నదీ తీరాన ఉండే ఈ ప్రాంత వాతావరణం, తేమ శాతం దారాల తయారీకి ఎంతో అనుకూలంగా ఉంటాయి. బ్రిటిష్ కాలం నాడు మొదలైన ఈ తాళ్ల తయారీ ఇప్పటికీ కొనసాగుతోంది. అజ్మల్ కసబ్ వంటి ఎందరో దోషుల శిక్షల అమలుకు ఇక్కడి నుంచే తాళ్లను తెప్పించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఉరితాడు తయారుచేసే తాడు పేరేంటి?
Image Credit : Pixabay

ఉరితాడు తయారుచేసే తాడు పేరేంటి?

ఉరిశిక్షలకు ఉపయోగించే తాడును మనీలా అంటారు. ఇది సాధారణ మార్కెట్ తాళ్ల కంటే భిన్నంగా, అత్యంత కచ్చితత్వంతో తయారవుతుంది. దీని తయారీలో ప్రత్యేకంగా పండించిన 'జె-34' రకం పత్తి దారాలను వినియోగిస్తారు. దాదాపు 7,200 సన్నని నూలు పోగులను చేతితో మాత్రమే మెలితిప్పి ఈ తాడును తయారుచేస్తారు. మెడ భాగం తెగిపోకుండా, అదే సమయంలో తాడు మధ్యలోనే తెగి ఉరిశిక్ష ఆగకుండా ఉండేందుకు దీన్ని ప్రత్యేక మిశ్రమాలతో శుద్ధి చేస్తారు. ఈ తాడు తయారీ క్రమంలో ఆవు నెయ్యి, ఆవనూనె, అరటిపండ్ల గుజ్జుతో పాటు గంగా జలాన్ని తాడుపై పూస్తారు. ఇలా చేయడం వల్ల తాడుకు కావలసిన మృదుత్వం, అత్యంత దృఢత్వం వస్తాయి.

33
తాడును వాడే ముందు పరీక్షలు
Image Credit : Pixabay

తాడును వాడే ముందు పరీక్షలు

ఒక్కో ఉరితాడు సుమారు 16 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. దీన్ని అధికారికంగా బయటకు పంపే ముందు జైలు అధికారులు నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తారు. శిక్ష పడిన వ్యక్తి బరువును దృష్టిలో ఉంచుకుని, అతడి కంటే దాదాపు రెట్టింపు బరువున్న ఇసుక బస్తాలను తాడుకు వేలాడదీసి ట్రయల్స్ నిర్వహిస్తారు. ఎండ, వాన తగలకుండా ప్రత్యేక చెక్క పెట్టెలలో పెట్టి భద్రంగా సంబంధిత జైళ్లకు ఈ తాడును తరలిస్తారు. ఇది ఎవరికి పడితే వారికి అమ్మే సాధారణ వస్తువు కాదు. న్యాయస్థానం లేదా అధికారిక జైలు యంత్రాంగం నుంచి స్పష్టమైన ఆర్డర్, ప్రభుత్వ నిబంధనల అనుమతులు వచ్చినప్పుడు మాత్రమే బక్సర్ జైలులో దీని తయారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
భారత దేశం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AP Travel: ఆంధ్రప్రదేశ్లోని కొండ ప్రాంతం ‘గాలి బండ’.. దీనిపైకి వెళితే తిరిగి రావాలనిపించనంత అందం
Recommended image2
Pizza Capital: ఏంటీ పిజ్జాకు ఓ పుట్టినిల్లు ఉందా? ఇక్కడి పిజ్జా స్పెషాలిటీలే వేరు
Recommended image3
Indian Railway: రైల్వే స్టేష‌న్ల‌లో గ‌డియారాలు 24 గంట‌ల ఫార్మాట్‌లో ఎందుకుంటాయో తెలుసా.?
Related Stories
Recommended image1
No Capital Country: ప్రపంచంలో రాజధాని లేని ఒకే ఒక్క దేశం ఏదో తెలుసా?
Recommended image2
AP Travel: ఆంధ్రప్రదేశ్లోని కొండ ప్రాంతం ‘గాలి బండ’.. దీనిపైకి వెళితే తిరిగి రావాలనిపించనంత అందం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved