- Home
- Feature
- Asia Deepest Gas Field: ఆసియాలోనే డీపెస్ట్ గ్యాస్ ఫీల్డ్..సముద్రం కింద నుంచి గ్యాస్ ఎలా తెస్తారు?
Asia Deepest Gas Field: ఆసియాలోనే డీపెస్ట్ గ్యాస్ ఫీల్డ్..సముద్రం కింద నుంచి గ్యాస్ ఎలా తెస్తారు?
Acia Deepest Gas Field: కాకినాడ బీచ్ లో నిలబడి సముద్రం వైపు చూస్తే ఖాళీగా కనిపిస్తుంది. కానీ ఆ నీళ్ల కింద ఆసియాలోనే డీపెస్ట్ గ్యాస్ ఫీల్డ్ నడుస్తోంది. మరి ఆ గ్యాస్ ని ఎలా పైకి తెస్తారు? ఇక్కడ తెలుసుకుందాం.

గ్యాస్ ని ఎలా పైకి తెస్తారు?
కాకినాడ సముద్రంలోకి వెళ్తే నీళ్ల మధ్యలో భారీ నిర్మాణాలు, పెద్ద పెద్ద పైపులు, కొన్నిచోట్ల నౌకల్లాంటి ప్లాట్‌ఫామ్‌లు కనిపిస్తాయి. వాటి దగ్గర ఏం జరుగుతుందో తెలుసా? సముద్రం అడుగున భూమి పొరల్లో దాగి ఉన్న సహజ వాయువును (Natural Gas) వెలికితీస్తుంటారు. వేల అడుగుల లోతులో ఉన్న గ్యాస్‌ను బయటకు తీసి, పైపుల ద్వారా ఒడ్డుకు తీసుకొచ్చి మన ఇళ్లకు, పరిశ్రమలకు సరఫరా చేస్తారు.
ఇక్కడ పని చేసేది రోబోలే
మొదట సముద్రంలో -100 మీటర్లు అంటే కిందికి. సముద్రం నుంచి దాదాపు 25 కిలోమీటర్లు వెళ్తే.. సముద్రంలో ఒకస్టీల్ ఫ్లాట్ ఫాం కనిపిస్తుంది. దాని పునాది నేరుగా సముద్రం అడుగున భూమి మీద ఉంటుంది. ఇది రిగ్ కాదు..ఒక జంక్షన్. అసలు బావులు ఇంకో 60 కిలోమీటర్ల లోపల ఉన్నాయి. లిఫ్ట్ ఇంకా కిందికి. అంటే మైనస్ వెయ్యి మీటర్లు కిందికి వెళ్తే...సూర్యకాంతి రాదు. అంతా చీకటే. మళ్లీ కిందికి అంటే మైనస్ 2 వేలు మీటర్లు కిందికి వెళ్తే..దాదాపు 35 చార్మినార్లు ఒకదానిపై ఒకటి పెడితే వచ్చే లోతు. ఇక్కడ నీటి ప్రెషర్...కారు టైరు కన్నా దాదాపు 90 రెట్లు. మనిషి రాలేడు. అందుకే ఇక్కడ పని మొత్తం రోబోలే చేస్తాయి.
మరి రిగ్ ఎక్కడుంది?
డ్రిల్ షిప్ పైన తేలుతూ..కిలోమీటర్ల పొడవు పైపు దింపి బావి తవ్వి వెళ్లిపోతుంది. మిగిలేది 55 టన్నుల స్టీల్ వాల్వల్ సెట్ మాత్రమే. ఇంజనీర్లు దీన్ని ట్రీ అంటారు. పొడవాటి కంట్రోల్ కేబుల్స్ తో దూరం నుంచే నడుస్తుంది. ఇంకా కిందికి వెళ్తే.. ఇక్కడ నీళ్లు ఉండవు, రాయి ఉంటుంది. అంటే రాతిపొరలు 7 కిలోమీటర్లకుపైగా మందంగా ఉంటాయి. పై పొరల్లో ఉన్నది కృష్ణా, గోదావరి కొట్టుకొచ్చిన మట్టి. ఆ మట్టిలో కలిసిన మొక్కలు, చిన్న జీవులు..కొన్ని కోట్ల సంవత్సరాలకి గ్యాస్ గా మారి రాళ్ల రంధ్రాల్లో ఇరుక్కుపోయాయి. బావి ఆ పొరని తాకగానే లోపలి ప్రెషర్ కి గ్యాస్ తనంతట తానే పైకి చేరుతుంది.
దీన్నే హైడ్రేట్ అంటారు
ఇప్పుడు లిఫ్ట్ పైకి గ్యాస్ తో పాటు, కానీ సగం దారిలోనే అసలైన సమస్య ఉంది. చల్లటి నీళ్లు, భారీ ప్రెషర్ ఉంటుంది. గ్యాస్ లో కొంచెం తడి కలిస్తే చాలు..పైప్ లోపలే ఐస్ లాంటి ముద్దలు కట్టి దారి మూసేస్తాయి. దీన్నే హైడ్రేట్ అంటారు. అందుకే పక్కనే ఇంకో పైప్ లో MEG అనే కెమికల్ పంపిస్తారు. కారు రేడియేటర్ లో యాంటీ ఫ్రీజ్ లాగా.
ఇదే గ్యాస్ ఎన్నో అవసరాలకి ఉపయోగపడుతుంది
సీ బెడ్ మీద 60 కిలో మీటర్లు ఫ్లాట్ ఫాం దాకా ..అక్కడినుంచి 25 కిలోమీటర్లు ఒడ్డుకి. గాడిమొగ టెర్మినల్ లో తడి తీసేసి, ప్రెషర్ పెంచి ఈస్ట్ వెస్ట్ పైప్ లైన్ లోకి, కాకినాడ నుంచి గుజరాత్ దాకా దాదాపు పద్నాలుగు వందల కిలోమీటర్ల ప్రయాణం. ఆ గ్యాస్ పొలంలో యూరియా అవుతుంది. ఆటోలో సీఎన్ జీ అవుతుంది. కరెంట్ అవుతుంది. అంటే రోజుకి దాదాపు రెండున్నర కోట్ల క్యూబిక్ మీటర్లు.













