Asianet News TeluguAsianet News Telugu

Bharat Ratna Award Winners: ఇప్పటివరకు ఎంతమందికి 'భారతరత్న' ఇచ్చారంటే..? పూర్తి జాబితా ఇదిగో.. 

Bharat Ratna Award Winners: భారతరత్న'పురస్కారాన్ని 1954 నుండి ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటివరకూ ఈ పురస్కరాన్ని 50 మంది ప్రముఖులు అందుకోగా.. ఇందులో  17 మందికి మరణానంతరం లభించింది. ఈ జాబితాలో ఈ ఏడాది ప్రముఖ సోషలిస్ట్ నేత, బీహార్ మాజీ సీఎం  కర్పూరి ఠాకూర్, మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీలకు చోటు దక్కింది. 

Bharat Ratna Award Winners Here is the full list of awardees KRJ
Author
First Published Feb 4, 2024, 5:39 AM IST

Bharat Ratna Award Winners: దేశంలో అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'. ఏదైనా రంగంలో విశేష కృషి చేసిన పౌరులకు కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరిస్తుంది. ఈ అవార్డును 1954 నుండి ఇవ్వడం ప్రారంభించారు. అలా తొలిసారి స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్‌ సివి రామన్‌, భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ 1954లో భారతరత్న అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును తొలుత జీవించి ఉన్నవారికే మాత్రమే ఇచ్చేవారు. కానీ, ఆ మరుసటి ఏడాది(1955) నుంచి ఈ అవార్డును మరణానంతరం కూడా ఇవ్వడం ప్రారంభించారు.  

ఈ అవార్డు ఎంపిక ఇతర అవార్డుల కంటే.. చాలా భిన్నంగా ఉంటుంది. ప్రధాని నేరుగా రాష్ట్రపతికి భారతరత్న అవార్డు కోసం వ్యక్తులను సిఫారసు చేస్తారు. కానీ ఒక కండీషన్ ఉంటుంది. ఒక్క  ఏడాదిలో గరిష్టంగా ముగ్గురికి మాత్రమే భారతరత్న పురస్కరాన్ని అందజేయాలి. మరో విషయమేమిటంటే.. ప్రతి సంవత్సరం ఈ అవార్డును ఇవ్వాలనే నిబంధన లేదు. కాగా ఇప్పటివరకూ ఈ పురస్కరాన్ని 50 మంది ప్రముఖులకు అందజేశారు. ఇందులో  17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. ఈ జాబితాలో ఈ ఏడాది ప్రముఖ సోషలిస్ట్ నేత, బీహార్ మాజీ సీఎం  కర్పూరి ఠాకూర్, మాజీ ఉప ప్రధాని ఎల్ కె అద్వానీలకు చోటు దక్కింది. 
 

ఇప్పటివరకు ‘భారతరత్న’ అందుకున్నవారు వీరే.. 

1. చక్రవర్తి రాజగోపాలాచారి (రాజకీయవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు)- 1954

2. సర్వేపల్లి రాధాకృష్ణన్ (భారత మాజీ రాష్ట్రపతి)- 1954

3. చంద్రశేఖర్ వెంకట రామన్ (భౌతిక శాస్త్రవేత్త)- 1954

4. భగవాన్ దాస్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1955

5. మోక్షగుండం విశ్వేశ్వరయ్య (సివిల్ ఇంజనీర్, రాజకీయవేత్త)- 1955

6. జవహర్‌లాల్ నెహ్రూ (భారత మాజీ ప్రధాని)- 1955

1956లో ఈ పురస్కారాన్ని తొలిసారి ప్రకటించలేదు. 

7. గోవింద్ వల్లభ్ పంత్ (స్వాతంత్ర్య సమరయోధుడు)- 1957

8. ధోండో కేశవ్ కర్వే (సంఘ సంస్కర్త)- 1958

1959, 60లో  ప్రకటించలేదు. 

9. బిధాన్ చంద్ర రాయ్ (వైద్యుడు, సామాజిక కార్యకర్త) - 1961

10. పురుషోత్తం దాస్ టాండన్ (స్వాతంత్ర్య సమర యోధుడు)- 1961

11. రాజేంద్ర ప్రసాద్ (భారత మాజీ రాష్ట్రపతి)- 1962

12. జాకీర్ హుస్సేన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1963

13. పాండురంగ్ వామన్ కేన్ (సంస్కృత పండితుడు)-1963

1964, 65లో  ప్రకటించలేదు. 

14. లాల్ బహదూర్ శాస్త్రి (మరణానంతరం) (భారత మాజీ ప్రధాని) – 1966

1967 నుంచి 1970 వరకు ఈ పురస్కారాన్ని ప్రకటించలేదు. 

15. ఇందిరా గాంధీ (భారత మాజీ ప్రధానమంత్రి)-1971

1972, 73,74లో విరామం 

16. వరాహగిరి వెంకట గిరి (భారత మాజీ రాష్ట్రపతి)-1975

17. కుమారస్వామి కామరాజ్ (మరణానంతరం) (రాజకీయవేత్త ) - 1976

1977, 78,79 లో విరామం 

18. మదర్ థెరిసా (మిషనరీస్ ఆఫ్ ఛారిటీ వ్యవస్థాపకురాలు) - 1980

1981, 82 లో ఈ అవార్డును ప్రకటించలేదు

19. వినోబా భావే (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు, )-1983

1984, 85, 86లో అవార్డును ప్రకటించలేదు

20. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ (స్వాతంత్ర్య పోరాట యోధుడు)-1987

21. మరుదూర్ గోపాలన్ రామచంద్రన్ (మరణానంతరం)(రాజకీయనేత)-1988

22. భీమ్ రావ్ రామ్‌జీ అంబేద్కర్ (మరణానంతరం) (సంఘ సంస్కర్త)-1990

23. నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా (వర్ణవివక్ష వ్యతిరేక పోరాట యోధుడు)- 1990

24. రాజీవ్ గాంధీ (మరణానంతరం) (భారత మాజీ ప్రధాని)-1991

25. సర్దార్ వల్లభాయ్ పటేల్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1991

26. మొరార్జీ రాంచోడ్జీ దేశాయ్ (భారత ప్రధాని)- 1991

27. మౌలానా అబుల్ కలాం ఆజాద్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు)-1992

28. జహంగీర్ రతన్‌జీ దాదాభాయ్ టాటా (పారిశ్రామికవేత్త)- 1992

29. సత్యజిత్ రే (చిత్ర నిర్మాత)- 1992

1993 నుంచి 1996 వరకు విరామం

30. గుల్జారీ లాల్ నందా (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1997

31. అరుణా అసఫ్ అలీ (మరణానంతరం) (స్వాతంత్ర్య సమర యోధుడు)- 1997

32. ఎ.పి.జె. అబ్దుల్ కలాం ( శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి)-1997

33. ఎం. ఎస్ సుబ్బులక్ష్మి (కర్ణాటక శాస్త్రీయ గాయని)-1998

34. చిదంబరం సుబ్రమణ్యం (స్వాతంత్ర్య పోరాట యోధుడు)- 1998

35. జయప్రకాష్ నారాయణ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య సమర యోధుడు)- 1999

36. అమర్త్య సేన్ (ఆర్థికవేత్త)- 1999

37. ప్రకాష్ గోపీనాథ్ బోర్డోలోయ్ (మరణానంతరం) (స్వాతంత్ర్య పోరాట యోధుడు) – 1999

38. రవిశంకర్ (సితార్ వాద్యకారుడు) - 1999

39. లతా దీనానాథ్ మంగేష్కర్ (గాయని)- 2001

40. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ (హిందుస్తానీ క్లాసికల్ షెహనాయ్ ప్లేయర్)- 2001

2002 నుండి 2008 వరకు ప్రకటించలేదు

41. భీంసేన్ గురురాజ్ జోషి (హిందుస్తానీ క్లాసికల్ సింగర్)- 2009

2010 నుంచి 2013 వరకు ఈ పురస్కారాన్ని ప్రకటించలేదు

42. సిఎన్ఆర్ రావు (కెమిస్ట్, ప్రొఫెసర్)- 2014

43. సచిన్ రమేష్ టెండూల్కర్ (క్రికెటర్)- 2014

44. అటల్ బిహారీ వాజ్‌పేయి (రాజకీయ నేత, భారత మాజీ ప్రధాని)- 2015

45. మదన్ మోహన్ మాలవీయ (మరణానంతరం) (విద్యా సంస్కర్త)- 2015

2016,2017, 2018ల్లో విరామం

46. ​​నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం) (సామాజిక కార్యకర్త)- 2019

47. భూపేంద్ర కుమార్ హజారికా (మరణానంతరం) (చలనచిత్ర నిర్మాత) - 2019

48. ప్రణబ్ ముఖర్జీ (భారత మాజీ రాష్ట్రపతి)- 2019

2020 నుంచి 2023 వరకు విరామం

49. కర్పూరి ఠాకూర్ (మరణానంతరం) (రాజకీయనేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి) – 2024

50. ఎల్‌కే అద్వానీ(రాజకీయ నేత, భారత మాజీ ప్రధాని)-2024
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios